గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 జులై 10.7% పెరిగిన ఖనిజ ఉత్పత్తి పదిహేను కీలక ఖనిజాల ఉత్పత్తిలో వృద్ధి

प्रविष्टि तिथि: 28 SEP 2023 11:22AM by PIB Hyderabad

2023 జులైలో, గనులు & క్వారీ రంగం ఖనిజ ఉత్పత్తి సూచిక 111.9 వద్ద ఉంది. జులై 2022 స్థాయితో పోలిస్తే ఇది 10.7 % వృద్ధి. 'ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్' (ఐబీఎం) తాత్కాలిక గణాంకాల ప్రకారం, 2023 ఏప్రిల్‌-జులైలో మొత్తం వృద్ధి, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.3%గా ఉంది.

2023 జులైలో కీలక ఖనిజాల ఉత్పత్తి స్థాయిలు: బొగ్గు 693 లక్షల టన్నులు, లిగ్నైట్ 32 లక్షల టన్నులు, సహజ వాయువు (యుటిలైజ్డ్‌) 3062 మిలియన్ క్యూ.మీ, పెట్రోలియం (ముడి) 25 లక్షల టన్నులు, బాక్సైట్ 1477 వేల టన్నులు, క్రోమైట్ 280 వేల టన్నులు, రాగి కాన్సెన్‌ట్రేట్‌ 10 వేల టన్నులు, బంగారం 102 కిలోలు, ఇనుప ఖనిజం 172 లక్షల టన్నులు, లెడ్ కాన్సెన్‌ట్రేట్‌ 30 వేల టన్నులు, మాంగనీస్ ఖనిజం 217 వేల టన్నులు, జింక్ కాన్సెన్‌ట్రేట్‌ 132 వేల టన్నులు, సున్నపురాయి 346 లక్షల టన్నులు, ఫాస్ఫోరైట్ 120 వేల టన్నులు, మాగ్నసైట్ 10 వేల టన్నులు.

2022 జులైతో పోలిస్తే 2023 జులైలో సానుకూల వృద్ధిని చూపిన కీలక ఖనిజాలు: క్రోమైట్ (45.9%), మాంగనీస్ ఖనిజం (41.7%), బొగ్గు (14.9%), సున్నపురాయి (12.7%), ఇనుప ఖనిజం (11.2%), బంగారం (9.7%), రాగి కాన్సెన్‌ట్రేట్‌ (9%), సహజ వాయువు (యుటిలైజ్డ్‌) (8.9%), లెడ్‌ కాన్సెన్‌ట్రేట్‌ (4.7%), జింక్ కాన్సెన్‌ట్రేట్‌ (3.6%), మాగ్నసైట్ (3.4%), పెట్రోలియం (ముడి) (2.1%). ప్రతికూల వృద్ధిని చూపిన ఇతర కీలక ఖనిజాలు: లిగ్నైట్ (-0.7%), బాక్సైట్ (-3.2%), ఫాస్ఫోరైట్ (-24.7%), వజ్రాలు (-27.3%).

 

***


(रिलीज़ आईडी: 1962544) आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Tamil , English , Urdu , हिन्दी , Marathi