రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
సేతు బంధన్ పథకం కింద అరుణాచల్ ప్రదేశ్‌లో రూ. 118.50 కోట్ల విలువగల 7 వంతెన ప్రాజెక్టులను ఆమోదించిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
12 OCT 2023 3:42PM by PIB Hyderabad
ఆర్ధిక సంవత్సరం 2023-24లో రూ. 118.50 కోట్ల సంచిత వ్యయంతో సేతు బంధన్ పథకం కింద అరుణాచల్ ప్రదేశ్‌లో 7 వంతెనల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం లభించిందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఒక పోస్టులో వెల్లడించారు.
ఆమోదించిన వంతెనల వివరాలు ఈ విధంగా ఉన్నాయిః
- తూర్పు కెమెంగ్ జిల్లాలోని లచాంగ్ వద్ద పచా నదిపై లైమోయా, నెరెవా &సరోవా అనుసంధానం చేస్తూ ఆర్‌సిసి బ్రిడ్జి
-తూర్పు కెమెంగ్ జిల్లాలోని దొనిగాంవ్ వెళ్ళే మార్గంలో గొవాంగ్ వద్ద పచా నదిపై గొవాంగ్ నుంచి దొనిగాంవ్ గ్రామం వరకు ఆర్‌సిసి బ్రిడ్జి
- ఎన్‌హెచ్ 313 పై రోయింగ్- అన్ని రోడ్ నుంచి దిగువ దిబాంగ్ జిల్లాలో ఎన్‌హెచ్‌పిసి కాలనీ ద్వారా న్యూచిదూ గ్రామం వరకు 3 వంతెనలు
- పశ్చిమ కెమెంగ్ జిల్లాలో ఖర్సా, డిరంగ్ లో ఆర్‌సిసి డెకింగ్‌తో రెండు లేన్ల స్టీల్ కంపోజిట్ వంతెన
- దిగువ సియాంగ్ జిల్లాలోని కోయు- గోయె రహదారిపై తబిరిపో సాకు గ్రామాన్ని కలిపేందుకు సిజెన్ నదిపై పిక్టే పాయింట్ వద్ద ఆర్‌సిసి వంతెన.
- తుఊర్పు సియాంగ్ జిల్లాలో మెబో- ధొల్లా రహదారిపై న్గోపోక్ నదిపై ఆర్‌సిసి వంతెన
- దిగువ సుబన్‌సిరి జిల్లాలోని యాజిలి ఆగ్రి-ఫార్మ్ సమీపంలోని చుల్యు& కేబి గ్రామాన్ని కలిపేందుకు పన్యోర్ నదిపై ఉక్కు మిశ్రమ వంతెన.
ప్రాంతాల వ్యాప్తంగా అనుసంధానత పెంచడం, ఆర్ధికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు, అరుణాచల్ ప్రదేశ్ సామాజిక- ఆర్ధికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ, ప్రజల జీవన నాణ్యతను మొత్తంగా మెరుగుపరచాలన్న తమ నిబద్ధతకు ఈ ప్రాజెక్టులు అనుగుణంగా ఉంటాయని శ్రీ గడ్కరీ అన్నారు.
***
(Release ID: 1967240)
Visitor Counter : 69