ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రుల లోమహానవమి సందర్భం లో మాత సిద్ధిదాత్రి కి ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 OCT 2023 10:05AM by PIB Hyderabad

నవరాత్రుల లో మహానవమి సందర్భం లో మాత సిద్ధిదాత్రి దేవి కి ప్రణామాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆచరించారు. దేశం లో ప్రతి ఒక్క పౌరుడు/ ప్రతి ఒక్క పౌరురాలు వారి వారి సంకల్పాల ను నేరవేర్చుకొనేటట్లు గా ఆశీర్వాదాల ను దేవి మాత అనుగ్రహించాలంటూ ప్రధాన మంత్రి ప్రార్థించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ, ఆ సందేశం లో -

‘‘నవరాత్రుల లో మహానవమి దినం సిద్ధి ని మరియు మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి మాత సిద్ధిదాత్రి ని ఆరాధించే దినం. దేశం లోని నా కుటుంబ సభ్యులు అందరి సంకల్పాలు సిద్ధించేటట్లు గా దేవి మాత తన ఆశీర్వాదాల ను అందించాలని దేవి మాత ను నేను వేడుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1969986) आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam