ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పిఎం శ్రీ నరేంద్ర మోదీ యు ట్యూబ్ ప్రయాణం : 15 సంవత్సరాల గ్లోబల్ ప్రభావం


యు ట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఇండియా 2023 సందర్భంగా తోటి యు ట్యూబర్లకు ఆంగ్ల భాషలో ప్రధానమంత్రి వీడియో సందేశం

Posted On: 27 SEP 2023 8:29PM by PIB Hyderabad

నా యు ట్యూబర్  మిత్రులారా,

మీ యు ట్యూబ్  సహచరుడుగా నేను ఈ రోజు మీ మధ్య ఉండడం ఆనందదాయకం. నేను కూడా మీ వంటి వాడినే. అంతకన్నా వేరు కాదు. గత 15 సంవత్సరాలుగా యు ట్యూబ్  చానెల్ ద్వారా నేను కూడా దేశంతో అనుసంధానమై ఉన్నాను. నాకు కూడా మంచి సంఖ్యలోనే సబ్ స్క్రయిబర్లున్నారు.

5 వేల మందికి పైగా క్రియేటర్లు, ఆకాంక్షాపూరిత క్రియేటర్లు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు నాకు తెలిసింది. కొందరు గేమింగ్  పైన, మరి కొందరు టెక్నాలజీ పైన, ఇంకొందరు ఫుడ్  బ్లాగింగ్  పైన, మరి కొందరు ట్రావెల్  బ్లాగర్లు, జీవనశైలిని ప్రభావితం చేసే వారు విభిన్న రంగాలపై కృషి చేస్తున్నారు.

మిత్రులారా,

పలు సంవత్సరాలుగా మీ కంటెంట్  దేశ ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది నేను చూస్తూనే ఉన్నాను. ఈ ప్రభావాన్ని మరింతగా విస్తరించుకునే అవకాశం కూడా మన ముందుంది.  మనందరం కలిసికట్టుగా దేశంలోని భారీ జనాభాలో పరివర్తిత మార్పును తీసుకురాగలుగుతాం. మనందరం కలిసికట్టుగా ప్రజలను సాధికారం చేసి, శక్తివంతం చేయగలుగుతాం. మనందరం కలిసికట్టుగా తేలిగ్గా ప్రజలకు బోధించగలుగుతాం, కీలకమైన అంశాలపై ప్రజల అవగాహన పెంచగలుగుతాం. మనం వారందరినీ మనతో అనుసంధానం చేయగలుగుతాం.  

మిత్రులారా,

నా చానెల్  లో వేలాగి వీడియోలు ఉన్నప్పటికీ పరీక్షల ఒత్తిడి, మన ఆకాంక్షలను సమతూకం చేసుకోవడం, ఉత్పాదకత పెంచుకోవడం వంటి అంశాలపై లక్షలాలది మంది విద్యార్థులతో మాట్లాడుతూ చేసిన వీడియోలే అత్యంత సంతృప్తికరం.

నేను అతి పెద్ద క్రియేటివ్  కమ్యూనిటీ ముందుతున్న సమయంలో కొన్ని అంశాలపై నేను మాట్లాడాలనుకుంటాను. ఈ టాపిక్స్  అన్నీ ప్రజా ఉద్యమానికి సంబంధించినవి. ప్రజల శక్తే వారి విజయానికి ఆధారం.

మొదటి టాపిక్  స్వచ్ఛత. స్వర్ఛ భారత్ గత తొమ్మిది సంవత్సరాల కాలంలో అతి పెద్ద ప్రచారంగా మారింది. ప్రతీ ఒక్కరూ అందులో తమ వంతుగా పాల్గొన్నారు. బాలలు దానికి భావోద్వేగపూరితమైన శక్తిని అందించారు. భిన్న రంగాల ప్రముఖులు దాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. దేశంలోని నలుమూలల ప్రజలు దాన్ని ఒక ఉద్యమంగా మార్చారు. మీ వంటి యు ట్యూబర్లు స్వచ్ఛత మరింత విస్తరింపచేశారు.

అయినా మనం ఇక్కడతో ఆగేది లేదు. స్వచ్ఛత భారతదేశ గుర్తింపుగా మారనంత వరకు మనం మారేది లేదు. అందుకే స్వచ్ఛత ప్రతీ ఒక్కరి ప్రాధాన్యత.

రెండో అంశం డిజిటల్  చెల్లింపులు. యుపిఐ విజయం కారణంగా నేడు దేశంలోని చెల్లింపుల్లో డిజిటల్  చెల్లింపుల వాటా 46 శాతానికి చేరింది. మరింత మంది డిజిటల్  చెల్లింపులు చేసేలా మీరు ప్రజల్లో  స్ఫూర్తి నింపాలి. మీ వీడియోల ద్వారా తేలికపాటి భాషలో వారికి బోధించాలి.

మరో అంశం స్థానికం కోసం నినాదం. మన దేశంలో పలు ఉత్పత్తులు స్థానికంగానే తయారుచేస్తారు. మన స్థానిక కళాకారుల నైపుణ్యాలు అద్భుతమైనవి. మీ పని ద్వారా మీరు దాన్ని ప్రచారం చేసి భారతదేశంలో స్థానికంగా తయారైన వస్తువులు ప్రపంచానికి చేరేలా సహాయపడాలి.

నాది మరో అభ్యర్థన కూడా ఉంది. స్థానిక మట్టి వాసన గల,  స్థానిక కార్మికుల స్వేదంతో తయారుచేసిన ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ప్రజలను భావోద్వేగపూరితంగా స్ఫూర్తిదాయకం చేయాలి. అది ఖాదీ, హస్తకళా వస్తువులు, చేనేత, ఏదైనా కావచ్చు. ఒక ఉద్యమం ప్రారంభించవలసిందిగా జాతిని మేల్కొలపాలి.

నా వైపు నుంచి మీకు మరో అభ్యర్ధన కూడా ఉంది. యు ట్యూబర్లుగా మీకు గల గుర్తింపుతో పాటు ఒక యాక్టివిటీని కూడా మీరు జోడించాలి. ప్రతీ ఎపిసోడ్  కి చివరన ఒక ప్రశ్న వేయడం లేదా ఏదైనా పని చేసేలా ఒకటి  జోడించాలి. ప్రజలు మీరు సూచించిన యాక్టివిటీ చేసి దాన్ని షేర్  చేసుకోవచ్చు. ఆ రకంగా మీ పలుకుబడి పెరుగుతుంది. ప్రజలు కేవలం వినడం కాదు, ఏదో ఒకటి చేయడంలో భాగస్వాములవుతారు.

మీ అందరితో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ వీడియోల చివరిలో మీరు ఏం జోడిస్తారు...నేను మరోసారి అభ్యర్థిస్తున్నాను. నా చానెల్  కు  సబ్ స్క్రయిబ్  చేయండి. నేను తాజాగా పెట్టే అంశాలు తెలుసుకోవడానికి బెల్  గుర్తును హిట్  చేయండి.

శుభాకాంక్షలు. 

***


(Release ID: 1963600) Visitor Counter : 104