హోం మంత్రిత్వ శాఖ
2023 సంవత్సరానికి గాను 4 ప్రత్యేక ఆపరేషన్లకు కేంద్ర హోం మంత్రి ప్రత్యేక ఆపరేషన్ మెడల్ ప్రదానం
Posted On:
31 OCT 2023 11:26AM by PIB Hyderabad
ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొని మేధస్సును, శౌర్యాన్ని ప్రదర్శించినందుకు ప్రదానం చేసే కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ పతకాలను 2023వ సంవత్సరానికి గాను 4 ప్రత్యేక ఆపరేషన్లకు అందించారు. అత్యున్నత ప్రణాళికతో కూడుకుని, దేశ/ రాష్ట్ర/ యుటిల భద్రతకు సంబంధించి, సమాజంలో అతిపెద్ద సంఖ్యలో ప్రజల భద్రతపై విశేష ప్రభావం చూపగల సామార్ధ్యంతో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆపరేషన్లను గుర్తించడం ఈ పతక లక్ష్యం. దీనిని 2018లో ఏర్పాటు చేశారు. కౌంటర్ టెర్రరిజం (తీవ్రవాదాన్ని ఎదుర్కొనడం), సరిహద్దు చర్య, ఆయుధాల నియంత్రణ, మాదక ద్రవ్యాల అక్రమరవాణాను నిరోధించడం, రక్షణ చర్యలు వంటి విభాగాలలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దీనిని ప్రతి ఏడాదీ అక్టోబర్ 31వ తేదీన ప్రకటిస్తారు. ఒక ఏడాదిలో సాధారణంగా 3 ప్రత్యేక ఆపరేషన్లను అవార్డు కోసం పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్ర/ యూటీ పోలీసులను ప్రోత్సహించేందుకు అసాధారణ పరిస్థితులలో ఈ అవార్డును దాదాపు 5 ప్రత్యేక ఆపరేషన్ల వరకు ఇస్తారు.
అవార్డుగ్రహీతల జాబితా కోసం దిగువ లింక్‌ను క్లిక్ చేయండి-
Click here for List of Awardees
****
(Release ID: 1973597)
Visitor Counter : 147
Read this release in:
Tamil
,
Malayalam
,
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati