ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్ అవతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2023 11:47AM by PIB Hyderabad

   మధ్యప్రదేశ్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘‘నానాటికీ ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కుతున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం అమృత కాలంలో దేశ సంకల్పాలను సాకారం చేసే దిశగా కీలక తోడ్పాటునిస్తుంది. రాష్ట్రం ఇలాగే సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అభివృద్ధిలో నిత్యం కొత్త శిఖరాలు అందుకుంటున్న మన మధ్యప్రదేశ్- అమృత కాలంలో దేశ సంకల్పాలను సాకారం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రాష్ట్రం ఇలాగే ప్రగతి పథంలో ముందడుగు వేయాలని నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*********

DS/SK


(రిలీజ్ ఐడి: 1973966) సందర్శకుల సూచీ సంఖ్య : : 205