ఆర్థిక మంత్రిత్వ శాఖ
జోరుగా సాగుతున్న పరోక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ మరియు కస్టమ్స్ (సీబీఐసీ) ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0
- దేశవ్యాప్తంగా అన్ని సీబీఐసీ ప్రదేశాలలో పరిశుభ్రత డ్రైవ్ కొనసాగింపు
- పరిశుభ్రత క్యాంపెయిన్‌ల కోసం 1,038 ప్రాంతాల గుర్తింపు
- సమీక్ష కోసం దాదాపు 44,000 భౌతిక ఫైల్‌లు, 23,000 ఈ-ఫైళ్లు గుర్తించబడ్డాయి
Posted On:
09 OCT 2023 2:39PM by PIB Hyderabad
మహాత్మా గాంధీకి 'క్లీన్ ఇండియా' ద్వారా హృదయ పూర్వక నివాళి అర్పించే దృక్పథంతో.. పరోక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ మరియు కస్టమ్స్ (సీబీఐసీ) పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టింది. 15వ తేదీన ప్రారంభించబడిన పెండింగ్ విషయాలపై ప్రత్యేక కార్యక్రమం (ఎస్.సి.డి.పి.ఎం) 3.0లో సిబ్బంది ఎంతో ఉత్సాహంతో పాల్గొంటోంది. సెప్టెంబరు 2023 స్వచ్ఛత (పరిశుభ్రత)ని సంస్థాగతీకరించడం, గుర్తించబడిన పని వస్తువుల పెండింగ్‌ను తగ్గించడం, వీఐపీ సూచనలు, పబ్లిక్ గ్రీవెన్స్, పబ్లిక్ గ్రీవెన్స్ అప్పీల్స్ మొదలైనవి ఈ కార్యక్రమం కింద చేపడుతున్నారు. సీబీఐసీ భారతదేశం అంతటా దాని ఫీల్డ్ కార్యాలయాలతో పాటు.. 2 - 31 అక్టోబర్, 2023 వరకు గుర్తించబడిన సూచనలు/సమస్యలను పరిష్కరించడం చెత్తను దూరం చేయడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. 9 అక్టోబర్ 2023 నాటికి, ఈ కార్యక్రమంలో భాగంగా31 వీఐపీ సూచనలు, 933 పబ్లిక్ గ్రీవెన్స్, 357 పబ్లిక్ గ్రీవెన్స్ అప్పీళ్లు పరిష్కరించడానికి గుర్తించబడ్డాయి. సీబీఐసీ యొక్క అన్ని ఫీల్డ్ కార్యాలయాలలో దేశవ్యాప్తంగా శుభ్రత డ్రైవ్ కూడా ప్రణాళిక చేయబడింది. అలా సృష్టించబడిన అదనపు స్థలం ఉత్పాదక ఉపయోగం కోసం ఉంచబడుతుంది. ప్రచార దశలో చేపట్టిన కార్యక్రమాల ఫోటోలతో పాటు విజయాలు ఎస్సీడీపీఎం 3.0 పోర్టల్ ద్వారా భాగస్వామ్యం చేయబడతాయి. సీబీఐసీ పరిశుభ్రతను నిర్ధారించడానికి మరియు నిర్వహించే బహిరంగ ప్రదేశాల నాణ్యతను పెంచడానికి కట్టుబడి ఉంది.
***
(Release ID: 1966214)
Visitor Counter : 116