మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థ భారతీయ కోళ్ల పరిశ్రమ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా నుండి విముక్తి స్వీయ ప్రకటనను ఆమోదించింది


కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా చెన్నై నుండి తదుపరి దశ సాగర్ పరిక్రమ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మీడియా తో సంభాషిస్తూ ఇది పెద్ద వార్త అని అలాగే మన కోళ్ల పరిశ్రమ రంగానికి కీలక పరిణామం అని అన్నారు.

Posted On: 14 OCT 2023 1:14PM by PIB Hyderabad

భారతదేశం యొక్క పౌల్ట్రీ పరిశ్రమ  ముఖ్యమైన అభివృద్ధిలో, ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ ఓ ఏ హెచ్) నిర్దిష్ట  కోళ్ల పరిశ్రమ లో అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నుండి భారతదేశం విముక్తి యొక్క స్వీయ-ప్రకటనను ఆమోదించింది. జంతు ఆరోగ్యం మరియు జీవ భద్రతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడంలో భారతదేశం యొక్క నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం.

 

జోనింగ్ మరియు కంపార్ట్‌మెంటలైజేషన్‌ పై నేపథ్య సమాచారం

 

జోనింగ్ మరియు కంపార్టమెంటలైజేషన్ అనేది అంతర్జాతీయ వాణిజ్యం మరియు వ్యాధి నివారణ లేదా నియంత్రణ ప్రయోజనాల కోసం నిర్దిష్ట ఆరోగ్య స్థితిగతులతో జంతువుల సమూహాలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి ఉపయోగించే వ్యూహాత్మక సాధనాలు. కంపార్టమెంటలైజేషన్ అనేది జాతీయ భూభాగంలో నిర్దిష్ట ఆరోగ్య స్థితిని కలిగి ఉన్న జంతువుల ఉప-జనాభాను నిర్వచించడం. ఈ స్థితి నిర్వహణ అనేది డబ్ల్యూ ఓ ఏ హెచ్ టెరెస్ట్రియల్ కోడ్ (అధ్యాయాలు 4.4 మరియు 4.5) మరియు నిర్దిష్ట వ్యాధులకు  సంబంధించిన సిఫార్సులలో పేర్కొన్న ప్రమాణాలకు కట్టుబడి ఉండే కఠినమైన నిర్వహణ మరియు పెంపకం పద్ధతులపై ఆధారపడి ఉంటుంది.

 

భారతదేశంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా

 

అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (హెచ్ పీ ఏ ఐ)ను సాధారణంగా బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు, ఇది భారతదేశంలో మొదటిసారిగా ఫిబ్రవరి 2006లో మహారాష్ట్ర రాష్ట్రంలో కనుగొనబడింది. అప్పటి నుండి  దేశం వివిధ ప్రాంతాలలో హెచ్ పీ ఏ ఐ ఏటేటా వ్యాప్తి చెందింది. ఇది గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీసింది. ఈ వ్యాధి 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నివేదించబడింది, దీని ఫలితంగా దాని వ్యాప్తిని నియంత్రించడానికి 9 మిలియన్లకు పైగా పక్షులు చంపబడ్డాయి.

 

హెచ్ పీ ఏ ఐ ని నియంత్రించడంలో భారతదేశం యొక్క విధానం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (సవరించిన - 2021) నివారణ, నియంత్రణ  కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికలో వివరించిన విధంగా "కనుగొను మరియు తొలగించు" విధానాన్ని అనుసరిస్తుంది. ఈ సమగ్ర ప్రతిస్పందనలో వ్యాధి సోకిన మరియు బహిర్గతమైన జంతువులు, గుడ్లు, ఆహారం, చెత్త మరియు ఇతర కలుషిత పదార్థాలను విధ్వంసం చేస్తారు. అదనంగా, కోళ్ల మరియు కోళ్ల ఉత్పత్తుల రవాణాను పరిమితం చేయడం, వ్యాధి సోకిన ప్రాంగణాలను క్రిమిసంహారకాలు వాడటం మరియు శుభ్రపరచడం మరియు ఆపరేషన్ అనంతర నిఘా ప్రణాళిక  వంటి చర్యలు అమలు చేయబడ్డాయి. హెచ్ పీ ఏ ఐ కి వ్యతిరేకంగా టీకాలు వేయడం భారతదేశంలో అనుమతించబడదని గమనించడం ముఖ్యం.

 

కంపార్ట్మెంటలైజేషన్: ఒక కీలక నియంత్రణ చర్య 

 

ఈ సవాళ్లు ఉన్నప్పటికీ కోళ్ల కంపార్ట్‌మెంటలైజేషన్ భావనను అవలంబించడం ద్వారా హెచ్ పీ ఏ ఐ తో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి భారతదేశం చురుకైన విధానాన్ని తీసుకుంది. కంపార్ట్‌మెంటలైజేషన్ అనేది జంతువుల ఆరోగ్యాన్ని పెంపొందించే కీలకమైన సాధనం, కంపార్ట్‌మెంట్ లోపల మరియు వెలుపల వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు కోళ్ల మరియు కోళ్ల సంబంధిత ఉత్పత్తుల వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది.

 

డబ్ల్యూ ఓ ఏ హెచ్ ద్వారా స్వీయ-ప్రకటన ఆమోదం

 

భారత ప్రభుత్వంలోని పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ, 26 పౌల్ట్రీ కంపార్ట్‌మెంట్లలో అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా నుండి విముక్తికి సంబంధించిన స్వీయ-ప్రకటనను వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (డబ్ల్యూ ఓ ఏ హెచ్)కి సమర్పించింది.  ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకొని డబ్ల్యూ ఓ ఏ హెచ్ స్వీయ-ప్రకటనను అక్టోబర్ 13, 2023న ఆమోదించింది.   డబ్ల్యూ ఓ ఏ హెచ్  ప్రకటన వారి వెబ్‌సైట్‌లో ఈ దిగువ లింక్ లో అందుబాటులో ఉంది (https://www.woah.org/app/uploads/2023/10/2023-10-india-hpai-compartments-eng.pd

 

ఈ కోళ్ల కంపార్ట్‌మెంట్లు భారతదేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ అనే నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. డబ్ల్యూ ఓ ఏ హెచ్ ద్వారా ఈ గుర్తింపు అంతర్జాతీయ బయోసెక్యూరిటీ ప్రమాణాలకు భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది.  మాంసం మరియు గుడ్లతో సహా భారతీయ పౌల్ట్రీ మరియు పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా  (129.60 బిలియన్లు) గుడ్ల ఉత్పత్తి తో మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మరియు కోళ్ల మాంసం (4.47 మిలియన్ టన్నులు) ఉత్పత్తిలో ఐదవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఈ విజయాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కోళ్ల మరియు కోళ్ల ఉత్పత్తులను 64 దేశాలకు ఎగుమతి చేసి, 134 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ స్వయం ప్రకటన ఆమోదం ప్రపంచ మార్కెట్‌లో భారతీయ కోళ్ల పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. 

 

***



(Release ID: 1967793) Visitor Counter : 47