ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘నమో యాప్’లో స్థానిక ఎంపీతో సంధానానికి ప్రత్యేక విభాగం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 16 OCT 2023 9:24PM by PIB Hyderabad

   ప్రజలు స్థానిక పార్లమెంటు సభ్యులతో సంధానం కాగల ప్రత్యేక విభాగం ‘నమో’ (NaMo) అనువర్తనంలో ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ముందుకు నడిపించడంలో ఈ విభాగం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు తమ ఎంపీతో సంధానం కావడానికి, స్థానికంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ప్రధాని వివరించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“నమో యాప్ ఎంతో ఆసక్తికర విభాగం ఉంది… ఇది మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తుంది. మీ స్థానిక ఎంపీతో మీ సాన్నిహిత్యం కల్పించడంతోపాటు వారితో సంధానాన్ని సులువు చేస్తుంది. అలాగే స్థానిక నియోజకవర్గ పరిధిలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకునే వీలు కల్పిస్తుంది. ఆసక్తికర సాంస్కృతిక కార్యక్రమాల నుంచి, ఉత్సాహభరిత క్రీడల దాకా nm-4.com/mymp విభాగం ఎంపీలు, వారి నియోజకవర్గాలతో సంధానానికి మార్గం సులువు చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1968294) आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam