రైల్వే మంత్రిత్వ శాఖ
కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్ "ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (టిఏజి)" ని విడుదల చేసిన భారతీయ రైల్వేలు, కొత్త టైం టేబుల్ అక్టోబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చింది
భారతీయ రైల్వేల అధికారిక వెబ్ సైట్ www.indianrailways.gov.inలో
ఇది అందుబాటులో ఉంటుంది
ఈ సంవత్సరం టిఏజి వందే భారత్ రైళ్లకు చెందిన 64 సర్వీసులతో పాటు 70 ఇతర రైలు సర్వీసులను ప్రవేశపెట్టింది, ఇప్పటికే ఉన్న 90 సర్వీసులను ఇతర గమ్యస్థానాలకు పొడిగించింది, 12 సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచింది.
Posted On:
03 OCT 2023 3:37PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త ఆల్ ఇండియా రైల్వే టైమ్ టేబుల్ "ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్ (ట్యాగ్)" ను అక్టోబర్ 1, 2023 నుండి అమలులోకి తెచ్చింది. కొత్త "ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్" భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537,2960 కూడా అందుబాటులో ఉంది.
కొత్త టైమ్ టేబుల్ ముఖ్యాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:
- 64 వందే భారత్ రైళ్ల సర్వీసులతో పాటు 70 ఇతర రైలు సర్వీసులను ప్రారంభించారు
- ఇప్పటికే ఉన్న 90 సర్వీసులను ఇతర గమ్యస్థానాలకు పొడిగించడం
- 12 సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంపు
- సూపర్‌ఫాస్ట్ కేటగిరీలోకి మార్చడానికి 22 రైళ్ల సర్వీసులను వేగవంతం చేయడం
- 20501/02 అగర్తల-ఆనంద్ విహార్ రాజధాని మాల్దా, భాగల్పూర్ మీదుగా మళ్లింపు
- ఆగ్నేయ రైల్వేలో సమయపాలనను మెరుగుపరచడం కోసం కొన్ని సర్వీసుల టైమ్ టేబుల్‌లో మార్పు
ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి 64 వందే భారత్ రైళ్లు మరియు 70 ఇతర రైలు సర్వీసుల వివరాలను కొత్త టైమ్ టేబుల్‌లో పొందుపరిచారు. కొత్త టైమ్‌టేబుల్ వివిధ నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి రూపొందించారు.
***
(Release ID: 1963924)
Visitor Counter : 160