జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జమ్ము కాశ్మీర్ లో వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమానికి రాయబారిగా పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బాణా సింగ్ నియామకం.

Posted On: 30 SEP 2023 4:08PM by PIB Hyderabad

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ గ్రామీణ ప్రాంతాలో పారిశుధ్య సవాలును ఎదుర్కొనేందుకు ,
దేశ అత్యున్నత
శౌర్య అవార్డు పరమ వీర చక్రను గెలుపొందిన కెప్టెన్ బాణా సింగ్ను , జమ్ము కాశ్మీర్ , డైరక్టరేట్ ఆఫ్ రూరల్
శానిటేషన్ , వ్యర్థాలపై యుద్దం కార్యక్రమానికి రాయబారిగా నియమించింది.
ఈ విషయాన్ని జమ్ము కాశ్మీర్ రూరల్ శానిటేషన్ కార్యక్రమ డైరక్టర్ శ్రీ చంద్రదీప్ సింగ్, జజమ్ములోని ఆర్.ఎస్.పుర లో గల
కెప్టెన్ బాణా సింగ్ స్టేడియంలో జరుగుతున్న స్వచ్ఛతా హి సేవ (ఎస్.హెచ్.ఎస్ 2023) సందర్భంగా ప్రకటించారు.

స్వచ్ఛతా హి సేవ (ఎస్.హెచ్ ఎస్ 2023)ను సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 02 వరకు నిర్వహిస్తున్నారు. పారిశుధ్యాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతొ అక్టోబర్ 2 న దేశ వ్యాప్తంగా జరిగే స్వచ్ఛ భారత్ దివస్ కు ముందస్తుగా దీనిని చేపట్టారు. దీనిని ఒక ప్రజా ఉద్యమంగా చేపడుతున్నారు.

ఎస్.హెచ్.సి ‌‌–2023 ముఖ్యాంశం ‘వ్యర్థాల రహిత భారతదేశం’. సఫాయి మిత్రల సంక్షేమం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ఈ సందర్భంగా దృష్టి కేంద్రీకరిస్తారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కంటోన్మెంట్ బోర్డులు, సముద్ర తీరాలు, పర్యాటక ప్రాంతాలు, జంతు ప్రదర్శన శాలలు,
జాతీయ పార్కులు, అభయారణ్యాలు, చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు, నదీతీరాలు,ఘాట్లు, డ్రైయిన్ లు ,నాలల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

జమ్ము కాశ్మీర్ , గ్రామీణ పారిశుధ్య సంస్థ డైరక్టర్ శ్రీ చంద్రదీప్ సింగ్ మాట్లాడుతూ, వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమం, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యపై దృష్టి కేంద్రీకరిస్తుందని అన్నారు.
అలాగే జమ్ముకాశ్మీర్ లోని గ్రామీణ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణపై పై దృష్టిపెడుతుందన్నారు. పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బాణా సింగ్ ఈ అవగాహనా కార్యక్రమంలో చేతులు కలపడం వల్ల
సుస్థిర పర్యావరణ హిత కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి, ఈ దిశగా స్థానికులకు ప్రేరణ నివ్వడానికి , స్థానిక ప్రజలు ఉత్సాహంగా పరిసరాల పరిశుభ్రతా కార్యక్రమాలలో పాలుపంచుకోవడానికి వీలు కలుగుతుందన్నారు.
ఇది వ్యర్థాలను తగ్గించడానికి, జమ్ముకాశ్మీర్ ప్రకృతి సౌందర్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందన్నారు.


కెప్టెన్ సింగ్, అంకిత భావంగల, అసమాన ధైర్య సాహసాలు గల మిలటరీ సర్వీస్ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఆయన జమ్ము కాశ్మీర్ స్వచ్ఛతను, అందాన్ని కాపాడే బృహత్తర బాధ్యతను స్వీకరించారు. ఈ దిశగా వ్యర్థాలు,
కాలుష్యంపై పోరాటానికి నాయకత్వం వహిస్తారు. వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమానికి రాయబారిగా , కెప్టెన్ బాణా సింగ్
తన అనుభవాన్ని, తన అంకిత భావాన్ని  ఈ బృహత్తర కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.
దేశ సరిహద్దులలో దేశ రక్షణకు అంకితభావంతో పనిచేసిన కెప్టెన్ బాణాసింగ్ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు తన కృషిని కొనసాగించనున్నారు.

ఎస్.హెచ్.ఎస్ 2023 కార్యక్రమానికి సంబంధించి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, కెప్టెన్ బాణాసింగ్,
తనకు అప్పగించిన నూతన బాధ్యతలపై సంతోషం వ్యక్తం చేశారు. ‘‘దేశ రక్షణకు అంకితమైన విధంగానే నేను, పర్యావరణ పరిరక్షణకు అంకితమవుతున్నాను”అని ఆయన ప్రకటించారు.జమ్ము కాశ్మీర్ సహజసిద్ధ సౌందర్యం, జాతి విలువైన సంపద అని, దీనిని రాగల తరాల వారికి అంతే పరిశుభ్రతతో అందించడం అవసరమని ఆయన అన్నారు.
స్వచ్ఛతా ప్రతిజ్ఞా కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్.సి.సి కేడెట్లు, పి.ఆర్.ఐ లు
చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలు, షాపుల యజమానులు,పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైకిల్ రేస్, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు.
సైకిల్ రేస్, పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన వారికి డైరక్టర్ బహుమతులు అందజేశారు.

 

***


(Release ID: 1962954) Visitor Counter : 91