రక్షణ మంత్రిత్వ శాఖ
ఉమ్మడి విన్యాసాలు ప్రారంభించిన భారత్ - బాంగ్లాదేశ్ సైన్యాలు
మేఘాలయలోని ఉమ్రోయిలో సంప్రీతి -XI
Posted On:
03 OCT 2023 3:21PM by PIB Hyderabad
భారత్, బాంగ్లాదేశ్‌ల మధ్య వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలు సంప్రతీ 11 ఎడిషన్ 03 అక్టోబర్ 2023న మేఘాలయలోని ఉమ్రోయ్‌లో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాలు మార్చి మార్చి నిర్వహించే ఈ విన్యాసాలు బలమైన ద్వైపాక్షిక రక్షణ సహకార చొరవలకు సంకేతంగా ఉంటాయి. 2009లో అస్సాంలోని జోర్హాత్‌లో ప్రారంభమైన తర్వాత 2022వరకు పది ఎడిషన్లుగా విజయవంతమై విన్యాసాలు నిర్వహించడం జరిగింది.
దాదాపు 14 రోజులకు షెడ్యూల్ చేసిన సంప్రీతి - XI లో ఇరు పక్షాల నుంచి దాదాపు 350మంది సిబ్బందిని కలిగి ఉంటుంది. ఇరు సైన్యాల మధ్య అంతర్ కార్యాచరణను పెంచుకోవడం, వ్యూహాత్మక కవాతులను పెంచుకోవడం, ఉత్తమ ఆచరణలను ప్రోత్సహించవలసిన ప్రాముఖ్యతను ఈ విన్యాసాలు పట్టి చూపుతాయి.
బాంగ్లాదేశ్ కంటింజెంట్‌లో 52 బాంగ్లాందేశ్ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ కమాండెంట్ అయిన బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ మఫిజుల్ ఇస్లాం రషీద్ 170 మంది సిబ్బందికి నాయకత్వం వహిస్తున్నారు. బాంగ్లాదేశ్ సైన్యపు లీడ్ యూనిట్ 27 బాంగ్లాదేశ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్. భారత కంటింజెంట్ ప్రధానంగా రాజ్‌పుట్ రెజిమెంట్ బెటాలియన్‌కు చెందిన దళాలను కలిగి ఉంది. మౌంటెన్ బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ ఎస్‌కె ఆనంద్ నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ విన్యాసాలలోఇరు పక్షాలకు చెందిన శతఘ్నిదళాలు, ఇంజినీర్లు, సహాయక ఆయుధాల, సేవలకు చెందిన భిన్న యూనిట్ల సిబ్బంది కూడా పాలుపంచుకుంటారు.
యుఎన్ ఆదేశాలలో అధ్యాయం VII ప్రకారం ఉపసంప్రదాయ కార్యకలాపాలు నిర్వహించడం అన్నది కేంద్రంగా సంప్రీతి -XI లొ కమాండ్ పోస్ట్ ఎక్సర్‌సైజ్ (సిపిఎక్స్), క్షేత్ర శిక్షణ విన్యాసం (ఎఫ్‌టిఎక్స్) లు ఉండి, వాలిడేషన్ విన్యాసంతో ముగుస్తుంది.
ప్రతి కంటింజెంట్ నుంచి 20మంది అధికారులు సిపిఎక్స్‌లో పాల్గొంటూ, చర్చల అనంతరం నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెడతారు. దీని తర్వాత ఎఫ్‌టిఎక్స్ జరుగుతుంది. ఇందులో క్షేత్రస్థాయి కార్యకలాపాలను ధ్రువీకరిస్తారు.
బందీలను కాపాడడం, గుంపులను నియంత్రించే చర్యలు, తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో హెలికాప్టర్లను ఉపయోగించడం సహా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉమ్మడి వ్యూహాత్మక కసరత్తుల పరంపర ఎఫ్‌టిఎక్స్‌లో ఉంటుంది. వాలిడేషన్ విన్యాసాన్ని 14 &15 అక్టో6బర్ 2023న అస్సాంలోని దర్రంగా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహిస్తారు. ఈ విన్యాసాల క్రమంలో, పాలుపంచుకుంటున్నవారు ఆత్మనిర్భర్ పరికరాల ప్రదర్శన పరాక్రమాన్ని వీక్షించే అవకాశం కలుగుతుంది.
సంప్రీతి -XI భారత్, బాంగ్లాదేశ్‌ల మధ్య రక్షణ సహకారాన్ని, లోతైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడం, సాంస్కృతిక అవగాహణ, ఉపసంప్రదాయ కార్యకలాపాలలో ఉమ్మడి అనుభవాల నుంచి పరస్పర లబ్ధిని మరింత పెంచేందుకు హామీ ఇస్తుంది.
(Release ID: 1963771)
Visitor Counter : 192