సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రధాని మోదీ విజన్ ఇండియా@2047 నెరవేర్చేందుకు ఐఐపిఎ పనిచేస్తుందని చెప్పిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఐఐపిఎ దృష్టి సారిస్తుంది. ప్రభుత్వానికి చెందిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లను అమలు చేయడానికి అవగాహన పెంచుతుంది మరియు విద్యను అందిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
"పారదర్శకత, జవాబుదారీతనం, పౌర-కేంద్రీకృతమైన పాలన కోసం ప్రధానమంత్రి విజన్‌కు సంబంధించిన టార్చ్‌బేరర్‌లను ఐఐపీఏ వెలికితీస్తుంది": డాక్టర్ జితేంద్ర సింగ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జనరల్ బాడీ 69వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
31 OCT 2023 4:09PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్ ఇండియా@2047 నెరవేర్చేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపిఎ) పనిచేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సంస్థ సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తుంది. ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లను అమలు చేయడంలో సహాయపడటానికి అవగాహన పెంచడం మరియు విద్యను అందజేస్తుంది అని ఐఐపిఎ చైర్మన్ కూడా అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎంఒఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఐఐపిఎ జనరల్ బాడీ 69వ వార్షిక సమావేశంలో ప్రసంగించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఐఐపిఎ సమకాలీన కాలంలోని నిబంధనలకు అనుగుణంగా తనను తాను తిరిగి మార్చుకుందని, ఇటీవలి సంవత్సరాలలో అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
"ఐఐపిఎ నేడు సాయుధ దళాల అధికారులు మరియు పంచాయతీ రాజ్ సంస్థల (పిఆర్‌ఐలు) సభ్యుల కోసం ప్రత్యేక కోర్సులను రూపొందించింది.తన శిక్షణా కార్యక్రమాలలో ఇప్పుడు ఐఏఎస్ ప్రొబేషనర్లు మరియు సీనియర్ సెంట్రల్ సర్వీసెస్ అధికారులు మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్‌ఓలు) ఉన్నారు" అని ఆయన తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఐఐపిఎ మిషన్ కర్మయోగి ప్రారంభ్‌ను రూపొందించడానికి మరియు నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసే శాస్త్రీయ మాడ్యూల్ ఆధారంగా iGOT ప్లాట్‌ఫారమ్‌లో 500 కంటే ఎక్కువ వీడియోలను సిద్ధం చేయడానికి కూడా దోహదపడింది. రోజ్‌గార్ మేళాల డాక్యుమెంటేషన్‌ను కూడా IIPA సిద్ధం చేస్తోంది.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..గత రెండేళ్ళలో ఇదే విధమైన ఆదేశాన్ని కలిగి ఉన్న అన్ని ఇతర సంస్థలను ఏకీకృతం చేయడంలో కూడా ఐఐపిఎ కీలక పాత్ర పోషిస్తోంది. వారు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, ఎన్‌పిఎస్‌ఏఏ,డిఒపిటి,డిఏఆర్‌పిజి మరియు దేశవ్యాప్తంగా ఉన్న స్వయంప్రతిపత్త శిక్షణా సంస్థలతో కూడా దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు" అని చెప్పారు.
"ప్రధానమంత్రి పాలనా దృక్పథానికి అనుగుణంగా వారి చేరువ పెరిగింది," అని ఆయన అన్నారు. "ఇవన్నీ ఉద్యోగులు "రూల్ టు రోల్" ఆధారిత కర్మయోగులుగా ఉండకుండా తమను తాము తిరిగి మార్చుకునేలా నైపుణ్యాలను అందించడంలో సహాయపడుతున్నాయి.
పౌరులకు సేవలను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నఐఐపియఎ యొక్క వివిధ శాఖలు "పారదర్శకత, జవాబుదారీతనం, పౌర-కేంద్రీకృతమైన పాలన కోసం ప్రధానమంత్రి దృష్టికి టార్చ్‌బేరర్లుగా నిలుస్తాయి. ” అని తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..గత 9-10 సంవత్సరాలలో ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వం లోయర్ గ్రేడ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఇంటర్వ్యూలను తొలగించడం మరియు 13 భాషలలో ఎస్‌ఎస్‌సి పరీక్షలను నిర్వహించడం వంటి కొన్ని మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. 22 షెడ్యూల్డ్ భాషలలో పరీక్షలు నిర్వహించబడతున్నాయని..తద్వారా భాషా అవరోధాల కారణంగా ఎవరూ నష్టపోరని చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ సిపిజీఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌లో సేవలను మెరుగుపరచడంలో సాంకేతికత ఒక ముఖ్యమైన సాధనం అని చెప్పారు.పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ద్వారా రూపొందించబడిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేయబడుతుందని తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారతదేశాన్ని విక్షిత్ భారత్@2047గా మార్చడానికి అమృత్‌కాల్ సందర్భంగా నేటి యువతను వాస్తుశిల్పులుగా తీర్చిదిద్దేందుకు ఐఐపిఎ ఉత్ప్రేరకం అవుతుందని అన్నారు.
***
(Release ID: 1973594)
Visitor Counter : 133