ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రగతి సమీక్షా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


ఏడు రాష్ట్రాలలో 31,000 కోట్ల రూపాయలతో చేపడుతున్న 8 కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ప్రధానమంత్రి.

యుఎస్‌ఒఎఫ్‌ ప్రాజెక్టుల కింద మొబైల్‌ టవర్లు, 4 జి కవరేజ్‌పై సమీక్ష

మొబైల్‌ టవర్లు లేని గ్రామాలలో ఈ ఆర్థిక సంవత్సరం చివరి లోగా , మొబైల్‌టవర్లు ఏర్పాటయ్యేలా చూడాల్సిందిగా ఆదేశించిన ప్రధానమంత్రి.

Posted On: 25 OCT 2023 9:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రగతి` ఐసిటి ఆధారిత
మల్టీమోడల్‌ ప్లాట్‌ఫారం ఫర్‌ ప్రో యాక్టివ్‌ గవర్నెన్స్‌, టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్‌ (పి.ఆర్‌.ఎ.జి.ఎ.టి.హెచ్‌.ఐ) 43 వ సంచిక సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ సమావేశలో ప్రధానమంత్రి మొత్తం 8 ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
ఇందులో నాలుగు ప్రాజెక్టులు నీటిసరఫరా, నీటిపారుదలకు సంబంధించినవి కాగా, మరో రెండు ప్రాజెక్టులు జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధానతకు సంబంధించినవి. ఇంకో రెండు ప్రాజెక్టులు రైలు, మెట్రోరైలు అనుసంధానతకు  ఉద్దేశించినవి.  ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు 31,000 కోట్ల రూపాయలు.
ఇవి 7 రాష్ట్రాలలో విస్తరించిన ప్రాజెక్టులు. అందులో బీహార్‌, జార్ఖండ్‌, హర్యానా, ఒడిషా, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, మహారాష్ట్ర ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన వివిధ అంశాలు, ప్రాజెక్టులకు అవసరమైన భూమి,వాటి ప్రాంతం, ప్రణాళిక, వంటి విషయాలలో ఎదురయ్యే సమస్యలను ఉపగ్రహచిత్రాల సాంకేతికత, వంటి వాటి ఆధారంగా పి.ఎం. గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌ పోర్టల్‌ సహాయంతో పరిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి తెలిపారు.
అధిక జనసాంద్రత కల పట్టణప్రాంతాలలో ప్రాజెక్టుల అమలులో పాలుపంచుకునే భాగస్వాములందరూ, ప్రాజెక్టుల అమలులో మరింత మెరుగైన సమన్వయం కోసం నోడల్‌అధికారులను నియమించుకుని, బృందాలను  ఏర్పాటుచేసుకుని  పనిచేయాలని సూచించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో, విజయవంతంగా పునరావాస,పునర్నిర్మాణ కార్యక్రమాలుచేపట్టిన ప్రాంతాలను స్టేక్‌ హోల్డర్లు సందర్శించాలని ప్రధానమంత్రి సూచించారు. ఇలాంటి ప్రాజెక్టులు సాధించిన పరివర్తనాత్మక మార్పును , వాటి ప్రభావాన్ని కూడా చూపించాలని సూచించారు. ఇది ఆయా ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి భాగస్వాములకు తగిన ప్రేరణనిస్తుందని ఆయన అన్నారు.

 ఈ సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి, యుఎస్‌ఒఎఫ్‌ ప్రాజెక్టుల కింద చేపడుతున్న మొబైల్‌ టవర్లు, 4 జి కవరేజ్‌ పై చర్చించారు.  సార్వత్రిక సేవల అందుబాటు నిధి (యుఎస్‌ఒఎఫ్‌) కింద మొబైల్‌ అనుసంధానతను గరిష్ఠస్థాయిలో అందించడానికి, 33,573 గ్రామాలలో  24,149 మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.  మొబైల్‌ టవర్లు లేని అన్నిగ్రామాలలో ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపల మొబైల్‌ టవర్ల ఏర్పాటుకు  చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి స్టేక్‌హోల్డర్లను ఆదేశించారు. దీనివల్ల మారుమూల గ్రామాలకు కూడా మొబైల్‌ కవరేజ్‌ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

43 వ ఎడిషన్‌ వరకు జరిగిన ప్రగతి సమావేశాలలో , ఇప్పటివరకు ప్రధానమంత్రి, 17.36 లక్షల కోట్ల రూపాయల ఖర్చుకాగల 348 ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.  

 

***




(Release ID: 1971775) Visitor Counter : 115