బొగ్గు మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 2023లో మొత్తం బొగ్గు ఉత్పత్తి 78.65 మిలియన్ టన్నులకు చేరుకుంది
23-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు సంచిత ఉత్పత్తి 507.02 ఎం టీ నమోదు చేస్తుంది
కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తిలో 15.36% వృద్ధిని సాధించింది
గత ఏడాది 67.13 మెట్రిక్ టన్నుల బొగ్గు పంపిణీ 79.30 మెట్రిక్ టన్నులకు చేరుకుంది.
Posted On:
03 NOV 2023 11:48AM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2023 నెలలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ పెరుగుదలను సాధించింది, ఇది 78.65 మిలియన్ టన్నుల (ఎం టీ)కి చేరుకుంది, గత ఏడాది ఇదే నెలలో 66.32 ఎం టీ గణాంకాలను అధిగమించి, 18.59% పెరుగుదలను నమోదు చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీ ఐ ఎల్) ఉత్పత్తి 15.36% వృద్ధితో అక్టోబర్ 2022లో 52.94 ఎం టీతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో 61.07 ఎం టీ కి పెరిగింది. సంచిత బొగ్గు ఉత్పత్తి (అక్టోబర్ 2023 వరకు) ఆర్థిక సంవత్సరం' 22-23లో అదే కాలంలో 448.49 ఎం టీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం' 23-24లో 507.02 ఎం టీ కి గణనీయంగా పెరిగింది. 13.05% వృద్ధిని సాధించింది.
అదనంగా, బొగ్గు పంపిణీ అక్టోబరు 2023లో గణనీయమైన వృద్ధిని సాధించి 79.30 ఎం టీ కి చేరుకుంది, అక్టోబర్ 2022లో నమోదైన 67.13 ఎం టీతో పోలిస్తే అత్యుత్తమ పురోగతిని ప్రదర్శిస్తూ వృద్ధి రేటు 18.14% కి చేరుకుంది. కోల్ ఇండియా లిమిటెడ్ పంపిణీ గమనించదగ్గ పనితీరును సూచిస్తుంది, అక్టోబర్ 2023లో 61.65 ఎం టీ కి చేరుకుంది, అక్టోబర్ 2022లో 53.69 ఎం టీ తో పోలిస్తే, ఇది 14.83% వృద్ధిని సూచిస్తుంది. సంచిత బొగ్గు పంపిణీ (అక్టోబర్ 2023 వరకు) ఆర్థిక సంవత్సరం' 22-23లో 11.98 % వృద్ధితో 483.78 ఎం టీతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం' 23-24లో 541.73 ఎం టీ కి గణనీయంగా పెరిగింది.
బొగ్గు ఉత్పత్తి మరియు పంపిణీ రెండింటిలోనూ గుర్తించదగిన పెరుగుదల అభివృద్ధి చెందుతున్న శక్తిని దేశ స్వయం సమృద్ధిని నొక్కి చెబుతుంది మరియు రాబోయే ఇంధన డిమాండ్‌లను తీర్చాలనే సంకల్పాన్ని బలపరుస్తుంది. నిరంతర బొగ్గు ఉత్పత్తి మరియు పంపిణీని నిర్ధారించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతలో నిశ్చయత ఉంది, తద్వారా దేశం యొక్క కొనసాగుతున్న అభివృద్ధిని పెంపొందించడానికి ఆధారపడదగిన ఇంధన సరఫరాను సురక్షితం చేస్తుంది.
***
(Release ID: 1974395)
Visitor Counter : 120