గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనుల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక ప్రచారం 3.0 విజయవంతంగా అమలు


మొదటి వారంలోనే 95% పైగా ప్రజా ఫిర్యాదులు పరిష్కారం

100% సాధనపై మంత్రిత్వ శాఖ దృష్టి

Posted On: 10 OCT 2023 10:48AM by PIB Hyderabad

కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, దాని క్షేత్ర స్థాయి కార్యాలయాలు & సీపీఎస్‌ఈలు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడం, నియమాలు/విధానాల సరళీకరణ, రికార్డుల నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, కార్యాలయాల పరిసరాలను  మెరుగుపరచడం వంటి పనుల కోసం, ప్రత్యేక ప్రచారం 3.0 కింద లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి.

ప్రత్యేక ప్రచారం 3.0 ఈ నెల 2న ప్రారంభమైంది. 'అటామిక్ మినరల్ కన్సెషన్ రూల్స్, 2016'లో సవరణ ద్వారా 27 నియమాలను నేరరహితం చేయడం ద్వారా నియమాలు/విధానాలను గనుల మంత్రిత్వ శాఖ సరళీకరించింది. తద్వారా, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది.

F74x5nPXMAAQugv

ప్రత్యేక ప్రచారం 3.0 మొదటి వారంలో, పెండింగ్‌లో ఉన్న 95.45% ప్రజా ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ పరిష్కరించింది. భౌతిక దస్త్రాలను తొలగించే లక్ష్యంలో 43% సాధించడంతో పాటు రికార్డుల నిర్వహణ కోసం కేటాయించిన పనిలో 52% పూర్తి చేసింది. దీనివల్ల దాదాపు 9,212 చదరపు అడుగుల కార్యాలయ ప్రాంతం ఖాళీ అయింది.

 

ఇప్పటివరకు, 344 పరిశుభ్రత కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా 103 కార్యక్రమాలను నిర్వహించారు. 100% సాధనకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

****


(Release ID: 1966317) Visitor Counter : 159