ఆయుష్
azadi ka amrit mahotsav

స్వచ్ఛత ప్రచార కార్యక్రమం 3.0లో భాగంగా అవసరం లేని వస్తువులు తొలగించి నూతనంగా పని స్థలాన్ని అందుబాటులోకి తెచ్చిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

Posted On: 21 OCT 2023 11:58AM by PIB Hyderabad

స్వచ్ఛత ప్రచార కార్యక్రమం 3.0లో భాగంగా  అవసరం లేని వస్తువులు తొలగించి నూతనంగా పని స్థలాన్ని  ఆయుష్ మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛత ప్రచార కార్యక్రమం 3.0లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తోంది. 

2023 అక్టోబర్ 2న ప్రారంభమైన  స్వచ్ఛత ప్రచార కార్యక్రమం 3.0లో  అమలు చేయాల్సిన కార్యక్రమాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తించింది. శాఖలో పార్లమెంట్ సభ్యుల నుంచి అందించి 30 సిఫార్సులు, పార్లమెంట్ లో ఇచ్చిన 17 హామీలు,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మూడు సిఫార్సులు, ప్రజల నుంచి అందిన 75 ఫిర్యాదులు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మూడు సూచనలు, 24 ప్రజా అప్పీళ్లు, 305 ఫైళ్లు,20 పరిశుభ్రత పనులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడానికి శాఖ చేపట్టిన కార్యక్రమం మూడవ వారంలో  అద్భుతమైన పురోగతి సాధించింది. పెండింగ్ లో 305 ఫైళ్లలో 161 ఫైళ్లను అధికారులు సమీక్షించారు. సమీక్ష తర్వాత 161 ఫైళ్లను తొలగించారు. 

స్వచ్ఛత ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 అధికారికంగా 2023 సెప్టెంబర్ 15 న ప్రారంభమయింది. సన్నాహక కార్యక్రమం నిర్వహించిన అధికారులు పరిశుభ్రత సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలు, ప్రాంతాలను గుర్తించారు. అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛత ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 ని మేలు చేయడం ప్రారంభించారు. అవసరం లేని వస్తువులు తొలగించి ఎక్కువ పని స్థలాన్ని అందుబాటులోకి తేవాలని, పనితీరు మెరుగు పరచడానికి చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. స్వచ్ఛత, పెండింగ్ సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమం అమలు చేస్తున్నారు. 

ఆయుష్ మంత్రిత్వ శాఖలో పనికిరాని వస్తువులు తొలగించడం, సుందరీకరణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ  ప్రత్యేక ప్రచార 3.0ని అమలు చేస్తున్నారు. కార్యాలయంలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించి సిబ్బంది ఉత్పాదకత ఎక్కువ అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా పరిశుభ్రత పాటిస్తామని, పర్యావరణాన్ని రక్షిస్తామని, సుస్థిర అభివృద్ధికి కృషి చేస్తామని అధికారులు/ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.పరిశుభ్రత ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి లక్ష్యాల మేరకు కార్యక్రమం అమలు జరిగేలా చూసేందుకు చర్యలు అమలు చేయాలని సీనియర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును ప్రతి రోజు ప్రత్యేక బృందం పరిశీలిస్తోంది. మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థలు, కార్యాలయాలు కార్యాలయాలు, వాటి పరిసర ప్రాంతాల్లో పార్కులు,బస్టాండ్లు, మూలికా ఉద్యానవనాలు, సరస్సులు, నదులు శుభ్రం చేయడానికి కార్యక్రమాలు అమలు చేశాయి. ఆయుష్ భవన్ , దాని పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో సిబ్బంది, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. స్వచ్చత ప్రచార కార్యక్రమం 3.0ని అమలు చేయడానికి చర్యలు అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిట ప్రాంతాలు, జాతీయ సంస్థలు, ప్రాంతీయ సంస్థలకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది.  గతంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేసిన చర్యలు ఫలితాలు ఇచ్చాయి. స్వచ్ఛత కార్యక్రమం అమలులో మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్ మెరుగుపడింది. 

అక్టోబర్ 30 వరకు స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 అమలు జరుగుతుంది. లక్ష్యాల మేరకు కార్యక్రమాన్ని అమలు చేసి పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించడానికి, పనితీరు మెరుగుపరచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషి సాగిస్తోంది. 

 

***



(Release ID: 1969808) Visitor Counter : 60