బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన లిగ్నైట్ కంపెనీ ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ కు చెందిన పర్యావరణ అనుకూల సంస్థ
Posted On:
22 OCT 2023 12:26PM by PIB Hyderabad
పునరుత్పాదక ఇంధనాల చొరవలను చేపట్టేందుకు, ప్రత్యేక దృష్టి పెట్టేందుకు తన పూర్తి యాజమాన్యంలో ఎన్ఎల్సి ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్ఐజిఇఎల్) అనే అనుబంధ సంస్థను బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేసింది.
బోర్డు తొలి సమావేశాన్ని నిర్వహించి, కీలక మేనేజేరియల్ స్థానాలకు నియామకాలను ఆమోదించి, కంపెనీ లోగోను స్వీకరించారు. కంపెనీ లోగోను విడుదల చేస్తూ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై నిశిత దృష్టితో నూతన కంపెనీ పునరుత్పాదక ఇంధన శక్తి ఉత్పత్తి సామర్ధ్యాన్నివేగంగా పెంచడానికి తోడ్పడుతుందని ఎన్ఐజిఇఎల్ చైర్మన్ శ్రీ ప్రసన్నకుమార్ మోటుపల్లి అన్నారు. పరిశ్రమకు వాతావరణం సానుకూలంగా ఉన్నందున, పంప్డ్ హైడ్రో సిస్టం & బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం వంటి నిల్వ వ్యవస్థలు సహా పునరుత్పాదక ఇంధన వృద్ధి ఏకకాలంలో జరుగుతుందన్నారు.
విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సిఇఎ విడుదల చేసిన అభిలషణీయ ఇంధన మిశ్రమ నివేదిక (ఆప్టిమల్ ఎనర్జీ మిక్స్ రిపోర్ట్) 2030 ప్రకారం, గ్రిడ్‌లో ఊహించిన బిఇఎస్ఎస్ సుమారు 41.65 జిడబ్ల్యు. ఇది నిల్వ వ్యవస్థ అభివృద్ధికి గొప్ప అవకాశాన్ని అందిస్తుందని ఆయన వివరించారు.
అనుబంధ సంస్థ 2030 నాటికి 6 జిడబ్ల్యు సామర్ధ్యంతో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను స్థాపించగలదని అంచనా వేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 2 జిడబ్ల్యు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు.
***
(Release ID: 1970012)