సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"సుపరిపాలన"పై రెండు రోజుల ప్రాంతీయ సమావేశం రేపు జైపూర్‌లో ప్రారంభమవుతుంది; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ ఫర్ స్కీమ్ పిఎం అవార్డుల కింద 2022 అవార్డు విజేతలకు కాన్ఫరెన్స్‌లో అందజేయబడుతుంది


2 రోజుల సదస్సుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ మరియు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు.

కాన్ఫరెన్స్‌లో 2022 అవార్డు గ్రహీతల నుండి 7 విభాగాలలో 13 అవార్డు విజేతలు, రాజస్థాన్‌కు చెందిన పిఎం అవార్డు విజేతలు/నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డు విజేతలు మరియు రాజస్థాన్‌లోని ఉత్తమ పాలనా విధానాలను కూడా ప్రదర్శిస్తారు.

Posted On: 03 OCT 2023 2:32PM by PIB Hyderabad

2023 అక్టోబర్ 4-5 తేదీల్లో జైపూర్‌లో ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ సమావేశం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ కోసం స్కీమ్ పిఎం అవార్డ్స్ కింద 2022 అవార్డు విజేతలను అందజేస్తుంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ మరియు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగే 2-రోజుల సదస్సును నిర్వహించడంలో రాజస్థాన్ ప్రభుత్వం డిఏఆర్‌పిజితో సహకరించింది.

కాన్ఫరెన్స్‌లో 2022 అవార్డు గ్రహీతల నుండి 7 విభాగాలలో 13 అవార్డు విజేతలు, రాజస్థాన్‌కు చెందిన పిఎం అవార్డు విజేతలు/నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డు విజేతలు మరియు రాజస్థాన్‌లో ఉత్తమ పాలనా విధానాలను కూడా ప్రదర్శిస్తారు. 2 అవార్డు విజేతల అనుభవ భాగస్వామ్య సెషన్‌లతో పాటు "పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల ప్రభావవంతమైన పరిష్కారం" మరియు "పరిపాలనలో సాంకేతికత" అనే పేరుతో సర్వసభ్య సమావేశాలు నిర్వహించబడతాయి.

ప్రాంతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన “అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ ఎఫెక్టివ్ రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ 2014-2023” మొదటి సెషన్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ కోసం పిఎంఎస్‌ అవార్డు పథకం ప్రయాణంపై ప్రదర్శన మరియు షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించబడుతుంది.డిఏఆర్‌పిజి కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వక్తలుగా శ్రీ ఎన్‌.ఎన్. మాథుర్, అదనపు కార్యదర్శి, డి/పి పెన్షన్. శ్రీ రాహుల్ సింగ్, అదనపు కార్యదర్శి, డిఓపిటి మరియు డిఏఆర్‌పిజి జెఎస్‌ శ్రీ ఎన్‌బిఎస్‌ రాజ్‌పుఠ్ ఉంటారు. ఐఐపిఏ డిజి శ్రీ ఎస్.ఎన్. త్రిపాఠి "పరిపాలనలో సాంకేతికత" అనే అంశంపై సెషన్ - II కు అధ్యక్షత వహిస్తారు. సెషన్‌కు వక్తలుగా శ్రీ మనీష్ భరద్వాజ్,డిడిజి,యుఐడిఏఐ, శ్రీ సంతోష్ మిశ్రా, భాగస్వామి, పిడబ్ల్యుసి మరియు డిడిజి ఎన్‌ఐసి శ్రీమతి.రచన శ్రీవాస్తవ వ్యవహరిస్తారు.

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్‌ పిఎంఓ; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ సహాయమంత్రి;  అణుశక్తి శాఖ మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రారంభ సెషన్‌లో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ కీలక ప్రసంగం చేస్తారు. గౌరవనీయమైన ఎంఓఎస్‌ (పిపి) ప్రారంభ సెషన్‌లో పిఎం అవార్డ్ ఇనిషియేటివ్స్, 2022 (ఎడిషన్ జనవరి-జూన్, 2023)పై ఇ-జర్నల్ ఎంజిఎంజిని కూడా విడుదల చేస్తారు. శ్రీ రామ్‌చరణ్ బోహ్రా, పార్లమెంటు సభ్యుడు మరియు శ్రీ గోవింద్ రామ్ మేఘ్‌వాల్, విపత్తు నిర్వహణ & ఉపశమన, పరిపాలనా సంస్కరణలు మరియు సమన్వయం, రాజస్థాన్ ప్రభుత్వంలోని గణాంక విధాన ప్రణాళిక శాఖ గౌరవనీయ మంత్రిత్వ శాఖ ప్రారంభ సమావేశానికి హాజరవుతారు. ప్రారంభ సెషన్‌లో రాజస్థాన్ ముఖ్య కార్యదర్శి శ్రీమతి  ఉషా శర్మ మరియు డిఏఆర్‌పిజి కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ ప్రసంగిస్తారు. పిఎం అవార్డ్ ఇనిషియేటివ్స్ 2022పై ఒక చిత్రం ప్రదర్శించబడుతుంది.

మూడో సెషన్‌లో డిఏఆర్‌పిజి అదనపు కార్యదర్శిగా శ్రీ అమర్ నాథ్, ఐఏఎస్(రిటైర్డ్.) అధ్యక్షతన అవార్డులు ప్రదానం చేసిన కార్యక్రమాలు, 2022 (ఇన్నోవేషన్ - సెంటర్)పై చర్చలు జరుగుతాయి.

శ్రీ విపిన్ కుమార్, అదనపు కార్యదర్శి, ఎం/ఓ ఎడ్యుకేషన్ సెషన్ –4 పై పిఎం ప్రదానం చేసిన కార్యక్రమాలు, 2022 - ఇన్నోవేషన్ (స్టేట్) చర్చకు అధ్యక్షత వహిస్తారు. ఐదవ సెషన్‌లో, "ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ సెషన్ ద్వారా స్వస్త్ భారత్ (ఆరోగ్యకరమైన భారత్) & హోలిస్టిక్ డెవలప్‌మెంట్‌ను ప్రమోట్ చేయడం" అనే అంశంపై ప్రెజెంటేషన్ చేయబడుతుంది. దీనికి డిఏఆర్&పిజి శ్రీ ఎన్‌బిఎస్‌ రాజ్‌పుత్‌ అధ్యక్షత వహిస్తారు.

2వ రోజు ఆరో సెషన్‌లో ప్రభుత్వ ఉత్తమ విధానాలపై చర్చలు జరుగుతాయి. దీనికి రాజస్థాన్‌ డిపిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ హేమంత్ గేరా అధ్యక్షత వహిస్తారు.

డిజి హెచ్‌సిఎం ఆర్‌ఐపిఏ శ్రీ నవీన్ మహాజన్ 7వ సెషన్‌ “పిఎం అవార్డ్ ఇనిషియేటివ్స్, 2022 – ఇన్నోవేషన్ (జిల్లా)” కి అధ్యక్షత వహిస్తారు:

8వ సెషన్  ప్రభుత్వ ఉత్తమ విధానాలపై చర్చలు నిర్వహిస్తుంది. దీనికి రాజస్థాన్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి  శ్రీమతి. వీణు గుప్తా అధ్యక్షత వహిస్తారు.

"పిఎం అవార్డెడ్ ఇనిషియేటివ్స్, 2022 (ప్రాధాన్యత కార్యక్రమం - హర్ ఘర్ జల్ యోజన)" పై 9వ సెషన్‌లో రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఏఆర్) శ్రీ అలోక్ కుమార్ గుప్తా అధ్యక్షతన చర్చలు నిర్వహిస్తారు.

డిజి,హెచ్‌సిఎం,ఆర్‌ఐపిఏ శ్రీ నవీన్ మహాజన్, రాజస్థాన్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ  శ్రీ అలోక్ గుప్తా మరియు భారత ప్రభుత్వ డిఏఆర్‌పి సెక్రటరీ శ్రీ వి. శ్రీనివాస్ స్వాగత ప్రసంగం చేస్తారు.

కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం, ప్రజా పరిపాలనలో ఆవిష్కరణలలో అనుభవాలను పంచుకోవడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం, సుపరిపాలన, ఇ-గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్ మొదలైనవాటిపై చర్చించడం. ఈ కార్యక్రమం రెండురోజులపాటు సాగుతుంది. దీనిలో రాష్ట్రాల ప్రతినిధులు/డిఎం/డిసిలు పిఎం అవార్డులుప  ప్రదానం చేసిన కార్యక్రమాలపై ప్రెజెంటేషన్ చేయడానికి/రాష్ట్రాల సుపరిపాలన పద్ధతులను విస్తృత ప్రచారం కోసం ఎంచుకోవడానికి ఆహ్వానించబడ్డారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు/యుటిల నుండి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.

 

 

<><><>


(Release ID: 1963670) Visitor Counter : 128