విద్యుత్తు మంత్రిత్వ శాఖ
జాతీయ ఏకతా దినోత్సవంనాడు ఐక్యత కోసం పరుగులో పాలుపంచుకున్న విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు
సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్ధం ప్రతి ఒక్కరూ జాతీయ ఏకతా దినోత్సవాన్ని పాటించాలిః కేంద్ర విద్యుత్ & నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రి
Posted On:
31 OCT 2023 12:42PM by PIB Hyderabad
భారత దేశపు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఏకతా దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ (ఐక్యత కోసం పరుగు)లో విద్యుత్ శాఖ మంత్రి కూడా పాల్గొన్నారు. పటేల్ 148వ జయంతి ఉత్సవం సందర్భంగారన్ ఫర్ యూనిటీని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద కేంద్ర విద్యుత్, నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ పటేల్ ప్రారంభించారు.
అనంతరం మీడియాను, దాని అనుబంధం సంస్థలలోని అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్ధం ప్రతి పౌరుడు జాతీయ ఏకతా దివస్‌ను జరుపుకోవాలని విద్యుత్ మంత్రి ఉద్బోధించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సాధన తరువాత రాజ సంస్థానాలను భారత యూనియన్‌లో సమగ్రం చేయడంలో పటేల్ పోషించిన నాయకత్వ పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. అంతకుముందు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, దాని ఆధీనంలోని సంస్థల అధికారుల చేత మంత్రి సమగ్రతా ప్రతిజ్ఞను చేయించారు.
పిఐబి పరిశోధన యూనిట్ వెలువరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ః ది మాన్ హూ యునైటెడ్ ది నేషన్‌ను కూడా ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చదువవచ్చు.
Also read: Sardar Vallabhbhai Patel: The Man Who United the Nation (by Research Unit, PIB)
(Release ID: 1973596)
Visitor Counter : 176