సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అనుభవ్ అవార్డులు 2023నిప్రదానం చేయనున్న .కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌ను కూడా ప్రారంభించనున్న డాక్టర్ జితేంద్ర సింగ్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ & బ్యాంక్ ఆఫ్ బరోడాల ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ 2.0 పోర్టల్‌ను అక్టోబర్ 23న ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
పెండింగ్‌లో ఉన్న పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన అఖిల భారత పెన్షన్ అదాలత్
Posted On:
22 OCT 2023 10:58AM by PIB Hyderabad
రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అనుభవ్ అవార్డులు 2023లను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేస్తారు. 2023 సంవత్సరానికి సంబంధించి అత్యుతమ వ్యాసాలు రాసిన సిబ్బందిని సన్మానించేందుకు పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 23.10.23న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అనుభవ అవార్డుల 2023 ప్రదానోత్సవం జరుగుతుంది.
ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆదేశాల మేరకు మార్చి 2015 న పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ అనుభవ్ పోర్టల్‌ను ప్రారంభించింది. పదవీ విరమణ చేసిన/పదవీ విరమణ చేసిన ఉద్యోగులు విధి నిర్వహణలో తాము కనబరిచిన ప్రతిభ, అందించిన సేవల వివరాలు ఆన్‌లైన్ లో వివరించడానికి, సమర్పించడానికి పోర్టల్ ఒక వేదికగా ఉంటుంది. ప్రభుత్వంలో పనిచేసిన వారు అనుభవాలను పంచుకోవడానికి , పాలనను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వడానికి.పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ అంభివృధి చేసిన అనుభవ పోర్టల్‌లో 96 మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థలు నమోదు అయ్యాయి.ఇప్పటివరకు పోర్టల్ లో 10000 కు పైగా వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.
త్వరలో పదవీ విరమణ చేస్తున్న /పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ అనుభవాలను అనుభవ్ పోర్టల్ లో పెద్ద సంఖ్యలో పొందుపరిచే విధంగా ఈ ఏడాది కార్యక్రమాన్ని అమలు చేశారు. అనుభవ పోర్టల్ లో 1901 మంది ఉద్యోగులు తమ అనుభవాలను పొందుపరిచారు. 2015లో పోర్టల్ ప్రారంభమైన నాటి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అనుభవాలు అందడం ఇదే తొలిసారి. సిఐఎస్ఎఫ్ నుంచి అత్యధిక సంఖ్యలో అనుభవాలు అందాయి. అందిన వ్యాసాలను పరిశీలించిన తర్వాత, 4 అనుభవ్ అవార్డులు, 9 జ్యూరీ సర్టిఫికేట్‌లను అందించాలని నిర్ణయించారు. 8 వేర్వేరు మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థల నుంచి అవార్డు గ్రహీతలు ఎంపిక అయ్యారు.కార్యక్రమంలో ఎక్కువ మంది ఉద్యోగులు పాల్గొనేలా చూసేందుకు మొదటిసారిగా 9 జ్యూరీ సర్టిఫికేట్‌లను కూడా ప్రదానం చేస్తున్నారు. అనుభవ్ అవార్డు గ్రహీతలను మెడల్, సర్టిఫికెట్, రూ.10,000/- నగదు బహుమతితో సత్కరిస్తారు. జ్యూరీ సర్టిఫికెట్ విజేతలకు మెడల్,సర్టిఫికెట్ అందిస్తారు.
పదవి విరామం చేస్తున్న ఉద్యోగుల కోసం పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ (PRC) వర్క్‌షాప్‌ని కూడా నిర్వహిస్తోంది, ఇది పెన్షనర్ల 'ఈజ్ ఆఫ్ లివింగ్' దిశలో విప్లవాత్మక అడుగు. త్వరలో పదవీ విరమణ చేయబోయే ఉద్యోగుల, పదవీ విరమణ ప్రయోజనాలు, మంజూరు ప్రక్రియకు సంబంధించిన సంబంధిత సమాచారం వర్క్‌షాప్‌లోఅందిస్తారు.
అఖిల భారత పెన్షన్ అదాలత్ ను పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా పెన్షన్ అదాలత్ పనిచేస్తోంది. ఇప్పటి వరకు పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 08 పెన్షన్ అదాలత్‌లు నిర్వహించింది. అందిన 24, 671 ఫిర్యాదుల్లో 17,551(71%)ఫిర్యాదులను పెన్షన్ అదాలత్ లో పాల్గొన్న వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థలు పరిష్కరించాయి.
జాతీయ స్థాయిలో నిర్వహించే లోక్ అదాలత్ లో మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ చెల్లింపు ఆర్డర్ కేసులను ఢిల్లీలో పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ పరిశీలించి పరిష్కరిస్తుంది. దేశంలోని ఇతర ప్రదేశాలలో కూడా అదాలత్ నిర్వహిస్తారు.
పెన్షన్ పొందుతున్న ఉద్యోగులకు అందిస్తున్న సేవలను క్రమబద్దీకరించడానికి పోర్టల్‌లను ఏకీకృతం చేయాలని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా పెన్షన్ అందిస్తున్న బ్యాంకులు,అనుభవ్,సీపీ గ్రామ్స్, సిజిహెచ్ఎస్ లాంటి పోర్టల్‌లను కొత్తగా రూపొందించిన “ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్” (https://ipension.nic.in)లో ఏకీకృతం చేస్తారు.
బ్యాంకు మార్పు, జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడం, పెన్షనర్ల మరణ ధృవీకరణ పత్రం సమర్పించడం, పెన్షన్ స్లిప్ , పెన్షన్ స్లిప్ తిరిగి పొందడం, ఆదాయపు పన్ను మినహాయింపు డేటా/ఫారమ్ 16, పెన్షన్ రసీదు సమాచారం వంటి అంశాలలో బ్యాంకులతో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడానికి. పెన్షన్ అందిస్తున్న బ్యాంకుల వెబ్‌సైట్‌లు కూడా ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తారు. . భవిష్య పోర్టల్‌తోఎస్బిఐ, కెనరా బ్యాంక్ ల పెన్షన్ సేవా పోర్టల్‌ను అనుసంధానించే పని ఇప్పటికే పూర్తయింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ,బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తమ పెన్షన్ పోర్టల్‌లను ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌తో అనుసంధానించాయి. నెలవారీ పెన్షన్ స్లిప్, స్టేటస్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్, పెన్షనర్ సమర్పణ ఫారమ్16, పెన్షన్ బకాయిలు తదితర సేవలను ఈ బ్యాంకులు అందిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్‌ను కేంద్రమంత్రి ప్రారంభిస్తారు.
70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేందుకు వీలుగా 2023 నవంబర్ నెలలో పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారం 2.0ను నిర్వహిస్తుంది. 17 బ్యాంకుల సహకారంతో దేశంలోని 100 నగరాల్లోని 500 ప్రదేశాలలో శిబిరాలు నిర్వహిస్తారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పోర్టల్‌ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 23 అక్టోబర్ 2023న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభిస్తారు.
***
(Release ID: 1971777)
Visitor Counter : 105