బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య బొగ్గు తవ్వకాలకు అవసరమైన నిధులు సమీకరించడానికి ప్రణాళిక రూపొందిస్తున్న బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి సంస్కరణలు
వాణిజ్య బొగ్గు తవ్వకాలకు అవసరమైన నిధులు సమీకరించే అంశంపై సంబంధిత వర్గాలతో చర్చలు నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
28 OCT 2023 2:28PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు రంగంలో సరళీకృత విధానాలు అమలు చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా వాణిజ్య బొగ్గు తవ్వకాలకు ఆమోదం తెలిపిన బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు అమ్మకం, వినియోగంపై పరిమితులను తొలగించింది.బొగ్గు గనులకు అవసరమైన నిధులు సమీకరించడానికి, విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బొగ్గు గనులకు సౌకర్యవంతమైన వేలం నిబంధనలు ప్రవేశపెట్టింది.
2020లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వాణిజ్య బొగ్గు తవ్వకాల వేలం ప్రక్రియ ప్రారంభించారు.పథకం ప్రారంభమైన తర్వాత ఇంతవరకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఏడు విడతల్లో 91 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేసింది. వేలంలో ఎక్కువ మంది పాల్గొనేలా చూసేందుకు బొగ్గు రంగంలో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి పెట్టుబడులు ఆకర్షించడానికి మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. బొగ్గు గనుల నిర్వహణలో నిధులు ఒక కీలకమైన అంశంగా ఉంటాయి. నిధుల సమీకరణలో బ్యాంకులు/ఆర్థిక సంస్థ (ఎఫ్‌ఐలు) ఎదురవుతున్న సమస్యలను మంత్రిత్వ శాఖ దృష్టికి పరిశ్రమలు వివరించాయి. పర్యావరణ, సామాజిక మరియు పాలన (ESG) నిబంధనల పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు/ఆర్థిక సంస్థలు బొగ్గు ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చడానికి ముందుకు రావడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
నిధుల సమీకరణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించి వేగంగా నిధులు విడుదల అయ్యేలా చూసేందుకు మంత్రిత్వ శాఖ "భారతదేశంలో వాణిజ్య బొగ్గు గనుల నిధులు" అనే అంశంపై సంబంధిత వర్గాలతో సమావేశం నిర్వహించింది.సమావేశంలో బొగ్గు గనుల కేటాయింపు పొందినవారు, ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాణిజ్య బొగ్గు తవ్వకాలకు అవసరమైన నిధులు సమీకరించే అంశంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించడానికి, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలూ, సూచనలు సేకరించడం లక్ష్యంగా సమావేశం జరిగింది. .
సమావేశంలో పాల్గొన్న బ్యాంకులు బొగ్గు గనులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయడానికి తమ సుముఖత వ్యక్తం చేశాయి, ప్రాజెక్ట్ ఆర్థిక వెసులుబాటు, మూలధనం సేకరణ లాంటి అంశలపై బ్యాంకులు వివరణాత్మక వ్యాపార ప్రణాళిక అందించాయి. భవిష్యత్‌లో బొగ్గు ప్రాథమిక ఇంధన వనరుగా ఉంటుందని గుర్తించిన బొగ్గు మంత్రిత్వ శాఖ, బొగ్గు రంగాన్ని 'మౌలిక సదుపాయాల రంగం' పరిధిలోకి తీసుకురావాలని ఆర్థిక సేవల శాఖ (DFS)ని బొగ్గు మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. ఈ పునర్విభజన వల్ల బొగ్గు రంగంలో పెరుగుతున్న ఆర్థిక అవసరాలను సకాలంలో తీర్చడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరింత సమర్థవంతంగా విధానాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. బొగ్గు గనుల అభివృద్ధి కార్యాచరణకు అవసరమైన నిధుల పరిమాణాన్ని నిర్ణయించడానికి బొగ్గు గనుల కేటాయింపు దారుల అభిప్రాయాలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. నిధుల అవసరాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక అందించాలని కూడా మంత్రిత్వ శాఖ కోరింది.పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిధులు విడుదల చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి సమగ్ర సమాచారాన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలకు మంత్రిత్వ శాఖ అందించింది.
బొగ్గు గనుల నిర్వహణకు అవసరమైన నిధుల అవసరాలు తీర్చేందుకు ఏక గవాక్ష విధానంలో పనిచేసే నోడల్ శాఖలను గుర్తించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక కమర్షియల్ బొగ్గు గని అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేసింది.. అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా నిధులు విడుదల చేయడానికి రూపొందించిన ప్రణాళికకు బోర్డు ఆమోదించిన విధానాలను రూపొందించే కార్యక్రమాన్నిబ్యాంకులు/ఆర్థిక సంస్థలు ప్రారంభించాయి.
గత నాలుగు దశాబ్దాలుగా భారత బొగ్గు రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.స్వదేశీ బొగ్గు నిల్వల సమృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే, భవిష్యత్‌లో బొగ్గు ప్రాథమిక ఇంధన వనరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
***
(Release ID: 1972713)
Visitor Counter : 78