మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన జాతీయ కార్యక్రమం రేపు ముంబైలో జరగనుంది


మాతృత్వానికి వందనం: ప్రధాన మంత్రి మాతృ వందన యోజన

కార్యక్రమంలో 'పిఎంఎంవివై'పై వినియోగదారు మాన్యువల్' విడుదల 'కొత్త పోర్టల్ మరియు మొబైల్ యాప్' ప్రారంభం, దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి)' మరియు రెండవ ఆడపిల్ల కోసం బెనిఫిట్‌ను మొదటిసారి విడుదల చేయడం ద్వారా ఈవెంట్ హైలైట్ అవుతుంది.

Posted On: 26 OCT 2023 11:44AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ( 'పిఎంఎంవివై')పై జాతీయ కార్యక్రమం రేపు (అక్టోబర్ 27,  2023) ముంబైలోని యశ్వంతరావు చవాన్ సెంటర్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం రెండు సెషన్‌లుగా విభజించబడింది. వర్క్‌షాప్ సెషన్‌తో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ శంభాజీ షిండే మరియు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షతన ప్రారంభ సెషన్ జరుగుతుంది. కార్యక్రమంలో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి  డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్, మహారాష్ట్ర ప్రజారోగ్య శాఖ మంత్రి శ్రీ తానాజీ సావంత్, మహారాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అదితి సునీల్ తట్కరే మరియు మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు  శ్రీ ఆశిష్ షెలార్, సెక్రటరీ, మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్‌ల నుండి ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో లేడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు మరియు ఆశా వర్కర్లతో సహా ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు కూడా పాల్గొంటారు.

ఈ కార్యక్రమం ప్రదానంగా పిఎంఎంవివై ముఖ్యమైన అంశాలు మరియు విజయాలు, దాని ప్రయాణం మరియు పిఎంఎంవివై  పోర్టల్ మరియు మొబైల్ యాప్ యొక్క లక్షణాలను హైలైట్ చేస్తుంది. 'డిజిటల్ ఇండియా,' 'మేక్ ఇన్ ఇండియా,' మరియు 'ఆత్మ నిర్భర్ భారత్'ను ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నిర్దేశానికి అనుగుణంగా ఒక కొత్త పిఎంఎంవివై  పోర్టల్ (పిఎంఎంవివైసాఫ్ట్‌ఎంఐఎస్) అభివృద్ధి చేయబడింది. ఈ పోర్టల్ అర్హతగల లబ్ధిదారుల సరైన ధృవీకరణ కోసం యూఐడిఏఐ ద్వారా ‘ఆన్‌లైన్ మరియు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ’ వంటి కొత్త ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతో పాటు ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా సజావుగా ఫండ్ బదిలీలను నిర్ధారించడానికి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల యొక్క ఎన్‌పిసిఐ ధృవీకరణను కలిగి ఉంటుంది. ఇంకా, లబ్ధిదారులు మరియు అంగన్‌వాడీ/ఆశా వర్కర్లు నేరుగా పోర్టల్ ద్వారా నమోదు చేసుకునేందుకు పేపర్‌లెస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను ఇది పరిచయం చేసింది.

కొత్త పిఎంఎంవివై పోర్టల్ (పిఎంఎంవివైసాఫ్ట్‌ఎంఐఎస్) కోసం పౌరులు, ఫీల్డ్ ఫంక్షనరీలు, సూపర్‌వైజర్లు, మంజూరు చేసే అధికారులు, జిల్లా నోడల్ అధికారులు మరియు రాష్ట్ర నోడల్ అధికారులతో సహా వివిధ వాటాదారుల కోసం సమగ్ర వినియోగదారు మాన్యువల్‌ను కూడా ఈ కార్యక్రమంలో విడుదల చేస్తారు.

ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (పిఎంఎంవివై) యొక్క ప్రాథమిక లక్ష్యం 1 జనవరి 2017న ప్రారంభించబడింది మరియు 1 ఏప్రిల్ 2022 నుండి మిషన్ శక్తిలో భాగంగా సవరించబడింది మరియు విలీనం చేయబడింది. పిఎంఎంవివై 2.0 ప్రకారం గర్భధారణ సమయంలో వేతన నష్టానికి పాక్షిక పరిహారం కోసం నగదు ప్రోత్సాహాన్ని అందించడం. బిడ్డ ప్రసవానికి ముందు మరియు తరువాత స్త్రీలు తగినంత విశ్రాంతి తీసుకోవచ్చు; మరియు గర్భిణీ స్త్రీలు & పాలిచ్చే తల్లులలో (పిడబ్ల్యు&ఎల్‌ఎం) ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను మెరుగుపరచడం దీని ఉద్దేశం.

మహిళలు మరియు పిల్లలు సమిష్టిగా మన దేశంలో 70% పైగా ఉన్నారు. స్థిరమైన మరియు సమానమైన జాతీయ పురోగతిని పెంపొందించడానికి వారి సాధికారత, రక్షణ మరియు సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడం చాలా అవసరం. గత తొమ్మిదేళ్లుగా మన ప్రధానమంత్రి నాయకత్వంలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన లక్ష్యాలను సాధించడానికి అంకితం చేయబడింది:

(i) స్త్రీలు తమ మానవ హక్కులను వినియోగించుకోవడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలుగా లింగ సమానత్వాన్ని ప్రధాన స్రవంతి చేయడం, అవగాహన కల్పించడం మరియు సంస్థాగత మరియు శాసనపరమైన మద్దతును సులభతరం చేయడంపై దృష్టి సారించి, సమగ్ర విధానాలు మరియు కార్యక్రమాల ద్వారా మహిళల సామాజిక మరియు ఆర్థిక సాధికారతను అభివృద్ధి చేయడం

(ii) అవగాహనను పెంపొందించే మరియు విద్య, పోషకాహారం మరియు సంస్థాగత మరియు శాసనపరమైన మద్దతుకు ప్రాప్యతను సులభతరం చేసే సమగ్ర విధానాలు మరియు కార్యక్రమాల ద్వారా పిల్లల అభివృద్ధి, సంరక్షణ మరియు రక్షణను నిర్ధారించడం, వారి పెరుగుదల మరియు పూర్తి సామర్థ్యాన్ని పెంపొందించడం.

పిఎంఎంవివై 2.0 యొక్క ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆడపిల్లల పుట్టుకకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఆడపిల్ల పట్ల మరింత సానుకూల సామాజిక దృక్పథాన్ని ప్రోత్సహించాలనే నిబద్ధత. సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన మహిళలకు పిఎంఎంవివై ప్రసూతి ప్రయోజనాన్ని రూ. 5,000/- రెండు విడతలుగా పంపిణీ చేయబడింది. రెండవ బిడ్డ ఆడపిల్ల అయితే పథకం యొక్క ప్రయోజనాలు ఇప్పుడు రెండవ బిడ్డకు మద్దతును చేర్చడానికి విస్తరించబడ్డాయి. ఈ సవరించిన ఫ్రేమ్‌వర్క్‌లో తల్లులు రెండవ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఒకే విడతలో ₹6,000 ప్రోత్సాహక మొత్తాన్ని పొందేందుకు అర్హులు. ఇది ఆడ భ్రూణహత్యలను నిరుత్సాహపరచడం మరియు శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా పుట్టినప్పుడు లింగ నిష్పత్తి మెరుగుదలకు కూడా దోహదపడుతుంది. అదనంగా ఈ పథకం సకాలంలో రోగనిరోధకత, శిశుజనన నమోదులు మరియు సంస్థాగత జననాల నమోదులను ప్రోత్సహిస్తుంది.

ఈ కార్యక్రమం ప్రారంభం నుండి 3.11 కోట్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు మొత్తం ₹ 14,103 కోట్ల కంటే ఎక్కువ పంపిణీతో ఆర్థిక సహాయం అందించబడింది. పిఎంఎంవివై పోర్టల్ మరియు మొబైల్ యాప్ టెక్నికల్ ఎక్సలెన్స్ అందించడానికి కట్టుబడి ఉంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ద్వారా సాఫీగా ఫండ్ బదిలీలను నిర్ధారించే పౌర-స్నేహపూర్వక అనుభవానికి ప్రాధాన్యతనిస్తుంది.

 

****


(Release ID: 1971764) Visitor Counter : 132