వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్" కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు ఎస్ఏఫ్ఏసీ కార్యాలయంలో జరిగే భారీ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గోనున్న 300 మంది


ప్రస్తుతం అమలు జరుగుతున్న స్వ‌చ్ఛ‌తా హీ సేవాలో భాగంగా 'ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' కార్యక్రమం నిర్వహించాలని పిలుపు ఇచ్చిన ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

అక్టోబ‌ర్ 1వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి 1 గంట సేపు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గోవాలి ... ప్రధానమంత్రి పిలుపు

Posted On: 30 SEP 2023 1:25PM by PIB Hyderabad

"ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్" కార్యక్రమంలో భాగంగా  హౌజ్ ఖాస్‌లో ఉన్నఎఫ్ఎఫ్ఏసి  భవనంలో   వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నిర్వహించనున్న స్వచ్ఛత కార్యక్రమంలో శాఖకు చెందిన చెందిన 300 మందికి పైగా ఉద్యోగులు పాల్గొంటారు.కార్యక్రమం ప్రధాన కార్యక్రమంగా "ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ప్రజలు  అక్టోబర్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒక గంట సేపు  స్వచ్ఛందంగా పాల్గొని  స్వచ్ఛత కార్యక్రమాలు చేపడతారు.  

2023 సెప్టెంబర్ 15 న ప్రారంభమైన  'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమం  అక్టోబర్ 2 వరకు అమలు జరుగుతుంది.'చెత్త రహిత భారతదేశం'  నిర్మాణం కోసం ప్రజలు స్వచ్చందంగా పాల్గొనేలా చేయాలని లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో  శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమాలు అమలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ప్రజల సహకారం, భాగస్వామ్యంతో అమలు జరిగే విధంగా  సంస్థలు, పాఠశాలలు, మార్కెట్‌లు , ఉద్యానవనాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడానికి  వ్యూహాత్మకంగా ప్రణాళిక సిద్ధం చేశారు. 

శ్రమదానం చేసి స్వచ్ఛత సాధించి బాపు (మహాత్మా గాంధీ) జయంతి సందర్భంగా ఆయనకు  సామూహిక 'స్వచ్ఛాంజలి' (నివాళులు) ఘటించాలని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. తమ సమయాన్ని కేటాయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి  పిలుపు ఇచ్ఛారు. వీధి, లేదా పొరుగు పార్క్, నది, సరస్సు లేదా మరేదైనా బహిరంగ ప్రదేశంలో జరిగే కార్యక్రమంలో ప్రజలు పాల్గోవాలని ఆయన కోరారు. 

ప్రధాన కార్యాలయంతో సహా  వివిధ సబార్డినేట్ కార్యాలయాలలో , అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా 250కి పైగా కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ నిర్ణయించింది.  7,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా  కార్యక్రమాలను రూపొందించారు.  కృషి భవన్ కారిడార్‌లను కొత్తగా కుండీలలో ఉంచిన మొక్కలతో అలంకరించనున్నారు.

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2న వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ  ఉద్యోగుల పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తారు. పోటీల ద్వారా పరిశుభ్రత ప్రాముఖ్యత పట్ల యువతకు అవగాహన కల్పించి స్వచ్ఛత కార్యక్రమాల్లో వారు పాల్గొనేలా చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.స్వచ్ఛత పట్ల [ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్యోగులు  ర్యాలీ నిర్వహిస్తారు. 

'ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' కోసం సమగ్ర సోషల్ మీడియా ప్రచారం కూడారూపొందించారు. స్వచ్ఛత కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలు నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియో లను ఎప్పటికప్పుడు పంపడానికి ఏర్పాటు చేశారు.  సంబంధిత మంత్రిత్వ శాఖలు వీటిని   ట్యాగ్ చేస్తాయి. అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్లో  మంత్రిత్వ శాఖ,  సబార్డినేట్ డైరెక్టరేట్‌లలో  జరిగిన  వివిధ కార్యకలాపాలను పొందుపరుస్తారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకార్యదర్శి  శ్రీ మనోజ్ అహుజా నేతృత్వంలో అధికారులు  సాధారణ పరిశుభ్రత సమీక్షలు నిర్వహించారు.   ప్రాంగణాలు, వాహనాలు, క్యాంటీన్‌లనుషర్బరపరిచేందుకు కార్యక్రమాలు చేపట్టారు.  సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్, నాగాలాండ్, డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్, మేనేజ్‌మెంట్ మొదలైన సంస్థలు అమలు చేసిన స్వచ్ఛతా హి సేవ  కార్యకలాపాలను  మంత్రిత్వ శాఖ  సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పొందుపరిచాయి.  అంతర్జాతీయచిరు ధాన్యాల  సంవత్సరాన్ని పురస్కరించుకుని, వ్యవసాయ,రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.  సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా  స్వచ్ఛమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని, నేల కాలుష్యాన్ని నివారించే అంశంలో చిరుధాన్యాలు పోషించే కీలక పాత్ర తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. 

***

 


(Release ID: 1962611) Visitor Counter : 106