ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణలోని మహబూబ్ నగర్ లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

Posted On: 01 OCT 2023 4:25PM by PIB Hyderabad

 

 
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారుకేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు  జి.కిషన్ రెడ్డి గారుపార్లమెంటులో నా సహచరులు శ్రీ సంజయ్ కుమార్ బండి గారుఇతర ప్రముఖులులేడీస్ అండ్ జెంటిల్మెన్నమస్కారం!

 

దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. నారీ శక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. నేడు తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు జరగడం ఇక్కడి పండుగ వాతావరణాన్ని మరింత పెంచింది. తెలంగాణ ప్రజల కోసం రూ.13,500 కోట్ల విలువైన పథకాలుప్రాజెక్టులు చేపట్టినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను.

 

నా కుటుంబ సభ్యులారా,

ఇక్కడి ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చే ఇలాంటి అనేక రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు ఈ రోజు నేను శంకుస్థాపన చేసి అంకితం చేసినందుకు సంతోషంగా ఉంది. నాగ్పూర్-విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణఆంధ్రప్రదేశ్మహారాష్ట్రకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. దీని వల్ల ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యంపర్యాటకంపరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఊపందుకోనున్నాయి. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలు గుర్తించబడ్డాయి. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లుఐదు మెగా ఫుడ్ పార్కులునాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లుమూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లుఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉంటాయి. దీంతో హన్మకొండవరంగల్మహబూబాబాద్ఖమ్మం జిల్లాల యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఆయా జిల్లాల రైతుల పంటల్లో విలువ జోడింపు జరుగుతుంది.

నా కుటుంబ సభ్యులారా,

తెలంగాణ వంటి భూపరివేష్టిత రాష్ట్రానికి రోడ్డురైలు కనెక్టివిటీ అవసరం చాలా ఉందిఇక్కడ తయారైన వస్తువులను సముద్ర తీరానికి తరలించి వాటి ఎగుమతులను ప్రోత్సహించవచ్చు . తెలంగాణ ప్రజలు ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించుకోవాలి. ఈ కారణంగా దేశంలోని అనేక ప్రధాన ఆర్థిక కారిడార్లు తెలంగాణ గుండా వెళుతున్నాయి. ఇవి తూర్పుపశ్చిమ తీరంతో అన్ని రాష్ట్రాలను కలిపే మాధ్యమంగా మారనున్నాయి. హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ లోని సూర్యాపేట-ఖమ్మం సెక్షన్ కూడా ఇందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇది తూర్పు తీరానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అదే సమయంలో పరిశ్రమలువ్యాపారాల లాజిస్టిక్స్ ఖర్చులు బాగా తగ్గుతాయి. జక్లేరు- కృష్ణా సెక్షన్ మధ్య నిర్మిస్తున్న రైల్వే లైన్ కూడా ఇక్కడి ప్రజలకు ఎంతో కీలకం కానుంది.

నా కుటుంబ సభ్యులారా,

భారతదేశం పసుపు యొక్క ప్రధాన ఉత్పత్తిదారువినియోగదారు మరియు ఎగుమతిదారు. తెలంగాణలో కూడా ఇక్కడి రైతులు పసుపును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. కరోనా తర్వాత పసుపుపై అవగాహన కూడా పెరగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాని డిమాండ్ కూడా పెరిగింది. నేడుపసుపు ఉత్పత్తి నుండి ఎగుమతి మరియు పరిశోధన వరకు మొత్తం విలువ గొలుసులో మరింత వృత్తిపరమైన మార్గాలపై దృష్టి పెట్టడం అవసరం. దీనికి సంబంధించిన పెద్ద నిర్ణయాన్ని ఈ రోజు తెలంగాణ గడ్డపై నుంచి ప్రకటిస్తున్నాను. పసుపు రైతుల అవసరాలుభవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వారి ప్రయోజనాల కోసం 'జాతీయ పసుపు బోర్డు'ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 'జాతీయ పసుపు బోర్డుసరఫరా గొలుసులో విలువ జోడింపు నుండి మౌలిక సదుపాయాల పనుల వరకు రైతులకు సహాయపడుతుంది. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు తెలంగాణ తో పాటు దేశంలోని పసుపు పండించే రైతులందరినీ నేను అభినందిస్తున్నాను.

నా కుటుంబ సభ్యులారా,

నేడుప్రపంచవ్యాప్తంగా ఇంధన మరియు ఇంధన భద్రతపై చాలా చర్చ జరుగుతోంది. భారతదేశం తన పరిశ్రమలకు మాత్రమే కాకుండా దేశీయ ప్రజలకు కూడా ఇందన శక్తిని అందించింది. దేశంలో 2014లో 14 కోట్లుగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 2023 నాటికి 32 కోట్లకు పెరిగింది. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. భారత ప్రభుత్వంఎల్పిజి యాక్సెస్ ను పెంచడంతో పాటుఇప్పుడు తన పంపిణీ నెట్వర్క్ ను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. హసన్-చర్లపల్లి ఎల్పీజీ పైప్లైన్ ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఇంధన భద్రతను అందించడంలో ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం-హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ కు కూడా ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది. దీని వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగాపరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.

 

నా కుటుంబ సభ్యులారా,

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివిధ భవనాలను ఈ రోజు నేను ప్రారంభించాను. హైదరాబాద్ యూనివర్శిటీకి ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కల్పించి ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజునేను మీ మధ్య మరొక పెద్ద ప్రకటన చేయబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ గిరిజన దేవతలు సమ్మక్క-సారక్క పేరు పెట్టబడుతుంది. సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కోసం రూ.900 కోట్లు వెచ్చించనున్నారు.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కోసం తెలంగాణ ప్రజలను అభినందిస్తున్నాను. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. . ప్రస్తుతం నేను ఈ ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నానుఅందుకే నేను దానికే పరిమితమయ్యాను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఓపెన్ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ ఓపెన్‌గా మాట్లాడతానుఏం చెప్పినా తెలంగాణ మనసులో మాట చెబుతాను. ఇక్కడి ప్రజల మనసులో మాట గురించి మాట్లాడతాను.

 

చాలా ధన్యవాదాలు!

****

 

 


(Release ID: 1962776) Visitor Counter : 197