యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఈ రోజు కర్తవ్య పథ్ వద్ద జరిగిన నా మట్టి నాదేశం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
హిమాచల్ ప్రదేశ్ నుంచి కలశాలతో వచ్చిన మట్టి ని చెందిన కలశ యాత్రికులతో కలిసి అమృత్ కలశంలో కలిపిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
30 OCT 2023 6:51PM by PIB Hyderabad
ఈ రోజు కర్తవ్య పథ్ వద్ద జరిగిన నా మట్టి నాదేశం ముగింపు కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 143 మంది ప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రి హిమాచల్ ప్రదేశ్ నుంచి కలశాలతో వచ్చిన మట్టి ని అమృత్ కలశంలో కలిపారు.
ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ గత రెండేళ్లలో దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద నిర్వహించిన లక్షలాది కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు ప్రజల భాగస్వామ్యంతో నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.భారతదేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో అమృత కలశ యాత్రలు నిర్వహించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టిని సేకరించామని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నా మట్టి నాదేశం కార్యక్రమం విజయవంతం అయ్యిందని మంత్రి అన్నారు. త్యాగాలకు మారుపేరైన హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ధైర్యవంతులు అని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక విజయగాధ వినిపిస్తుందని మంత్రి అన్నారు. . ఈ రోజు కర్తవ్య పథ్ వద్ద లక్షలాది మంది ప్రజలు దేశానికి , అమరవీరులకు సెల్యూట్ చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్నారని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. దేశంలోని యువత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదాన్ని బలోపేతం చేస్తోందన్నారు
దేశవ్యాప్త అమృత కలశ యాత్రను పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలతో పాటు బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించారు.
నా మట్టి నా దేశం గురించి
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు, వీరాంగణులకు నివాళిగా ప్రభుత్వం నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించింది.కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చేయాలనే లక్ష్యంతో పంచాయతీ / గ్రామం, బ్లాక్, పట్టణ స్థానిక సంస్థ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి. . మహోన్నత త్యాగం చేసిన ధైర్యవంతులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి శిలాఫలకం (స్మారక చిహ్నం) నిర్మించడం వంటి కార్యకలాపాలు అమలు జరిగాయి. శిలాఫలకం వద్ద ప్రజలు 'పంచ ప్రాణ్' ప్రతిజ్ఞ తీసుకుని స్వదేశీ జాతుల మొక్కలు నాటి , 'అమృత్ వాటికా' (వసుధ వందన్) అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. , స్వాతంత్ర్య సమరయోధులు, మరణించిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించారు.
మేరా యువ భారత్ గురించి
స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా మేరా యువ భారత్ (ఎంవై భారత్) పనిచేస్తోంది.దేశంలో యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు మేరా యువ భారత్ ఏకగవాక్ష విధానంలో సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రతి యువతకు సమాన అవకాశాలు కల్పించాలి అన్న ప్రధానమంత్రి సూచనలకు అనుగుణంగా యువత ఆకాంక్షలను సాకారం చేయడానికి వికసిత భారత్ ' నిర్మాణానికి దోహదపడే వ్యవస్థ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. సమాజంలో మార్పు తీసుకు వచ్చే వ్యక్తులుగా జాతి నిర్మాతలుగా మారడానికి యువతను ప్రేరేపించడం, ప్రభుత్వానికి, పౌరులకు మధ్య 'యువసేతు'గా వ్యవహరించేలా చేయడం లక్ష్యంగా మేరా యువ భారత్ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా యువత నాయకత్వంలో కార్యక్రమాలు అమలు చేయడానికి మేరా యువ భారత్ ప్రాధాన్యత ఇస్తోంది.
***
(Release ID: 1973244)
Visitor Counter : 66