గనుల మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కింద ప్రకృతితో , ప్రజలతో పెద్ద ఎత్తున అనుసంధానమవుతున్న గనుల మంత్రిత్వశాఖ
Posted On:
21 OCT 2023 10:24AM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వశాఖ, దాని క్షేత్ర స్థాయి విభాగాలు, సిపిఎస్యులు, పెండింగ్ అంశాల పరిష్కారానికి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కింద వినూత్న, సృజనాత్మక పద్ధతుల ద్వారా
ప్రకృతినుంచి పొందిన దానికి ప్రతిగా దానికి తిరిగి ఇవ్వడంపై దృష్టిపెట్టింది. ఈ ప్రచారానికి సంబంధించిన తొలి మూడు వారాలలో , పాత ఫైళ్లు, రికార్డు ల సమీక్షలో ఈ మంత్రిత్వశాఖ తొలి పది శాఖ ల జాబితాలో ఉంది.
ఇది నిబంధనలు, ప్రక్రియలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, అంతర్ మంత్రిత్వశౄఖ రెఫరెన్సులు, రాష్ట్రప్రభుత్వాలు అందుకున్న రెఫరెన్సుల విషయంలో నూరశాతం పురోగతి సాధించింది.
దీనికితోడు లక్షిత పరిశుభ్రతా కార్యకలాపాలలో 75 శాతం లక్ష్యాన్ని ఇప్పటికే సాధించడం జరిగింది.
మంత్రిత్వశాఖ 50,000 చదరపు అడుగుల స్థలాన్ని పరిశుభ్రం చేయడంతోపాటు, వ్యర్థాల అమ్మకం ద్వారా సుమారు 1.47 కోట్ల రూపాయలు ఆర్జించింది. మంత్రిత్వశాఖ, దాని అనుబంధ సంస్థలు, ఈ ప్రచార కార్యక్రమాన్ని
ప్రకృతితో అనుసంధానానికి , జీవవైవిద్య అనుసంధానతకు, సామాన్య ప్రజలను కలుసుకోవడానికి వినియోగిస్తున్నాయి. పక్షులకు ఆహారం పెట్టేందుకు, వాటికి మంచినీటిని అందుబాటులో ఉంచే పాత్రల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
మెడిసినల్ ప్లాంట్లతో తోటలను పెంచుతున్నారు. రుతుక్రమ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో బాలికలను చైతన్యవంతులను చేయడం జరుగుతోంది.
గనుల మంత్రిత్వశాఖ, దానికి అనుబంధంగా గల సంస్థలు , ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 ను విజయవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా పనిచేసే చోట మెరుగైన పని పరిస్థితులు కల్పించడం, సమాజంలోని ప్రజలకు మెరుగైన పరిసరాలను కల్పించడానికి మంత్రిత్వశాఖ కృషి చేస్తోంది.
(Release ID: 1969860)
Visitor Counter : 116