ప్రధాన మంత్రి కార్యాలయం
రాజమాత విజయ రాజెసింధియా గారి కి ఆమె జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2023 9:41AM by PIB Hyderabad
రాజమాత విజయ రాజె సింధియా గారి కి ఆమె జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు. రాజమాత విజయ రాజె సింధియా గారు తన యావత్తు జీవనాన్ని ప్రజల సంక్షేమం కోసం మరియు దేశ సేవ కోసం అంకితం చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదలు మరియు ఆదరణ కు నోచుకోకుండా మిగిలిపోయినటువంటి వర్గాల వారి కోసం ఆమె చేసిన కృషి ఒక శక్తియుక్తమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందిస్తాయి అని కూడ శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘రాజమాత విజయరాజె సింధియా గారి కి ఆమె జయంతి సందర్భం లో ఆదరపూర్ణ శ్రద్ధాంజలి. ఆమె తన యావత్తు జీవనాన్ని ప్రజల సంక్షేమం కోసం మరియు దేశ సేవ కోసం సమర్పణం చేసివేశారు. పేదలు మరియు నిరాదరణ కు గురి అయినటువంటి వారి కోసం ఆమె చేసిన ప్రయాస లు ఒక సశక్త భారతదేశాన్ని నిర్మించడం లో ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందించేటటువంటివే.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1967071)
సందర్శకుల సూచీ సంఖ్య : : 96
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam