ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పిఎం - ఎబిహెచ్ఐఎం, ఎన్ హెచ్ ఎం , ఎక్స్ వి - ఎఫ్ సి హెల్త్ గ్రాంట్స్ కింద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన డాక్టర్ మాండవీయ
సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రుల అప్ గ్రేడేషన్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రారంభించిన డాక్టర్ మాండవీయ
అమృత్ కాల్ విమర్శ్ విక్షిత్ భారత్ @2047, డెవలప్మెంట్ డైలాగ్కు అధ్యక్షత వహిస్తూ అమృత్ కాల్లో ఆరోగ్య సంరక్షణ సేవల మార్పు పై కీలకోపన్యాసం చేసిన డాక్టర్ మాండవీయ
మహమ్మారిని ఎదుర్కోవడంలో వారి స్థితిస్థాపకతను నిర్ధారించడానికి మరియు దేశంలోని మారుమూల ప్రాంతాలలో సైతం అంతర్గత ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలను తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంచేలా చౌకగా ప్రాప్యతను అందించడానికి వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి మనం నిరంతరం కృషి చేయాలి: డాక్టర్ మాండవీయ
‘పరిశోధన, అభివృద్ధి, హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణను చౌకగా, అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది‘
‘
Posted On:
15 OCT 2023 6:35PM by PIB Hyderabad
"మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో నిర్ధారించడానికి మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి మనం మేము నిరంతరం కృషి చేయాలి. ఇంకా దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలను చౌకగా , సులభంగా అందించడానికి వాటి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి." అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పిఎం - ఎబిహెచ్ఐఎం) , జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) , ఎక్స్ వి - ఎఫ్ సి హెల్త్ గ్రాంట్స్ కింద వివిధ ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆదివారం నాడు అస్సోం లోని గువాహతి లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేశవ్ మహంత కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమృత్ కాల్ విమర్శ్ విక్షిత్ భారత్ @2047, డెవలప్మెంట్ డైలాగ్కు అధ్యక్షత వహిస్తూ అమృత్ కాల్లో ఆరోగ్య సంరక్షణ సేవల మార్పు పై డాక్టర్ మాండవీయ కీలకోపన్యాసం కూడా చేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను పునరుద్ఘాటిస్తూ, "ఆరోగ్యకరమైన సమాజం ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మిస్తుంది, ఇది సంపన్న దేశానికి పునాది వేస్తుంది. ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మనోధైర్యంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించడానికి మానవ వనరుల సామర్థ్యాన్ని వినియోగించుకునే గణనీయమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారతదేశం కృషి చేస్తోంది. ఇలాంటి అవిశ్రాంత కృషి పిఎం- ఎబిహెచ్ఐఎం ఆవిర్భావానికి దారితీసింది‘ అని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్నారు.

అస్సాంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి కార్యక్రమాలను డాక్టర్ మాండవీయ ప్రశంసించారు. "పరిశోధన - అభివృద్ధి, హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ బలమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధి ద్వారా ఆరోగ్య సంరక్షణను చౌకగా సులభంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు. మన దేశంలోకి ప్రవేశించే ఏదైనా కొత్త వేరియంట్ లేదా వ్యాధిపై నిఘాను పర్యవేక్షించడానికి ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు బ్లాక్, జిల్లా, ప్రాంతీయ స్థాయిలలో ఏకీకృతాన్ని బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


వైద్య, దంత , నర్సింగ్ కళాశాలల అభివృద్ధిని ప్రశంసిస్తూ అస్సాంలో చేపట్టిన కార్యక్రమాలను డాక్టర్ మాండవీయ ప్రస్తావించారు. "మన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి , అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ మన దేశంలోని ప్రతి పౌరుడికి చేరేలా చూడటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ వేడుక ఒక కీలక మైలురాయిని సూచిస్తుంది" అని అన్నారు. ప్రాజెక్టుల జాబితా క్రింద ఇవ్వబడింది:
శంకుస్థాపన చేసినవి:
1.పి ఎం- ఎ బి హెచ్ ఐ ఎం కింద లఖింపూర్ మెడికల్ కాలేజీలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్
2.బైథాలాంగ్సో బిపిహెచ్ సి వద్ద పిఎమ్-ఎ బి హెచ్ ఐ ఎం కింద బ్లాక్ ప్రైమరీ హెల్త్ యూనిట్
3.పీఎం-ఎ బి హెచ్ ఐ ఎం కింద హరినగర్ బిపిహెచ్ సి లో బ్లాక్ ప్రైమరీ హెల్త్ యూనిట్
4. నార్త్ గౌహతి పి హెచ్ సి లో పిఎమ్-ఎ బి హెచ్ ఐ ఎం కింద బ్లాక్ ప్రైమరీ హెల్త్ యూనిట్
5.పిఎమ్-ఎ బి హెచ్ ఐ ఎం కింద సఫేఖతి బి పి హెచ్ సి వద్ద బ్లాక్ ప్రైమరీ హెల్త్ యూనిట్
6.పిఎం-ఎబిహెచ్ఐఎమ్ కింద సువాకుచి బిపిహెచ్ సి వద్ద బ్లాక్ ప్రాథమిక ఆరోగ్య యూనిట్
7. పిఎం-ఎబిహెచ్ఐఎమ్ కింద జఖలబండ ఎస్ డి హెచ్ సి లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ
8. ఎక్స్ వి- ఎఫ్ సి హెల్త్ గ్రాంట్స్ కింద ససోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్
ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టులు
1.భేతాగావ్ సి హెచ్ సి బిజ్నీ ఎస్ డి సి హెచ్ అప్ గ్రేడ్
2.బార్పేట జిల్లా చెంగా వద్ద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , రెసిడెన్షియల్ క్వార్టర్స్
3.100 పడకల ఆర్ ఎన్ బి గోసాయిగావ్ ఎస్ డి సి హెచ్ ఆధునీకరణ
4.హైలకండి జిల్లా నిత్యానందపూర్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ,రెసిడెన్షియల్ క్వార్టర్స్
5.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ,రెసిడెన్షియల్ క్వార్టర్స్, హాలువటింగ్, శివసాగర్ జిల్లా
6.బార్ పేట జిల్లా, నాసాత్రాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ,రెసిడెన్షియల్ క్వార్టర్స్
7.తమూల్పూర్ బి పి హెచ్ సి ఎస్ డి సి హెచ్ అప్ గ్రేడ్
8. టిటాబోర్ ఎస్ డి సి హెచ్ బలోపేతం
భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రత్యేకతను నొక్కిచెప్పిన డాక్టర్ మాండవీయ, "భారతదేశం దాని స్వంత ఆరోగ్య నమూనాను కలిగి ఉంది, ఇది తన అవసరాలు, బలాలు సామర్థ్యాలకు అనుగుణంగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ఇతర దేశాలకు భిన్నంగా, భారతదేశంలో నాలుగు అంచెల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉందని, ఇది అట్టడుగు స్థాయి నుండి ప్రాధమిక స్థాయి నుండి ద్వితీయ , తృతీయ స్థాయి వరకు పనిచేస్తుందని, ఇందులో 1,66,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయని ఆయన అన్నారు. అవి ఆరోగ్య సంరక్షణ సేవలను స్వయంగా నిర్వహిస్తాయి. రోగుల సమయాన్ని , డబ్బును ఆదా చేయడానికి, సరసమైన ధరలలో సేవలు , సంరక్షణను సులభంగా అందించడానికి ఆయా ప్రదేశాలలో ద్వితీయ , తృతీయ స్థాయి సంప్రదింపులతో నిరుపేదలను అనుసంధానించడానికి కూడా సేవలు అందిస్తారు.


అమృత్ కాల్ విమర్ష్ విక్షిత్ భారత్ @2047లో కీలకోపన్యాసం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి యువతకు సాధికారత కల్పించడానికి ప్రభుత్వ నిబద్ధత , సంకల్పాన్ని గురించి ప్రముఖంగా వివరించారు. ఆరోగ్యకరమైన దేశ నిర్మాణంలో కొత్త ఆవిష్కరణలు , వాటి సహకారాన్ని జోడించడానికి ప్రస్తుత గ్రాంట్లు , పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఆరోగ్య సంరక్షణ సేవలపై భారతదేశ దార్శనికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలకు విస్తరించిందని, దీనిలో దేశంలోని నైపుణ్యం కలిగిన ఆరోగ్య శ్రామిక శక్తి అంతర్జాతీయ అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోగలదని, అస్సాంలోని వైద్య కళాశాలలు భారతీయ వైద్య సిబ్బందిని విదేశాలలో నియమించడానికి వీలుగా జపనీస్ భాషను బోధిస్తున్న ఉదాహరణను పేర్కొన్నారు.
సెషన్ చివరిలో డాక్టర్ మాండవీయ ప్రేక్షకులతో ఉత్సాహభరితమైన ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎఎస్ అండ్ ఎండి శ్రీమతి ఎల్ ఎస్ చాంగ్ సేన్, అస్సాం ప్రభుత్వ ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ అవినాష్ జోషి, ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు, ఎన్ హెచ్ ఎం అస్సాం మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ లక్ష్మీప్రియ, ఎయిమ్స్, ఐఐటి గౌహతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా వర్చువల్ గా పాల్గొన్నారు.
***
(Release ID: 1967989)