బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎనిమిది ప్రధాన పరిశ్రమలలో సెప్టెంబర్‌లో 16.1% గణనీయ వృద్ధిని సాధించిన బొగ్గు రంగం
గత ఏడాది 58.04 ఎంటిలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌లో 67.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
వృద్ధిని ప్రోత్సహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవలి వ్యూహాత్మక చొరవల
Posted On:
02 NOV 2023 12:52PM by PIB Hyderabad
వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి సెప్టెంబర్ 2023 నెలకు గాను విడుదల చేసిన ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచీ ప్రకారం, బొగ్గు రంగం 16.1% ఆకట్టుకునే వృద్ధిని ప్రదర్శించి, గత ఏడాది ఇదే కాలంలోని 127.5 పాయింట్లతో పోలిస్తే 148.1 పాయింట్లకు చేరుకుంది. ఒక్క ఆగస్టు 2023ను మినహాయించి గత 14 నెలల్లో ఇది అత్యధిక వృద్ధి.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, సెప్టెంబర్ 2023లో ఎనిమిది ప్రధాన పరిశ్రమల ఉమ్మడి సూచీ 8.1% (తాత్కాలిక) గణనీయమైన పెరుగుదలను చూపిందని తాజా డాటా సూచిస్తోంది.
ఎనిమిది ప్రధాన పరిశ్రమల అంటే, సిమెంట్, బొగ్గు, ముడి చమురు, విద్యుత్, ఎరువులు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు సహా ఉమ్మడి, వ్యక్తిగత ఉత్పత్తి పనితీరును సూచీ కొలుస్తుంది.
సెప్టెంబర్ 2023లో బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల కారణంగా బొగ్గు రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించి, గత ఏడాదిలో ఇదే కాలంలో సాధించిన 58.04 ఎంటీల గణాంకాన్ని అధిగమించి 67.27 ఎంటికి చేరుకుని, 15.91% గణనీయమైన పెరుగుదలను సూచించింది.
బొగ్గు పరిశ్రమ ఏప్రిల్ 2023లో 9.1% వృద్ధిని నమోదు చేసి, నిలకడైన, స్థిరమైన వృద్ధిని ప్రదర్శిస్తూ సెప్టెంబర్ 2023లో 16.1%కి పెరిగింది.
వివిధ వ్యూహాత్మక చొరవల ద్వారా ఈ వృద్ధిని ప్రోత్సహించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించింది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి & నియంత్రణ) చట్టం, 2021లో సవరణ ద్వారా బొగ్గు లేదా లిగ్నైట్‌ను కాప్టివ్ గనులను అనుమతించి, వాణిజ్య బొగ్గు తవ్వకాల కోసం వేలం ఆధారిత వ్యవస్థ ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంపొందించడం, దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు మైన్ డెవలపర్ కమ్ ఆపరేటర్లను (ఎండిఒ) నిమగ్నం చేయడం, బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ఆదాయ- భాగస్వామ్యనమూనాలో నిలిపివేసిన గనులను తెరవడం వంటి చొరవలు ఇందులో ఉన్నాయి.
బొగ్గు రంగం గణనీయ వృద్ధి, ఎనిమిది ప్రధాన పరిశ్రమల మొత్తం వృద్ధికి దోహదం చేయడం అన్నది బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర కృషిని, చేపట్టిన చొరవలకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ కృషి, ప్రయత్నాలు ఆత్మనిర్భర్ భారత్ దృక్పథానికి అనుగుణంగా ఉండటమే కాక స్వయం సమృద్ధి, ఇంధన భద్రత దిశగా దేశ పురోగతికి దోహదం చేస్తాయి.
***
(Release ID: 1974309)
Visitor Counter : 73