ఆర్థిక మంత్రిత్వ శాఖ

వివాద్ సే విశ్వాస్-I ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చెందిన 10,000కు పైగా క్లెయిమ్ లను ఆమోదించడం జరిగింది.


ఈ పథకం కింద ఇప్పటివరకు MSMEలకు విడుదల చేసిన రూ. 256 కోట్ల సహాయ గ్రాంటు బ్యాంక్ రుణాల ప్రవాహం ఆగకుండా పెరిగి సంస్థలను హామీల (బ్యాంక్ గ్యారంటీలు) నుంచి విముక్తుల్ని చేయడం జరిగింది.

Posted On: 26 SEP 2023 1:43PM by PIB Hyderabad


           సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (MSMEలకు) భారీ ఊరటను కలుగజేస్తూ వివిధ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు  కోవిడ్ -19 మహమ్మారి కాలానికి ఎంతో ఊరట కలుగజేస్తూ వివాద్ సే విశ్వాస్-I పథకం కింద  10,000కు పైగా  క్లెయిమ్ లను ఆమోదించాయి.  ఇది  MSMEలకు రూ. 256 కోట్ల సహాయ గ్రాంటు విడుదలకు దారితీసింది. దీనివల్ల బ్యాంక్ రుణాల ప్రవాహం ఆగకుండా  నిశ్చయం చేయడమే కాక ఆ సంస్థలను హామీల నుంచి విముక్తుల్ని చేసింది.  

          మంత్రిత్వ శాఖలన్నింటిలో అన్నింటికన్నా ఎక్కువగా పెట్రోలియం, సహజ వాయువు (MoPNG) మంత్రిత్వ శాఖ నుంచి రూ. 116.47 కోట్లు సహాయం మంజూరైంది. MoPNG పరిపాలనా  నియంత్రణ పరిధిలో  ఉన్న ఏజెన్సీలు పరిష్కరించిన  క్లెయిమ్‌లు, చెల్లించిన మొత్తం ఇందులో ఉన్నాయి.

       పరిష్కరించిన  క్లెయిమ్‌లు మరియు చెల్లించిన మొత్తం వారీగా  మొదటి ఐదు మంత్రిత్వ శాఖల పనితీరు క్రింది పట్టికలో ఇవ్వడం జరిగింది.

మంత్రిత్వ శాఖ పేరు          చెల్లించిన మొత్తం (కోట్లలో)     ఆమోదించిన క్లెయిములు

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ    116.47           2,807

రైల్వే మంత్రిత్వ శాఖ                                             79.16          2,090

రక్షణ మంత్రిత్వ శాఖ                                             23.45             424

ఉక్కు మంత్రిత్వ శాఖ                                            14.48              244

విద్యుత్ మంత్రిత్వ శాఖ                                           6.69              119

       MSMEలకు ఊరట కలిగించడం కోసం వివాదం సే విశ్వాస్ - I సహాయ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి తమ 2023-24 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.    కేంద్ర ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ 17.04.2023న
ఈ పథకాన్ని  ప్రారంభించింది.    ఆర్ధిక ఉపశమనం కోసం GeM పోర్టల్‌లో క్లెయిమ్‌లను సమర్పించడానికి చివరి తేదీ 31.07.2023.
లబ్ధిదారులకు పథకం కింద ఉపశమనం / ప్రయోజనం  చేకూర్చడం కోసం GeM ఒక ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేసింది.

        క్లెయిమ్‌ లకు సంబంధించిన దావాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వ వ్యయ విభాగం పథకం వివరాలను, విధానాన్ని వివరిస్తూ 11.04.2023న సూచనలు జారీ చేసింది.  ఆ తరువాత పథకానికి సంబంధించిన పనుల సేకరణ, సంపాదన ఒప్పందాలను చేర్చడానికి
వీలుగా విస్తరించడం జరిగింది.  పనితీరు భద్రత, బిడ్ భద్రత మరియు లిక్విడేటెడ్ నష్టాలలో 95% వరకు సహాయం రూపంలో తిరిగి చెల్లించడానికి /ఉపశమనం చేకూర్చడానికి  ఏర్పాటు చేశారు.  ఒప్పందాలు అమలు చేయడంలో విఫలమైన కారణంగా నిషేధించిన
MSMEలకు కూడా సహాయం అందించడం జరిగింది.  కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన MSME రంగాన్ని ప్రోత్సహించడంలో మరియు నిలబెట్టడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ పథకం కింద అందించిన సహాయం ఇది. 

****(Release ID: 1961536) Visitor Counter : 76