ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గగన్‌యాన్ సన్నద్ధతపై ప్రధానమంత్రి సమీక్ష


2035 కల్లా భారత అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు

2040 కల్లా చంద్రునిపైకి మనిషిని పంపనున్న భారత్

శుక్రుడు, అంగారక గ్రహంపైకి మిషన్లకు సిద్ధం అవుతున్న భారత్

Posted On: 17 OCT 2023 1:53PM by PIB Hyderabad

భారతదేశ గగన్‌యాన్ మిషన్ పురోగతిని సమీక్షించడానికి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తును చర్చించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

అంతరిక్ష శాఖ గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన సమగ్ర అవలోకనాన్ని అందించింది, ఇందులో మానవ సహిత ప్రయోగ వాహనాలు, సిస్టమ్ అర్హత వంటి వివిధ సాంకేతికతలు ఉన్నాయి. హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ (హెచ్ఎల్విఎం3) మూడు అన్‌క్రూడ్ మిషన్‌లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు ప్రణాళిక చేశారు. క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికల్ మొదటి ప్రదర్శన అక్టోబర్ 21న షెడ్యూల్ చేశారు. ఈ సమావేశం మిషన్ సంసిద్ధతను అంచనా వేసింది, 2025లో దాని ప్రయోగాన్ని ధృవీకరిస్తుంది.

ఇటీవలి చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్‌లతో సహా భారతీయ అంతరిక్ష కార్యక్రమాల విజయవంతమైన నేపథ్యంలో, 2035 నాటికి 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (భారతీయ అంతరిక్ష కేంద్రం) ఏర్పాటుతో సహా కొత్త, ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను భారతదేశం ఇప్పుడు పెట్టుకోవాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. 2040 నాటికి చంద్రునిపైకి మొదటి భారతీయుడిని పంపేలా చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ విజన్‌ని గ్రహించేందుకు, అంతరిక్ష శాఖ చంద్రుని అన్వేషణ కోసం రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇది చంద్రయాన్ మిషన్ల శ్రేణిని, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వి) అభివృద్ధి, కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణం, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలల ఏర్పాటు, అనుబంధ సాంకేతికతలను కలిగి ఉంటుంది.

వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్‌తో కూడిన అంతర్ గ్రహ మిషన్ల కోసం కృషి చేయాలని భారతీయ శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ భారతదేశ సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో కొత్త శిఖరాలను అధిరోహించడానికి దేశం నిబద్ధతతో కుడి ఉందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. 

 

***


(Release ID: 1968618) Visitor Counter : 172