ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోనిఛోటాఉదేపుర్ లోని బోడెలీ లో 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువకలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు దేశ ప్రజల కుఅంకితం చేసిన ప్రధాన మంత్రి
‘మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ కార్యక్రమం లోభాగం లో 4,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తో పాటు దేశ ప్రజల కు అంకితం చేయడమైంది
‘విద్య సమిక్ష కేంద్ర 2.0’ కు మరియు ఇతర అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేశారు
‘‘పేదవారి కి ఒక ఇల్లు అనేది మా దృష్టి లో కేవలం ఒక సంఖ్య కాదు, అది వారి గౌరవానికి చిహ్నం’’
‘‘మా లక్ష్యం ఆదివాసి ప్రాంతాల యువత కుఅవకాశాల ను కల్పిస్తూ ప్రతిభ కు ప్రోత్సహించడం’’
‘‘నేను ఇక్కడ కువచ్చింది ఛోటా ఉదేపుర్ సహా ఆదివాసిప్రాంతాలన్నిటి మాతృమూర్తుల కు మరియు సోదరీమణుల కు ఒక మాట చెప్పడానికి; అది ఏమిటిఅంటే మీ హక్కుల ను పరిరక్షించడానికి మీ పుత్రుడు వచ్చాడు అనేదే’’
Posted On:
27 SEP 2023 3:45PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని ఛోటా ఉదేపుర్ లోని బోడెలీ లో 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు. వీటి లో ‘మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ కార్యక్రమం లో భాగం గా 4,500 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు శంకుస్థాపన తో పాటు అంకితం ఇవ్వడం, అలాగే ‘విద్య సమీక్ష కేంద్ర 2.0’ కు మరియు ఇతర అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన లు కలసి ఉన్నాయి.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాంతం తో తనకు చాలా కాలం నుండి ఉన్న అనుబంధాన్ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆయన ఈ రోజు న ప్రారంభం అయిన, లేదా శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టు ల విషయం లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ ప్రాంతం లో ఒక కార్యకర్త గా తాను వ్యవహరించిన రోజుల ను మరియు ఇక్కడి పల్లెల లో తాను వెచ్చించిన కాలాన్ని కూడా గుర్తు చేసుకొన్నారు. శ్రోతల లో తన కు పరిచయం ఉన్న పలువురిని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం లో స్థితిగతుల గురించి మరియు ఆదివాసి సముదాయం యొక్క జీవన సరళి ని గురించి తనకు చాలా సన్నిహితమైనటువంటి ఎరుక ఉంది అని ఆయన అన్నారు. తాను అధికార బాధ్యతల ను స్వీకరించినప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం చెప్పుకొన్నానని శ్రోతల కు ఆయన వెల్లడించారు. తన పదవీ కాలం లో ప్రారంభం అయిన అనేక పథకాల తాలూకు సకారాత్మక ప్రభావాన్ని గమనించినప్పుడు తనకు సంతృప్తి కలిగింది అని ఆయన చెప్పారు. జీవితం లో తొలిసారి గా బడి ని చూసిన చిన్నారులు ప్రస్తుతం ఉపాధ్యాయులు గా మరియు ఇంజినీర్ లుగా చక్కగా రాణిస్తున్నారని వారిని చూసి ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు.
పాఠశాల లు, రహదారులు, గృహ నిర్మాణం, నీటి లభ్యతల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇవి సమాజం లో పేద ప్రజల కు జీవనాన్ని హుందాతనం తో గడిపేందుకు మౌలికమైన అంశాలు అని చెప్తూ, ఇవి ఒక ఉద్యమం తరహా లో పాటు పడడానికి తన ప్రాధాన్యాలు గా ఉంటూ వచ్చాయి అని వివరించారు. దేశం లో పేదల కోసం నాలుగు కోట్ల కు పైగా గృహాల ను నిర్మించడం జరిగింది అని ఆయన తెలియ జేశారు. ‘‘మా దృష్టి లో పేదల కు గృహం అంటే అది కేవలం సంఖ్య కాదు, అది సమ్మానానికి గుర్తు’’ అని ఆయన అన్నారు. ఈ ఇళ్ళ రూపురేఖల ను గురించి నిర్ణయాన్ని తీసుకొనే పని ని లబ్ధిదారుల కే ఇవ్వడమైందని ఆయన అన్నారు. ఈ గృహాల లో చాలా వరకు ఆ ఇంటి లో నివాసం ఉండే కుటుంబం యొక్క మహిళ ల పేరిట ఉన్నాయన్న వాస్తవాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదే విధం గా ప్రతి ఒక్క కుటుంబం త్రాగే నీటి ని నల్లా ద్వారా అందుకొంటోంది, దీనితో మనుగడ సాగించడం సరళతరం అయింది అని ఆయన అన్నారు. జల్ జీవన్ మిశన్ లో భాగం గా పంపు ద్వారా నీటి ని సరఫరా చేయడం కోసం పది కోట్ల క్రొత్త వాటర్ కనెక్శన్ లను అందించడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రం లో పని చేస్తూ ఉండగా తాను సంపాదించుకొన్న అనుభవం జాతీయ స్థాయి లో సైతం తనకు సహాయాన్ని అందిస్తోంది అని ఆయన జన సముదాయం తో చెప్పారు. ‘‘మీరే నా గురువు లు’’ అని ఆయన అన్నారు.
విద్య బోధన రంగాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నేటి ప్రాజెక్టు లు గుజరాత్ ను అగ్ర స్థానం లో నిలిపే దిశ లో వేసినటువంటి ఒక పెద్ద అడుగు గా ఉన్నాయి అని అభివర్ణించారు. దీనికి గాను ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ యొక్క యావత్తు జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ‘‘మిశన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మరియు విద్య సమీక్ష 2.0’’.. వీటి వల్ల పాఠశాల లో చదువుకోవడం అనే అంశం లో ఒక సకారాత్మకమైన ప్రభావం పడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. విద్య సమీక్ష కేంద్రాల విషయం లో ప్రపంచ బ్యాంకు చెయర్ మన్ తో తాను జరిపిన సంభాషణల ను గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, భారతదేశం లో ప్రతి ఒక్క జిల్లా లో విద్య సమీక్ష కేంద్రాల ను ఏ ర్పాటు చేయాలని చెయర్ మన్ కోరారని, ఈ పవిత్రమైనటువంటి కార్యం లో సమర్థన ను అందించడాని కి ప్రపంచ బ్యాంకు సిద్ధం గా ఉంది అని వెల్లడించారు. ఈ విధమైన కార్యక్రమం ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థుల కు వనరుల లేమి తో బాధపడుతున్న వారికి బోలెడంత ప్రయోజనం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేం ఆదివాసీ ప్రాంతాల యువత కు అవకాశాల ను కల్పిస్తూనే ప్రతిభ ను ప్రోత్సహించాలని లక్ష్యం గా పెట్టుకొన్నాం’’ అని ఆయన అన్నారు.
గడచిన రెండు దశాబ్దాల లో ప్రభుత్వం విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి పై శ్రద్ధ వహిస్తూ వచ్చింది అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. రెండు దశాబ్దాల కు పూర్వం, పాఠశాలల్లో మరియు కళాశాల ల్లో గురువుల కు కొదవ మరియు ఇతర విద్యా సంబంధి సదుపాయాల కు లోటు ఉండేది అని ప్రధాన మంత్రి సూచనప్రాయం గా చెప్తూ ఈ కారణం గా పెద్ద సంఖ్య లో విద్యార్థులు బడి కి వెళ్లడాన్ని మధ్య లోనే మానివేసే వారు అని ఆయన అన్నారు. గుజరాత్ కు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల ను గా తాను చేపట్టిన కాలం లో రాష్ట్రం లోని ఆదివాసి ప్రాంతాల లో ఒక్క సైన్స్ స్కూల్ అయినా లేకపోవడం విచారకరం అని ఆయన అన్నారు. ‘‘ఈ స్థితి ని ప్రభుత్వం పూర్తి గా మార్చివేసింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. గత ఇరవై సంవత్సరాల లో 2 లక్షల మంది ఉపాధ్యాయుల ను నియమించడమైంది. మరి, 1.25 లక్షల కు పైచిలుకు తరగతి గదుల ను నిర్మించడం జరిగింది అని ఆయన వెల్లడించారు. ఆదివాసి ప్రాంతాల లో రెండు దశాబ్దాల లో విజ్ఞానశాస్త్రం, వాణిజ్యశాస్త్రం లతో పాటు కళల కు సంబంధించిన సంస్థల నెట్ వర్క్ ఒకటి ఉనికి లోకి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల లో ఇరవై అయిదు వేల తరగతి గదుల ను మరియు అయిదు క్రొత్త వైద్య కళాశాల లను నిర్మించింది అని ఆయన తెలిపారు. ఈ సందర్భం లో గోవింద్ గురు విశ్వవిద్యాలయాన్ని మరియు బిర్ సా ముండా విశ్వవిద్యాలయాన్ని గురించి ఆయన ఉదాహరణలు గా పేర్కొన్నారు. ఈ ప్రాంతాల లో అనేక నైపుణ్యాభివృద్ధి సంస్థ లు కూడా ఏర్పాటయ్యాయి అని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.
నూతన జాతీయ విద్య విధానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మాతృభాష లో విద్య బోధన అనేది ఆదివాసి విద్యార్థుల కు క్రొత్త అవకాశాల ను అందించడం తో పాటు వారిని సశక్తులు గా తీర్చిదిద్దుతుంది అని ఆయన అన్నారు. పద్నాలుగు వేల కు పైగా పిఎమ్ శ్రీ పాఠశాల లను గురించి మరియు ఏకలవ్య ఆవాసీయ విద్యాలయాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పాఠశాల లు ఆదివాసి ప్రాంతాల లోని ప్రజల యొక్క జీవనం లో మార్పుల ను తీసుకు వస్తున్నాయని ఆయన అన్నారు. ఎస్ సి/ఎస్ టి ఉపకార వేతనాల తో విద్యార్థుల కు సహాయం అందుతోంది అని ఆయన అన్నారు. దేశం లో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ లో ఆదివాసి యువత కు ప్రోత్సాహాన్ని అందించే ప్రయాస లు జరుగుతున్నాయి అని ప్రధాన మంత్రి వివరించారు. మారుమూల ప్రాంతాల పాఠశాల ల్లో ఏర్పాటు అవుతున్న అటల్ టింకరింగ్ లేబ్స్ ఆదివాసి విద్యార్థుల లో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి అని ఆయన అన్నారు.
వర్తమాన ప్రపంచం లో నైపుణ్యాల కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి పలుకుతూ కౌశల్ వికాస్ కేంద్రాల ను గురించి మరియు లక్షల కొద్దీ యువత కు కౌశల్ వికాస్ యోజన లో భాగం గా శిక్షణ ను ఇవ్వడం గురించి వివరించారు. ముద్ర యోజన లో భాగం గా అందిస్తున్న పూచీకత్తు అక్కరలేనటువంటి రుణాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించి, అవి కోట్ల కొద్దీ తొలి తరం నవపారిశ్రమికుల ను తయారు చేస్తున్నాయి అన్నారు. అలాగే వన్ ధన్ కేంద్రాల తో రాష్ట్రం లో లక్షల కొద్దీ ఆదివాసులు ప్రయోజనాలను అందుకొంటున్నారు అని ఆయన అన్నారు. ఆదివాసి ఉత్పాదన లు మరియు హస్తకళ ఉత్పాదనల కోసం ప్రత్యేకం గా విక్రయ కేంద్రాల ను ఏర్పాటు చేయడాన్ని గురించి కూడా ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు.
సెప్టెంబర్ 17వ తేదీ నాడు ప్రారంభం అయిన పిఎమ్ విశ్వకర్మ యోజన ను గురించి ప్రధాన మంత్రి తెలియజేశారు. క్షురకులు, దర్జీలు, ధోబీలు, కుమ్మరులు, కమ్మరులు, స్వర్ణకారులు, సుతారీ వృత్తిదారులు, పూలదండల ను అల్లే వారు, పాదరక్షల ను తయారు చేసే వారు, తాపీ మేస్త్రులు వంటి వారికి తక్కువ వడ్డీ రేటు కు రుణాలు, ఉపకరణాలు మరియు శిక్షణ అందుతాయి అని తెలియజేశారు. ఈ తరహా నేర్పుల ను మరియు సంప్రదాయాల ను సజీవం గా ఉంచాలి అనేదే ఈ ప్రయత్నం అని ఆయన అన్నారు. ‘‘ఈ పథకం లో భాగం గా రుణాన్ని అందుకోవడానికి ఎటువంటి పూచీకత్తుల ను సమర్పించవలసిన అవసరం ఉండదు. ఒకే ఒక్క పూచీకత్తు ఉంది, అది మోదీ’’ అని ఆయన అన్నారు.
దళితులు, వెనుకబడిన వర్గాల వారు మరియు ఆదివాసులు, ఇంకా ఆదరణ కు నోచుకోకుండా ఉండిపోయిన వర్గాల వారు.. వీరందరు ప్రభుత్వం అమలు పరస్తున్న వివిధ పథకాల అండతో ప్రస్తుతం అభివృద్ధి శిఖరాల ను అందుకొంటున్నారు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నో దశాబ్దాల అనంతరం ఆదివాసుల గౌరవాని కి శ్రద్ధాంజలి ని ఘటించే అవకాశం లభించింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భగవాన్ బిర్ సా ముండా యొక్క జయంతి ని ప్రస్తుతం జన్ జాతీయ గౌరవ్ దివస్ గా పాటించడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. ఆదివాసి సముదాయాల కోసం బడ్జెటు ను ఇదివరకటి కాలం తో పోలిస్తే అయిదింతలు గా ప్రస్తుత ప్రభుత్వం పెంచింది అని కూడా ఆయన తెలియజేశారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ పార్లమెంటు నూతన భవనం లో ఆమోదం లభించిన మొట్టమొదటి చట్టం గా ప్రసిద్ధం అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆదివాసీల ను మరియు మహిళల ను ఇంత కాలం పాటు వారి హక్కుల కు నోచుకోకుండా ఉంచవలసి వచ్చింది ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ‘‘నేను ఛోటా ఉదేపుర్ సహా యావత్తు ఆదివాసి ప్రాంతం లోని మాతృమూర్తుల కు మరియు సోదరీమణుల కు ఒక మాట చెప్పడానికి వచ్చాను.. అది ఏమిటి అంటే మీ యొక్క ఈ పుత్రుడు మీ హక్కుల ను మీకు దక్కేటట్లు గా చూడడానికి వచ్చాడు అనేదే’’ అని ఆయన అన్నారు.
మహిళలు అందరికి ఇప్పుడు పార్లమెంటు లో మరియు అసెంబ్లీ లో పాలుపంచుకొనేందుకు మార్గాలు తెరచుకొన్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఎస్ సి మరియు ఎస్ టి సముదాయాల కు చెందిన వారికి రాజ్యాంగం రిజర్వేశన్ లను కల్పిస్తోంది అని కూడా ఆయన ప్రస్తావించారు. క్రొత్త చట్టం లో ఎస్ సి /ఎస్ టి కేటగిరీల కు చెందిన మహిళల కు రిజర్వేశన్ సంబంధి ఏర్పాటు సైతం ఉంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ చట్టం అమలు లోకి వస్తున్నట్లుగా తెలిపే పత్రాల మీద భారతదేశం యొక్క తొలి ఆదివాసి మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేయడం మంచి ఘటన అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
అమృత కాలం యొక్క సంకల్పాలు నెరువేరుతాయన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో వ్యక్తం చేశారు; ఎందుకంటే వాటి ఆరంభమే ఎంతో గొప్ప గా ఉంది కాబట్టి అని ఆయన అన్నారు.
ఈ సందర్భం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్. పాటిల్ లతో పాటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు సహా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
పూర్వరంగం
ప్రధాన మంత్రి 4,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల ను ‘మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ కార్యక్రమం లో భాగం గా దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన కూడా చేయడం తో గుజరాత్ రాష్ట్రం అంతటా పాఠశాల ల సంబంధి మౌలిక సదుపాయాల కు భారీ స్థాయి లో ప్రోత్సాహం లభించనుంది. ప్రధాన మంత్రి గుజరాత్ లో పాఠశాలల్లో నిర్మాణం పూర్తి అయినటువంటి వేల కొద్దీ క్రొత్త తరగతి గదుల ను, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను, కంప్యూటర్ లేబ్స్ ను, ఎస్ టిఇఎమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మేథమెటిక్స్) లేబ్స్ ను, ఇంకా ఇతర మౌలిక సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయన ఈ మిశన్ లో భాగం గా గుజరాత్ లో పలు ప్రాంతాల లో వేల కొద్దీ తరగతి గదుల మెరుగుదల పనుల కు మరియు ఉన్నతీకరణ పనుల కు శంకుస్థాపన కూడా చేశారు.
ప్రధాన మంత్రి ‘విద్య సమీక్ష కేంద్ర 2.0’ ప్రాజెక్టు కు కూడా శంకుస్థాపన చేశారు. ఈ పథకాన్ని గుజరాత్ లో పాఠశాల ల నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థులు విద్య ను నేర్చుకొనేందుకు సంబంధించిన పరిణామాల లో మెరుగుదల కు పూచీ పడిన ‘విద్య సమీక్ష కేంద్ర’ పథకం యొక్క సాఫల్యాన్ని గమనించి మరీ రూపొందించడం జరుగుతుంది. ‘విద్య సమీక్ష కేంద్ర 2.0’ తో గుజరాత్ లో అన్ని జిల్లాల లో మరియు బ్లాకుల లో విద్య సమీక్ష కేంద్రాల ను స్థాపించడం జరుగుతుంది.
కార్యక్రమం లో భాగం గా, వడోదర జిల్లా సినోర్ తాలూకా లో నర్మద నది మీదుగా నిర్మాణం పూర్తి అయిన ‘వడోదర దాభోయి-సినోర్-మాల్ సర్-ఆసా రోడ్’ పేరు గల ఒక క్రొత్త వంతెన సహా అనేక అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ అభివృద్ధి పథకాల లో చాబ్ తలావ్ రీ-డెవలప్ మెంట్ ప్రాజెక్టు, దాహోద్ లో నీటి సరఫరా పథకం, ఆర్థికం గా బలహీన వర్గాల వారి కోసం వడోదర లో క్రొత్త గా నిర్మించినటువంటి సుమారు 400 ఇళ్ళు , యావత్తు గుజరాత్ లోని 7,500 గ్రామాల లో పల్లె ప్రాంత వై-ఫై ప్రాజెక్టు; అలాగే, దాహోద్ లో నూతనం గా నిర్మాణం జరిగిన జవాహర్ నవోదయ విద్యాలయ లు కూడా ఉన్నాయి.
ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన పథకాల లో - ఛోటా ఉదేపుర్ లో నీటి సరఫరా పథకం; పంచ్ మహల్ లోని గోధ్ రా లో ఒక ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి ; దాహోద్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్ (బిఐఎన్ డి) పథకం లో భాగం గా నిర్మించేటటువంటి ఎఫ్ఎమ్ రేడియో స్టుడియో - ఉన్నాయి.
*****
DS/TS
(Release ID: 1961539)
Visitor Counter : 112
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam