ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 5 వ తేదీ నాడు  రాజస్థాన్ ను మరియు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


సుమారు 5,000 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు రాజస్థాన్ లో శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం ఇవ్వనున్న ప్రధాన మంత్రి

ఆ ప్రాజెక్టు లు రహదారి, రైలు , విమానయానం, ఆరోగ్యం మరియుఉన్నత విద్య రంగాల కు సంబంధించినవి

ఐఐటి జోధ్ పుర్ కేంపస్ ను కూడా దేశ ప్రజల కు అంకితంచేయనున్న ప్రధాన మంత్రి

జోధ్ పుర్ విమానాశ్రయం లో క్రొత్త టర్మినల్ బిల్డింగుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు

ప్రధాన మంత్రి  ఎఐఐఎమ్ఎస్, జోధ్ పుర్ లో ‘ట్రామా సెంటర్ ఎండ్ క్రిటికల్  కేర్ హాస్పిటల్ బ్లాక్’ కు సైతం శంకుస్థాపన చేస్తారు

ప్రధాన మంత్రి మధ్య ప్రదేశ్ లో 12,600 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు

ఆ ప్రాజెక్టు లు రహదారి, రైలు, గ్యాస్ పైప్ లైన్, గృహ నిర్మాణం మరియు స్వచ్ఛమైన త్రాగునీరు వంటి రంగాల కు సంబంధించినవి

లైట్ హౌస్ ప్రాజెక్టు లో భాగం గా ఇందౌర్ లోనిర్మించిన ఒక వేయి కి పైగా ఇళ్ళ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 04 OCT 2023 9:14AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 5 వ తేదీ న రాజస్థాన్ ను మరియు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు.

 

ఉదయం పూట సుమారు 11 గంటల 15 నిమిషాల కు ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో దాదాపు గా 5,000 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయా ప్రాజెక్టు లు రహదారి, రైలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య రంగాల కు చెందినటువంటివి. మధ్యాహ్నం పూట రమారమి 3గంటల 30 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ కు చేరుకొని, 12,600 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రారంభం మరియు శంకుస్థాపన తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయా ప్రాజెక్టు లు రహదారి, రైలు, గ్యాస్ పైప్ లైన్, గృహ నిర్మాణం, ఇంకా స్వచ్ఛమైన త్రాగునీరు వంటి రంగాల కు సంబంధించినవి.

 

రాజస్థాన్ లో ప్రధాన మంత్రి

రాజస్థాన్ లో ఆరోగ్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను బలపరచడం కోసం ముఖ్యమైన ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అఖిల భారత వైద్య సేవ ల సంస్థ (ఎఐఐఎమ్ఎస్), జోధ్ పుర్ లో 350 పడకల తో ఏర్పాటు కానున్న ట్రామా సెంటర్ ఎండ్ క్రిటికల్ కేయర్ హాస్పిటల్ బ్లాక్ మరియు రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాల లో ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ (పిఎమ్-ఎబిహెచ్ఐఎమ్) లో భాగం గా అభివృద్ధి పరచనున్న ఏడు క్రిటికల్ కేయర్ బ్లాకు లు ఆ ప్రాజెక్టుల లో భాగం గా ఉంటాయి. ఎఐఐఎమ్ఎస్ జోధ్ పుర్ లో 350 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో ట్రామా, ఇమర్ జన్సి ఎండ్ క్రిటికల్ కేయర్ ల కోసం ఉద్దేశించిన ఏకీకృత కేంద్రం ఉంటుంది. ఈ కేంద్రం ట్రాయెజ్, రోగ నిర్ణయకారి, డే కేయర్, వార్డు లు, ప్రైవేట్ రూము లు, మాడ్యూలర్ ఆపరేటింగ్ థియేటర్ లు, ఐసియు లు, ఇంకా రక్తశుద్ధి కేంద్రం వంటి వివిధ సదుపాయాల తో కూడి ఉంటుంది. ఇది వ్యాధిగ్రస్తుల కు విభిన్న విభాగాలలో విస్తృతమైన సంరక్షణ ను అందించి గాయాలు మరియు అత్యవసర స్థితుల నిర్వహణ పరం గా ఒక సమగ్రమైన దార్శనికత ను అందిస్తుంది. యావత్తు రాజస్థాన్ లో ఏర్పాటు చేసే ఏడు క్రిటికల్ కేయర్ బ్లాకు లతో రాష్ట్ర ప్రజల కు జిల్లా స్థాయి లో క్రిటికల్ కేయర్ సంబంధి మౌలిక సదుపాయాల ప్రయోజనం దక్కనుంది.

 

ప్రధాన మంత్రి జోధ్ పుర్ విమానాశ్రయం లో అత్యంత ఆధునికమైనటువంటి క్రొత్త టర్మినల్ బిల్డింగు కు కూడా శంకుస్థాపన చేస్తారు. మొత్తం 480 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరుపుకొనే క్రొత్త టర్మినల్ బిల్డింగు సుమారు 24,000 చదరపు మీటర్ ల క్షేత్రం లో రూపుదిద్దుకొంటుంది; రద్దీ కాలం లో 2,500 మంది ప్రయాణికుల కు సేవల ను అందించగలిగే విధం గా దీనిని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక్కడ ఏడాది లో 35 లక్షల మంది ప్రయాణికుల కు సేవల ను అందించవచ్చును. దీనితో కనెక్టివిటీ మెరుగు పడుతుంది; అలాగే ఆ ప్రాంతం లో పర్యటన కు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

 

ఐఐటి జోధ్ పుర్ కేంపస్ ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ కేంపస్ ను 1135 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అత్యధునాతన సౌకర్యాల తో నిర్మించడం జరిగింది. ఆధునిక పరిశోధన, నూతన ఆవిష్కరణ ల పరంగా ఉన్నతమైన నాణ్యత తో కూడిన సమగ్రమైన విద్య ను అందించడం తో పాటు మౌలిక సదుపాయాల ను సమకూర్చే దిశ లో ఇది ఒక మహత్వపూర్ణమైనటువంటి చర్య అని చెప్పాలి.

 

రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ లక్ష్యం తో ఏర్పాటైన సెంట్రల్ ఇన్ స్ట్రుమెంటేశన్ లబారటరి, సిబ్బంది కి నివాస సముదాయాలు మరియు యోగ, ఇంకా స్పోర్ట్ స్ బిల్డింగ్ లను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో కేంద్రీయ గ్రంథాలయాని కి, 600 మంది విద్యార్థుల కు ఆశ్రయాన్ని ఇవ్వగలిగే వసతి గృహాని కి మరియు ఒక భోజనశాల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు.

 

రాజస్థాన్ లో రహదారుల మౌలిక స్వరూపం లో మెరుగుదలను తీసుకువచ్చే ఉద్దేశ్యం తో ప్రధాన మంత్రి ఎన్ హెచ్-125ఎ లో జోధ్ పుర్ రింగ్ రోడ్ లో కార్ వాడ్ నుండి డాంగియావాస్ సెక్శన్ ను నాలుగు దోవ లు కలిగి ఉండేది గా మలచడం సహా అనేక రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయనున్నారు. వీటి లో జాలోర్ (ఎన్ హెచ్-325) లోని బాలోత్ రా నుండి సాండేరావ్ సెక్శన్ వరకు ప్రముఖ పట్టణ ప్రాంతాలను కలపడం కోసం ఏడు బైపాస్ లు/రీ-అలైన్ మెంట్ లను నిర్మించే పని, ఎన్ హెచ్-25 లో పచ్ పద్ రా -బాగూండీ సెక్శన్ లో నాలుగు దోవల తో కూడిన రహదారి ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి. ఈ రహదారి ప్రాజెక్టుల ను సుమారు 1475 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. జోధ్ పుర్ రింగ్ రోడ్ నిర్మాణం ద్వారా నగరం లో రాక పోకల లో ఎదురవుతున్న ఒత్తిడి ని తగ్గించడం తో పాటు వాహనాల వల్ల తలెత్తుతున్న కాలుష్యాన్ని తగ్గించడం వీలుపడుతుంది. ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో కనెక్టివిటీ ని మెరుగు పరచడం తో పాటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాయి. ఉద్యోగ అవకాశాలు ను కల్పిస్తాయి. అంతేకాక ఆర్థిక వృద్ధి లోనూ తోడ్పడుతాయి.

 

రాజస్థాన్ లో రెండు క్రొత్త రైలు సర్వీసుల కు ప్రధాన మంత్రి ప్రారంభ సూచకంగా ఆకుపచ్చటి జెండా ను చూపనున్నారు. ఈ రైళ్ళ లో జైసల్ మేర్ ను దిల్లీ తో కలిపే ఒక రైలు ‘రుణిచా ఎక్స్ ప్రెస్’ మరియు మార్ వాడ్ జంక్శన్ ను ఖాంబ్ లీ ఘాట్ తో కలిపేటటువంటి ఒక న్యూ హెరిటేజ్ ట్రేన్ ఉన్నాయి. రుణిచా ఎక్స్ ప్రెస్ రైలు జోధ్ పుర్, డెగానా, కుచామన్ సిటీ, ఫులేరా, రీంగస్, శ్రీమాధోపుర్, నీమ్ కా థానా, నార్ నౌల్, అటేలీ, రేవాడీ ల మీదుగా ప్రయాణిస్తూ పోతుంది. ఫలితం గా జాతీయ రాజధాని నగరం నుండి అన్ని పట్టణాల కు సంధానం మెరుగు పడనుంది. మార్ వాడ్ జంక్శన్ - ఖాంబ్ లీ లను కలిపే న్యూ హెరిటేజ్ ట్రేన్ ఆ ప్రాంతం లో పర్యటన కు ప్రోత్సాహాన్ని అందించడం తో పాటు ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది. వీటికి అదనం గా, రెండు ఇతర రైలు ప్రాజెక్టుల ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. వీటి లో 145 కిలో మీటర్ ల పొడవైన డేగానా - రాయ్ కా బాగ్ రైలు మార్గం మరియు 58 కిమీ పొడవైన డేగానా-కుచామన్ సిటీ రైలు మార్గం యొక్క డబ్లింగ్ పనులు భాగం గా ఉన్నాయి.

 

మధ్య ప్రదేశ్ లో ప్రధాన మంత్రి

మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో లైట్ హౌస్ ప్రాజెక్టు ను ప్రారంభించడం వల్ల ‘అందరికీ గృహ వసతి ని సమకూర్చాల’న్న ప్రధాన మంత్రి యొక్క దార్శనికత మరింత బలోపేతం కానుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ కార్యక్రమం లో భాగం గా సుమారు 128 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం పూర్తి అయిన ఈ ప్రాజెక్టు మొత్తం ఒక వేయి మంది కి పైగా లబ్ధిదారు కుటుంబాల కు ప్రయోజనాన్ని అందించనుంది. ఈ ప్రాజెక్టు లో ప్రీ-ఇంజీనిర్ డ్ స్టీల్ స్ట్రక్చరల్ సిస్టమ్మరియు ఫ్రీ-ఫేబ్రికేటెడ్ సాండ్ విచ్ సిస్టమ్అనే నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అవలంబించి నిర్మాణాని కి అయ్యే కాలాన్ని చెప్పుకోదగిన స్థాయి లో తగ్గిస్తూ, అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన నాణ్యమైన గృహాల ను తీర్చిదిద్దడం జరుగుతుంది.

 

ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత త్రాగునీటి ని చాలినంత గా అందజేయాలన్న ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా చేపట్టిన చర్య లో భాగం గా 2350 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన జల్ జీవన్ మిశన్ ప్రాజెక్టుల కు మాండ్ లా, జబల్ పుర్ మరియు డిండోరీ జిల్లాల లో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ప్రధాన మంత్రి సివ్ నీ జిల్లా లో వంద కోట్ల రూపాయల కు పైగా విలువైన జల్ జీవన్ మిశన్ సంబంధి ప్రాజెక్టు ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. మధ్య ప్రదేశ్ లో నాలుగు జిల్లాలలో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు లతో రాష్ట్రం లో సుమారు 1575 గ్రామాల కు మేలు కలుగనుంది.

 

మధ్య ప్రదేశ్ లో రహదారుల రంగం లో మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచే దిశ లో 4800 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల లో ఎన్ హెచ్ 346 లో ఝర్ ఖేడా - బేర్ సియా - డోల్ ఖేడీ ని లను కలుపుతూ సాగే రహదారి యొక్క ఉన్నతీకరణ; ఎన్ హెచ్ 543 లో బాలాఘాట్ - గోండియా సెక్శన్ ను నాలుగు దోవలు కలిగి ఉండేది గా తీర్చిదిద్దడం; రూఢీ మరియు దేశ్ గాఁవ్ లను కలిపే ఖండ్ వా బైపాస్ నాలుగు దోవలు కలిగి ఉండేదిగా ఏర్పాటు చేయడం; ఎన్ హెచ్-47 లో టెమాగాఁవ్ నుండి చిచోలీ వరకు ఉన్న భాగాన్ని నాలుగు దోవ లు కలిగి ఉండేదిగా అభివృద్ధి పరచడం; బోరేగాఁవ్ ను శాహ్ పుర్ తో కలిపే రహదారి ని నాలుగు దోవలు కలిగి ఉండేది గా విస్తరించడం; మరియు శాహ్ పుర్ ను ముక్తాయీ నగర్ తో కలిపే రహదారి ని నాలుగు దోవ లు కలిగి ఉండేది గా మార్చడం వంటి ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి. ఎన్ హెచ్-347 సి లోని ఖల్ ఘాట్ నుండి సర్ వర్ దేవ్ లా మధ్య ఉన్నతీకరించిన రహదారి కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు.

 

ప్రధాన మంత్రి 1850 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువైన వివిధ రైల్ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. వాటిలో కట్ నీ - విజయ్ సోటా (102 కి.మీ.) మరియు మార్ వాస్ గ్రామ్ - సింగ్ రౌలీ (78.50 కి.మీ.) ను కలుపుతూ సాగే రైలు మార్గం డబ్లింగ్ కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టు లు కట్ నీ-సింగ్ రౌలీ సెక్శన్ ను కలిపే రైలు మార్గం యొక్క డబ్లింగ్ ప్రాజెక్టు లో ఒక భాగం. ఈ ప్రాజెక్టు లు మధ్య ప్రదేశ్ లో రైలు రంగ మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం తో పాటు గా రాష్ట్రం లో వ్యాపారాని కి మరియు పర్యటన కు కూడాను ప్రయోజనాల ను అందించగలుగుతాయి.

 

విజయ్ పుర్ - ఔరైయా -ఫూల్ పుర్ గొట్టపుమార్గం ప్రాజెక్టు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. 352 కిలో మీటర్ ల పొడవైన ఈ గొట్టపు మార్గాన్ని 1750 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో నిర్మించడమైంది. ప్రధాన మంత్రి ముంబయి- నాగ్ పుర్- ఝార్ సుగూడ పైప్ లైన్ ప్రాజెక్టు లో భాగం అయినటువంటి నాగ్ పుర్- జబల్ పుర్ సెక్శన్ (317 కి.మీ.) కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ను 1100 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. ఈ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు లతో పరిశ్రమల కు మరియు అక్కడ నివసించే ప్రజల కు స్వచ్ఛమైనటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడినటువంటి సహజవాయువు ను అందుబాటులోకి రాగలుగుతుంది. దీనితో పాటే పర్యావరణం లోకి వెలువడే ఉద్గారాల ను తగ్గించడం సాధ్యపడుతుంది. జబల్ పుర్ లో సుమారు 147 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం జరిగిన ఒక క్రొత్త బాట్లింగ్ ప్లాంటు ను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేస్తారు.

 

 

***

 


(Release ID: 1964068) Visitor Counter : 112