ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఓ టీ టీ స్ట్రీమింగ్ ప్రసారాలలో ధూమపాన హెచ్చరికలపై కేంద్ర ప్రభుత్వం రాజీ పడుతున్నట్లు పేర్కొన్న మీడియా నివేదికలు తప్పు మరియు తప్పుదారి పట్టించేవి
కేంద్ర ప్రభుత్వం సీ ఓ టీ పి ఫిల్మ్ నిబంధనలను ఓ టీ టీ ప్లాట్‌ఫారమ్‌లకు పొడిగించింది, ఇది 1 సెప్టెంబర్ 2023 నుండి అమలులోకి వచ్చింది
పొగాకు నియంత్రణ నియమాల క్రింద ఓ టీ టీ ని తీసుకురావడం ద్వారా, పొగాకు నియంత్రణ చర్యలలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా మారింది
నిబంధనలతో రాజీ లేదు; ఓ టీ టీ నియమాలు 2023ని పాటించనట్లయితే చర్య తీసుకోబడుతుంది
Posted On:
21 OCT 2023 4:40PM by PIB Hyderabad
తమ కార్యక్రమాలలో ధూమపాన హెచ్చరికలను ప్రసారం చేయడం లో ఓ టీ టీ (ఓవర్-ది-టాప్) స్ట్రీమింగ్ సేవల సంస్థలతో కేంద్ర ప్రభుత్వం "అసౌకర్యమయిన రాజీ" కుదుర్చుకుందని ప్రముఖ వార్తా ప్రచురణ ఇటీవల పేర్కొంది. అటువంటి ఒప్పందం ఫలితంగా కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు తక్కువ ధూమపాన అంతరాయ హెచ్చరికలను ఎంచుకున్నాయని నివేదిక పేర్కొంది. ఈ వార్తా నివేదిక తప్పుడు సమాచారం తో మరియు తప్పుదారి పట్టించేవిగా మరియు వాస్తవాలను తప్పుగా సూచించబడే విధంగా ఉన్నాయి.
ప్రజారోగ్యాన్ని ప్రాధాన్యతా అంశంగా పరిగణిస్తూ, భారత ప్రభుత్వం సీ ఓ టీ పి (సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు) చలనచిత్ర నియమాలను ఓ టీ టీ ప్లాట్‌ఫారమ్‌కు కూడా పొడిగించింది. ఓ టీ టీ నియమాలు 2023 సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, జియో సినిమా, సోనీ లైవ్, ఆల్ట్ బాలాజీ, వూత్ వంటి అన్ని ఓ టీ టీ ప్లాట్‌ఫారమ్‌లు పొగాకు నిరోధకతను, పొగాకు యొక్క ఆరోగ్య ప్రమాదాన్ని ప్రదర్శించాలి. నియమాలలో సూచించిన విధంగా పొగాకు వినియోగం యొక్క దుష్ప్రభావంపై ప్రముఖంగా స్థిర సందేశం మరియు పొగాకు ఆరోగ్య హెచ్చరికలను దృశ్య శ్రవణ నిరాకరణను ప్రదర్శించాలి
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను వివిధ ప్రజారోగ్య సంస్థలు మరియు నిపుణులు ప్రశంసించారు. పొగాకు నియంత్రణ నియమాల క్రింద ఓ టీ టీ ని తీసుకురావడం ద్వారా పొగాకు నియంత్రణ చర్యలలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా మారింది.
అందువల్ల మీడియా నివేదిక వాస్తవికంగా సరైనది కాదు అలాగే ప్రజారోగ్యాన్ని దాని ప్రాధాన్యతా విధుల్లో ఒకటిగా మెరుగుపరచడం పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత ను సరైన కోణంలో ప్రతిబింబించడం లేదు. ఓ టీ టీ రూల్స్ 2023, 1 సెప్టెంబర్ 2023 నుండి అమలులోకి వచ్చినందున ఓ టీ టీ రూల్స్ 2023 యొక్క నిబంధనను ఓ టీ టీ ప్లాట్‌ఫారమ్‌లు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. నిబంధనలతో ఎటువంటి రాజీ లేదు మరియు ఓ టీ టీ నియమాలు 2023కి అనుగుణంగా లేని పక్షంలో ప్రభుత్వం చర్య తీసుకుంటుంది.
***
(Release ID: 1969861)
Visitor Counter : 108