ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తాను రాసిన గర్బా గీతం ఆలపించిన కళాకారులకు ప్రధానమంత్రి ధన్యవాదాలు

प्रविष्टि तिथि: 14 OCT 2023 11:57AM by PIB Hyderabad

   న్నో ఏళ్ల కిందట తాను ర‌చించిన గర్బా గీతాన్ని ఆలపించిన కళాకారులు ధ్వని భానుషాలి, తనిష్క్ బాగ్చి, ‘జస్ట్’ సంగీత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే నవరాత్రులలో మరో కొత్త గర్బా గీతాన్ని వారితో పంచుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 “ఎన్నో ఏళ్ల కిందట నేను రాసిన గర్బా గీతాన్ని ఇంత మనోహరంగా ఆలపించిన @ధ్వనివినోద్, తనిష్క్ బాగ్చి, @Jjust_Music బృందానికి ధన్యవాదాలు! ఇది ఎన్నో జ్ఞాపకాలను నాకు గుర్తుచేస్తుంది. అప్పటినుంచీ చాలా సంవత్సరాలుగా నేను రచన చేపట్టింది లేదు. కానీ, ఇటీవలే ఓ కొత్త గీతం రాసే వీలుచిక్కింది. దాన్ని దేవీ నవరాత్రుల సందర్భంగా నేను మీతో పంచుకుంటాను.. #SoulfulGarba” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1967652) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam