రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంజాబ్‌లో ఢిల్లీ - అమృత్‌స‌ర్‌- కాట్రా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (డిఎకె)& అమృత్‌స‌ర్ బైపాస్ ప‌నుల పురోగ‌తిని స‌మీక్షించిన కేంద్ర రోడ్డు ర‌వాణా & హైవేల మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ

Posted On: 19 OCT 2023 5:07PM by PIB Hyderabad

 పంజాబ్‌లో త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర రోడ్డు ర‌వాణా & హైవేల మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ బుధ‌వారంనాడు ఢిల్లీ - అమృత్‌స‌ర్‌- కాట్రా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (డిఎకె)& అమృత్‌స‌ర్ బైపాస్ ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. ఈ త‌నిఖీ సంద‌ర్భంగా పంజాబ్ ప‌బ్లిక్‌వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి శ్రీ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇటిఒ, అమృత్‌స‌ర్ పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ గుర్జీత్ సింగ్ ఔజ్లా కూడా కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.  
ఐదు హ‌రిత క్షేత్ర & ఆర్ధ‌క కారిడార్ల‌ను రూ. 29వేల కోట్ల వ్య‌యంతో పంజాబ్‌లో  నిర్మిస్తున్నారు. ఇందులో 669 కిమీల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ- అమృత్‌స‌ర్‌- కాట్ర‌ను రూ. 40 వేల కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే అమృత్‌స‌ర్ నుంచి ఢిల్లీని 4 గంట‌ల్లోను, ఢిల్లీ నుంచి కాట్రాను 6 గంట‌ల్లో చేర‌వ‌చ్చు. ప్ర‌స్తుత ఢిల్లీ నుంచి కాట్రా మ‌ధ్య దూరం 727 కిమీలు ఉంది. ఈ మార్గంలో నిర్మాణం పూర్తి అయితే ఆ దూరం 58 కిమీలు త‌గ్గుతుంది. 
ఢిల్లీలోని కెఎంపి నుంచి ప్రారంభించి, ఈ హైవేను హ‌ర్యానాలో 137 కిమీలు నిర్మిస్తున్నారు. పంజాబ్‌లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే పొడ‌వు 399 కిమీలు, ఇందులో 296 కిమీలకు ప‌ని ప్రారంభ‌మైంది. జ‌మ్ము&కాశ్మీర్‌లో ఎక్స్‌ప్రెస్ వే పొడ‌వు 135 కిమీలు ఉండ‌గా, 120 కిమీల‌కు ప‌ని సాగుతోంది. పంజాబ్‌లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే పాటియాలా, సంగ్రూర్‌, మాలేర్‌కోట్ల‌, లూధియానా, జ‌లంధ‌ర్‌, క‌పుర్తాలా, గుర‌దాస్‌పూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల గుండా సాగుతుంది.
ఈ కారిడార్‌లో ప్ర‌ధాన విశిష్ఠ‌త ఏమిటంటే, ఇందులో ఆసియాలోనే అతిపొడ‌వైన 1300 మీట‌ర్ల పొడ‌వైన కేబుల్ ఆధారిత వంతెన‌ను బియాస్ న‌దిపై నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే సిక్కుల ప్ర‌ధాన ప‌విత్ర స్థ‌లాలైన స్వ‌ర్ణ‌దేవాల‌యం, క‌పుర్తాలాలోని సుల్తాన్‌పూర్ లోధీ గురుద్వారాను, గోయింద్వాల్ సాహిబ్ గురుద్వారా, ఖండూర్ సాహిబ్ గురుద్వారా, గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్ (త‌ర‌న్ త‌ర‌న్‌) గుండా కాట్రాలోని మాతా ద‌ర్బార్ వైష్ణోదేవి వ‌ర‌కూ అనుసంధానం చేస్తుంది. 
 రూ. 1475 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్న‌ అమృత్‌స‌ర్ 4లేన్ 50 కిమీల బైపాస్ ప‌నులు సాగుతున్నాయి. దీని నిర్మాణంతో త‌ర‌న్ త‌ర‌న్ నుంచి అమృత్‌స‌ర్‌కు మెరుగైన అనుసంధానం ఏర్ప‌డుతుంది. అంతేకాకుండా అమృత్‌స‌ర్‌లోని ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఈ బైపాస్ స‌మ‌ర్ధ‌వంతంగా ఉంటుంది.  ఈ మార్గం అనుసంధానాన్ని, ర‌వాణాను, అమృత్‌స‌ర్ మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌నుంది. 

 

***


(Release ID: 1969723) Visitor Counter : 51