ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నాగాలాండ్ కోహిమాలో నాగాలాండ్ వైద్య, విజ్ఞాన, పరిశోధన సంస్థ (ఎన్ఐఎంఎస్ఆర్)ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
నాగాలాండ్ లో ఎన్ఐఎంఎస్ఆర్ మొట్టమొదటి వైద్య కళాశాల
ఎన్ఐఎంఎస్ఆర్ కేవలం వైద్య కళాశాల మాత్రమే కాదు, పరిశోధనా సంస్థ కూడా. ఇది వైద్య విద్యను అందించాలనే ఉద్దేశ్యాన్ని నెరవేర్చడమే కాకుండా నాగా ప్రజల ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరిస్తుంది: డాక్టర్ మాండవీయ
"భారతదేశంలోని ప్రతి పౌరుడు దేశవ్యాప్తంగా సరసమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ పొందగలిగేలా చూడడం దీని లక్ష్యం"
రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజీని ప్రారంభించిన నాగాలాండ్ ప్రజలకు ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు: శ్రీ నీఫియు రియో
Posted On:
14 OCT 2023 1:44PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు నాగాలాండ్‌లోని కోహిమాలో నాగాలాండ్ వైద్య, విజ్ఞాన, పరిశోధన సంస్థ (ఎన్ఐఎంఎస్ఆర్) ని నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నీఫియు రియో సమక్షంలో ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ టి ఆర్ జెలియాంగ్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి శ్రీ పి పైవాంగ్ కొన్యాక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ.. ఎన్‌ఐఎంఎస్‌ఆర్ కేవలం వైద్య కళాశాల మాత్రమే కాదని, పరిశోధనా సంస్థ అని అన్నారు. ఇది వైద్య విద్యను అందించే ఉద్దేశ్యాన్ని నెరవేర్చడమే కాకుండా నాగా ప్రజల ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరిస్తుందని తెలిపారు. నాగాలాండ్‌లో వైద్య విద్యను మెరుగుపరచడం కోసం కేంద్రప్రభుత్వ నిబద్ధతను వివరిస్తూ, కేవలం 9 సంవత్సరాల వ్యవధిలో, నాగాలాండ్‌లో ఎంబీబీఎస్ సీట్లు 64,000 నుండి 1,60,000కి పెరిగాయని పేర్కొన్నారు. అలాగే గత 9 ఏళ్లలో పీజీ సీట్లు కూడా రెట్టింపు అయ్యాయన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి విద్యార్థులు, ఇతర భాగస్వాముల పరిశోధన పరిధిని జాతీయ స్థాయి వరకే పరిమితం చేయవద్దని అన్నారు. విదేశాల్లో ఉన్న అవకాశాలను కూడా మనం పొందాలని అని ఆయన అన్నారు. విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అనేక వైద్య విద్యా సంస్థల్లో విదేశీ భాషా కోర్సులను ప్రారంభించిందని ఆయన తెలియజేశారు.
దేశంలో వైద్య, నర్సింగ్, ఫార్మసీ విద్యను బలోపేతం చేయడం దేశ ఆరోగ్య రంగం సమగ్ర అభివృద్ధి, విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని డాక్టర్ మాండవీయ అన్నారు. "భారతదేశంలోని ప్రతి పౌరుడు దేశవ్యాప్తంగా సరసమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను పొందగలిగేలా చూడడమే లక్ష్యం" అని ఆయన అన్నారు. అందరికీ నాణ్యమైన, సరసమైన మందులను అందుబాటులోకి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాల విస్తరణను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నీఫియు రియో మాట్లాడుతూ ఈ రోజు నాగాలాండ్ ప్రజలకు చారిత్రాత్మకమైన రోజని, రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాలను ప్రారంభించడం ఆనందించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. నాగాలాండ్ ప్రజల చిరకాల వాంఛగా తమ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉండాలని, ఈ ప్రాజెక్టును గట్టి సంకల్పంతో చేపట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఐఎంఎస్‌ఆర్ రాష్ట్ర సెకండరీ, తృతీయ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని, రాబోయే రోజుల్లో ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్‌ఐఎంఎస్‌ఆర్ ప్రారంభోత్సవం నాగాలాండ్ రాష్ట్రానికి ఒక శుభ సందర్భమని రాష్ట్ర మంత్రి శ్రీ కొన్యాక్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఇచ్చిన ప్రాముఖ్యతకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఐఎంఎస్‌ఆర్ కొహిమా ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా), ఇతర భాగస్వాములు, ఏజెన్సీలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్‌ఐఎంఎస్‌ఆర్ కోహిమా లో చేరే ఎంబీబీఎస్ విద్యార్థులకు సంపూర్ణ వైద్య విద్యను అందించడం, సమగ్ర ఆసుపత్రి ఆధారిత, కమ్యూనిటీ ఔట్రీచ్ ఆరోగ్య సంరక్షణ సేవలను వివిధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, అదనపు, అంతర్గత పరిశోధనా సౌకర్యాల ద్వారా రోగులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్‌ఐఎంఎస్‌ఆర్, దాని స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ డొమైన్ నిర్దిష్ట బోధనా అభ్యాస సాధనాలు, ప్రయోగశాలలు, సెంట్రల్ లైబ్రరీ, క్రీడా సౌకర్యాలు, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌తో ప్రఖ్యాత ఫ్యాకల్టీ ఉంటారు. భాగస్వామ్యాలు, ఎంఓయూలు, ఇతర ప్రసిద్ధ వైద్య కళాశాలలు, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గల ఆరోగ్య సంరక్షణ సంస్థలతో నెట్‌వర్కింగ్ ద్వారా మరింత అభివృద్ధి చెందుతాయి.
ఎన్‌ఐఎంఎస్‌ఆర్ కొహిమా నాగాలాండ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇది 2023-2024 విద్యా సంవత్సరం నుండి 100 ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) నుండి అనుమతి లేఖను అందుకుంది, నాగాలాండ్ ప్రజల ప్రతిష్టాత్మకమైన కల. 60 సంవత్సరాల రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్రంలో మొదటి మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి 2023 ఏప్రిల్‌లో మార్గం సుగమం చేసింది.
నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన 85 ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆల్ ఇండియా సీట్ల నుండి 6 మంది విద్యార్థులు ఎన్ఐఎంఎస్ఆర్ లో ప్రవేశం పొందారు 1.9.2023న ఇండక్షన్ ప్రోగ్రాం తర్వాత ఎంబీబీఎస్ తరగతుల్లో చేరారు. ఎన్ఐఎంఎస్ఆర్ కొహిమా ప్రారంభోత్సవం వైద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు నాగాలాండ్, మొత్తం ఈశాన్య ప్రాంతంలో విద్య, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో కీలకమైన భాగం. నాగాలాండ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, పౌర సమాజం ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.
***
(Release ID: 1967785)
Visitor Counter : 56