యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

జాతీయ క్రీడా అవార్డులు 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ

Posted On: 04 OCT 2023 8:46PM by PIB Hyderabad

భారతప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2023 జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. జాతీయ క్రీడా అవార్డ్స్ 2023 కోసం అర్హులైన క్రీడాకారులు/ కోచ్‌లు/ సంస్థలు/ విశ్వవిద్యాలయాల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే ప్రత్యేక పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవార్డు మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన దరఖాస్తుదారులు అధికారులు/వ్యక్తుల సిఫార్సు లేకుండా ఆన్‌లైన్‌లో dbtyas-sports.gov.in పోర్టల్‌లో మాత్రమే స్వీయ దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏదైనా సమస్య ఎదురైతే, దరఖాస్తుదారు స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌ని స్పోర్ట్స్‌అవార్డ్స్  sportsawards-moyas[at]gov[dot]in   లేదా టెలిఫోన్‌నెంబర్‌ 011-23387432లో ఏదైనా పని రోజున ఉదయం 9.00 నుండి సాయంత్రం 5.30 వరకు లేదా టోల్ ఫ్రీ నెం. 1800-202-5155, 1800258-5155 నెంబర్‌లో (ఏదైనా పని దినంలో ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య) సంప్రదించవచ్చు. అవార్డు కోసం అర్హులైన క్రీడాకారుల దరఖాస్తును నవంబర్ 2, 2023న రాత్రి 11.59 గంటలలోపు dbtyas-sports.gov.in పోర్టల్‌లో సమర్పించాలి.చివరి తేదీ తర్వాత అందే దరఖాస్తులు పరిగణించబడవు.

క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి, బహుమతులు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం క్రీడా పురస్కారాలు అందజేస్తారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నాలుగు సంవత్సరాల వ్యవధిలో క్రీడా రంగంలో అద్భుతమైన మరియు అత్యుత్తమ ప్రదర్శన కోసం ఇవ్వబడుతుంది; నాలుగు సంవత్సరాల పాటు నిలకడగా అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు అర్జున అవార్డు ఇవ్వబడుతుంది; ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పతక విజేతలను తయారు చేసిన కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు ఇవ్వబడుతుంది. ధ్యాన్ చంద్ అవార్డు క్రీడల అభివృద్ధికి జీవితకాల సహకారం అందించినందుకు అందించబడుతుంది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది క్రీడల ప్రోత్సాహం మరియు అభివృద్ధి రంగంలో కనిపించే పాత్రను పోషించిన కార్పొరేట్ సంస్థలు మరియు వ్యక్తులకు ఇవ్వబడుతుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (ఎంఏకెఏ)ట్రోఫీని ఇంటర్-యూనివర్శిటీ టోర్నమెంట్‌లలో మొత్తం అత్యుత్తమ ప్రదర్శన కోసం విశ్వవిద్యాలయానికి ఇవ్వబడుతుంది.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం క్రీడా అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2023 సంవత్సరానికి గానూ ఈ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్‌లు www.yas.nic.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్/ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా/ గుర్తింపు పొందిన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు/ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్‌లు/ రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రభుత్వాలుకు కూడా తదనుగుణంగా తెలియజేయబడ్డాయి.

 

 

***



(Release ID: 1964501) Visitor Counter : 110