సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

గోవాలోని 54వ ఐ ఎఫ్ ఎఫ్ ఐ కోసం అంతర్జాతీయ జ్యూరీని ప్రకటించారు

Posted On: 31 OCT 2023 2:48PM by PIB Hyderabad

54వ ఐ ఎఫ్ ఎఫ్ ఐ  కోసం అంతర్జాతీయ పోటీ మరియు అత్యుత్తమ తీర్పునిచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత చిత్రనిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, చిత్ర నిర్మాతలు  అంతర్జాతీయ జ్యూరీ సభ్యులుగా ఆహ్వానించబడ్డారు.

 

 ఈ సంవత్సరం ఫెస్టివల్‌ లో డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్ అవార్డు కోసం  105 దేశాల నుండి 2926 ఎంట్రీలు వచ్చి రికార్డు సృష్టించాయి.

 

'అంతర్జాతీయ పోటీ' లో ప్రముఖ కళా ప్రక్రియలలో మాస్టర్స్ మరియు యువత  సినిమా సౌందర్య కోణం మరియు రాజకీయాలలో అభివృద్ధి చెందుతున్న పోకడలను సూచించే చలనచిత్రాలపై సమదృష్టి ని పాటిస్తూ 15 ప్రశంసలు పొందిన చలనచిత్రాలను ఎంపికచేస్తారు.  అంతర్జాతీయ జ్యూరీ గౌరవ విజేతను ఎంపిక చేస్తుంది

 

ఉత్తమ చలనచిత్ర అవార్డుకు బంగారు నెమలి, 40 లక్షల రూపాయల నగదు మరియు దర్శకుడు మరియు నిర్మాతకు సర్టిఫికేట్‌ ఉంటాయి.

 

ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (పురుషుడు), ఉత్తమ నటి (మహిళ) మరియు ప్రత్యేక జ్యూరీ బహుమతి విభాగాల్లో కూడా జ్యూరీ విజేతలను నిర్ణయిస్తుంది.

 

‘ఒక దర్శకుడి యొక్క ఉత్తమ తొలి చిత్రం కోసం పోటీ’  సంకలనం లో తరువాతి తరం చిత్రనిర్మాతలు తెరపై ఊహించిన వాటిని దృశ్య కల్పనతో సాగే తొలి చిత్రాలకు బంగారు నెమలి, 10 లక్షల రూపాయల నగదు మరియు సర్టిఫికేట్‌ కోసం 7 మంది తొలి చిత్ర దర్శకులు పోటీపడతారు.

 

అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు చలనచిత్ర నిర్మాణం యొక్క ఆవశ్యక అంశాలకు ప్రాతినిధ్యం వహించే ప్రఖ్యాత పరిశ్రమ అనుభవజ్ఞులు:

 

శేఖర్ కపూర్ (చిత్రనిర్మాత) - ఛైర్మన్, జ్యూరీ - శేఖర్ కపూర్ ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత, నటుడు, కథకుడు మరియు నిర్మాత. ఆయన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ మరియు ఆస్కార్‌లకు నామినేషన్‌తో పాటు పద్మశ్రీ, నేషనల్ ఫిల్మ్ అవార్డు, బాఫ్టా అవార్డు, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్ మరియు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు.

ఆయన కేన్స్ ఇంటర్నేషనల్ జ్యూరీ (2010) మాజీ సభ్యుడు, ఐ ఎఫ్ ఎఫ్ ఐ జ్యూరీ చైర్మన్ (2015), ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

 

జోస్ లూయిస్ ఆల్కైన్ (సినిమాటోగ్రాఫర్) - జోస్ లూయిస్ ఆల్కైన్ 1970లలో ఫ్లోరోసెంట్ ట్యూబ్‌ను కీ లైటింగ్‌గా ఉపయోగించిన మొదటి సినిమాటోగ్రాఫర్. బెల్లె ఎపోక్ (అకాడెమీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, 1993), టూ మచ్ (1995) వంటి చిత్రాలకు పనిచేశారు.

బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ (1999), మరియు ది స్కిన్ ఐ లివ్ ఇన్ (2011). బహుళ-అవార్డ్ విజేత జోస్ లూయిస్ పెడ్రో అల్మోడోవర్‌తో తన సహకారానికి ప్రసిద్ధి చెందాడు.

 

జెరోమ్ పైలార్డ్ (ఫిల్మ్ ప్రొడ్యూసర్,ఫిల్మ్ మార్కెట్ మాజీ హెడ్) - క్లాసికల్ రికార్డ్ లేబుల్ కోసం శాస్త్రీయ సంగీతకారుడు, కళాత్మక దర్శకుడు మరియు సీ ఎఫ్ ఓ గా వరుసగా పనిచేసిన తర్వాత, జెరోమ్ పైలార్డ్ ఎరాటో ఫిలిమ్స్‌లో డేనియల్ టోస్కాన్ డు ప్లాంటియర్‌తో కలిసి సత్యజిత్ రే, మెహదీ ఛరేఫ్, సౌలేమనే సిస్సే, మారిస్ పియలట్, జీన్-చార్లెస్ టాచెల్లా వంటి ప్రముఖ దర్శకులతో డజనుకు పైగా చలన చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత  1925 నుండి 2025 వరకు ఫెస్టివల్ డి కేన్స్‌  కు ఆయన సేవలందించారు.  ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ చలనచిత్ర మార్కెట్‌గా గుర్తింపు పొందిన మార్చే డు ఫిల్మ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అభివృద్ధి మరియు నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. 

 

శ్రీమతి కేథరీన్ డస్సార్ట్ (సినిమా నిర్మాత) - కేథరీన్ డస్సార్ట్ దాదాపు 15 దేశాల్లో దాదాపు 100 చిత్రాలను నిర్మించారు లేదా సహ నిర్మాతగా ఉన్నారు. హూ హూ షిజే లింఘున్ కే  (2017), ది మిస్సింగ్ పిక్చర్ (2013) మరియు ఎక్సిల్ (2016) చిత్రాలకు ప్రసిద్ధి. ఆమె ఇటీవలి నిర్మాణాలలో లైలా కూడా ఉంది అమోస్ గీతాయ్ ద్వారా హైఫా (2020 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీలో ఉంది); రితీ పాన్ (2020 బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు)  లెస్ ఇరాడియేస్ (రేడియేటెడ్) అలాగే కేథరీన్ డస్సార్ట్ దోహా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి సలహాదారు. 

 

శ్రీమతి హెలెన్ లీక్ (చిత్ర నిర్మాత) - హెలెన్ లీక్ ఏ ఎం ఆస్ట్రేలియా లో గౌరవ సృజనాత్మక నిర్మాతలలో ఒకరు. ఆమె ఫీచర్ క్రెడిట్‌లలో అలెగ్జాండ్రా పార్క్‌తో కార్నిఫెక్స్, సిసి స్ట్రింగర్ మరియు హ్యారీ గ్రీన్‌వుడ్, జాసన్ క్లార్క్‌తో స్వెర్వ్, వోల్ఫ్ క్రీక్ 2, రస్సెల్ క్రోవ్‌తో హెవెన్స్ బర్నింగ్ మరియు బ్లాక్ అండ్ వైట్‌లో రాబర్ట్ కార్లైల్, డేవిడ్ నగూంబుజర్రా మరియు చార్లెస్ డాన్స్ నటించారు. 

 

ఐ ఎఫ్ ఎఫ్ ఐ దక్షిణాసియాలో ప్రపంచ సినిమా యొక్క అతిపెద్ద ఉత్సవం నవంబర్ 20 - 28, 2023 వరకు సుందరమైన గోవా రాష్ట్రంలో జరుగుతుంది, ఇక్కడ అంతర్జాతీయ మరియు జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులు మరియు వేలాది మంది సినీ ప్రముఖులు ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో పాల్గొంటారు.

 

***



(Release ID: 1973595) Visitor Counter : 183