ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల శ్రీ సద్గురు సేవాసంఘ్ ట్రస్టులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
రఘువీర్ మందిరంలో దైవదర్శనం చేసుకుని పూజలు నిర్వహించిన ప్రధాని;
జానకీకుండ్ చికిత్సాలయంలో కొత్త విభాగానికి ప్రారంభోత్సవం
Posted On:
27 OCT 2023 7:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల శ్రీ సద్గురు సేవాసంఘ్ ట్రస్టులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీర్ మందిరంలో ఆయన దైవదర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రణ్‌ఛోడ్‌దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి శ్రీరామ సంస్కృత మహా విద్యాలయానికి వెళ్లి, గురుకుల కార్యక్రమాల గ్యాలరీని తిలకించారు. అనంతరం సద్గురు నేత్ర చికిత్సాలయను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా తిలకించారు. అటుపైన సద్గురు వైద్యనగరం నమూనాను ప్రధాని పరిశీలించారు.
ఈ సందర్భంగా జానకీకుండ్ చికిత్సాలయం సందర్శన అనంతరం అక్కడ కొత్త విభాగానికి ప్రారంభోత్సవం చేశారు. అలాగే దివంగత శ్రీ అరవింద్ భాయ్ మఫత్ లాల్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానితోపాటు మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు కూడా పాల్గొన్నారు.
(Release ID: 1972416)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam