మంత్రిమండలి

మూడు కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలు- లిథియం, నయోబియం,అరుదైన భూమి మూలకాలు (ఆర్ ఆర్ఈ) మైనింగ్ కోసం రాయల్టీ రేట్లకు తెలిపిన కేంద్ర మంత్రిమండలి

Posted On: 11 OCT 2023 3:21PM by PIB Hyderabad

మూడు కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలు- లిథియం, నయోబియం,  అరుదైన భూమి మూలకాలు (ఆర్ 

ఆర్ఈ) మైనింగ్ కోసం రాయల్టీ రేట్లు నిర్ణయించడానికి ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 ('ఎంఎండీఆర్ చట్టం')  రెండవ షెడ్యూల్ సవరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్యాకష్టన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 

 గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం, 22023 కు  పార్లమెంటు ఆమోదం తెలిపింది. చట్టం 2023 ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చింది.  లిథియం, నయోబియం  తో సహా ఆరు ఖనిజాలను అణు ఖనిజాల జాబితా నుంచి సవరించిన చట్టం ప్రకారం తొలగించారు. చట్ట సవరణ వల్ల ఈ ఖనిజాల తవ్వకాన్ని  వేలం ద్వారా ప్రైవేటు రంగానికి కేటాయించి  రాయితీలను మంజూరు చేస్తారు. లిథియం, నయోబియం, అరుదైన భూమి మూలకాలు  (యురేనియం, థోరియం లేనివి) సహా 24 క్లిష్టమైన  వ్యూహాత్మక ఖనిజాల (చట్టం యొక్క మొదటి షెడ్యూల్‌లోని పార్ట్ డీ లో పొందుపరిచిన ఖనిజాలు) మైనింగ్, లైసెన్స్‌లను  కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని సవరణలో పేర్కొన్నారు.  

రాయల్టీ రేట్లకు  ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో  దేశంలోనే మొదటిసారిగా లిథియం, నయోబియం,  అరుదైన భూమి మూలకాలు (ఆర్ ఆర్ఈ) బ్లాక్‌లను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది.  బ్లాకుల వేలంలో ఖనిజాలపై చెల్లించే  రాయల్టీ రేటు రేటును బిడ్డర్లు  ముఖ్యమైన ఆర్థిక పరమైన అంశంగా పరిగణిస్తారు.  ఖనిజాల సగటు అమ్మకపు ధర (ASP) గణన పద్ధతిని కూడా గనుల మంత్రిత్వ శాఖ సిద్ధం  చేసింది, సగటు అమ్మకపు ధర ఆధారంగా   బిడ్ ప్రమాణాలు నిర్ణయిస్తారు.  

ఎంఎండీఆర్ చట్టం   రెండవ షెడ్యూల్ కింద  ఖనిజాలకు రాయల్టీ రేట్లు చెల్లిస్తారు. రాయల్టీ రేటు ప్రత్యేకంగా నిర్ణయించని ఖనిజాల రాయల్టీ రేటు సగటు అమ్మకపు ధర (ASP)లో 12% ఉండాలి అని చట్టంలోని రెండవ షెడ్యూల్‌లోని ఐటెమ్ నెం.55 లో పేర్కొన్నారు. లిథియం, నయోబియం,అరుదైన భూమి మూలకాలకు ప్రత్యేకంగా నిర్ణయించని పక్షంలో వాటికి చెల్లించేరాయల్టీ రేటు సగటు అమ్మకపు ధరలో  12%గా  ఉంటుంది,  ఇతర క్లిష్టమైన , వ్యూహాత్మక ఖనిజాలతో ఈ రాయల్టీ రేటు  పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.ఖనిజాలు ఉత్పత్తి చేస్తున్న ఇతర దేశాలు చెల్లిస్తున్న రాయల్టీ రేటుతో పోల్చి చూస్తే ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని  లిథియం, నయోబియం,అరుదైన భూమి మూలకాలు రాయల్టీ రేటును ఈ క్రింది విధంగా సహేతుకంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

(i) లిథియం - లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ ధరలో 3%,

(ii) నయోబియం   –సగటు విక్రయ ధరలో 3% (ప్రాథమిక మరియు ద్వితీయ మూలాల కోసం),

(iii) అరుదైన భూమి మూలకాలు  - రేర్ ఎర్త్ ఆక్సైడ్ సగటు విక్రయ ధరలో 1%

దేశంలో ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు కీలకమైన ఖనిజాలు తప్పనిసరి అయ్యాయి. 2070 నాటికి శక్తి పరివర్తన, నికర-సున్నా ఉద్గారాలను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుని కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో  లిథియం, నయోబియం,అరుదైన భూమి మూలకాలు వంటి క్లిష్టమైన ఖనిజాలు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఉపయోగాలు,భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల లిథియం, నయోబియం,అరుదైన భూమి మూలకాలు  వ్యూహాత్మక అంశాలుగా మారాయి.  స్వదేశీ మైనింగ్‌ను ప్రోత్సహించడం వల్ల దిగుమతులు తగ్గుతాయి. సంబంధిత పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు జరుగుతాయి. . ఈ ప్రతిపాదన మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ చేస్తుందని  భావిస్తున్నారు.

,అరుదైన భూమి మూలకాలు,లిథియం బ్లాకుల కోసం జరిపిన  అన్వేషణ నివేదికను ఇటీవల ప్రభుత్వానికి  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) అందజేసింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా   ఇతర అన్వేషణ సంస్థలు దేశంలో కీలకమైన , వ్యూహాత్మక ఖనిజాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి.  లిథియం, అరుదైన భూమి మూలకాలు , నికెల్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, పొటాష్, గ్లూకోనేట్, ఫాస్ఫరైట్, గ్రాఫైట్, మాలిబ్డినం మొదలైన కీలకమైన , వ్యూహాత్మక ఖనిజాల  మొదటి విడత వేలం  త్వరలో నిర్వహించేందుకుకేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 

****



(Release ID: 1966706) Visitor Counter : 78