పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

అరుణాచల్ ప్రదేశ్ లోని తేజు విమానాశ్రయంలో నూతన మౌలిక సదుపాయాలను ప్రారంభించిన శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా


రూ.170 కోట్ల వ్యయంతో కొత్తగా అభివృద్ధి చేసిన ఈ మౌలిక సదుపాయాల్లో రన్ వే విస్తరణ, కొత్త ఆప్రాన్, కొత్త టెర్మినల్ భవనం, ఫైర్ స్టేషన్ కమ్ ఎ టి సి టవర్ ఉన్నాయి.

ఉడాన్ 5.0 పథకం కింద ఇటానగర్ నుంచి ఢిల్లీకి, ఇటానగర్ నుంచి జోరాహత్ కు, ఇటానగర్ నుంచి రూప్సీకి మూడు డైరెక్ట్ మార్గాలను ప్రకటించిన సింధియా: త్వరలో ఈ మార్గాలు ప్రారంభం

Posted On: 24 SEP 2023 7:42PM by PIB Hyderabad

పౌరవిమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా రోజు అరుణాచల్ ప్రదేశ్ లోని తేజు విమానాశ్రయంలో నూతనంగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.

తేజు విమానాశ్రయం  తేజు పట్టణంలో ఉన్న ఒక దేశీయ విమానాశ్రయం, ఇది ఒకే రన్ వే ద్వారా పని చేస్తోంది. 212 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన విమానాశ్రయం ఏటీఆర్ 72 రకం విమానాల కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ( ) తేజు విమానాశ్రయం అభివృద్ధి, అప్ గ్రేడేషన్ పనులను చేపట్టింది. రూ.170 కోట్లతో చేపట్టిన పనుల్లో రన్ వే విస్తరణ (1500 మీటర్లు×30 మీటర్లు), 02 నంబర్లకు కొత్త ఆప్రాన్ నిర్మాణంఏటీఆర్ 72 రకం విమానం, కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం, ఫైర్ స్టేషన్ కమ్ ఏటీసీ టవర్ ఉన్నాయి.

సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు.

ఈశాన్య భారతాన్ని ప్రధాని మోదీ 'హీరా' (డైమండ్ ఆఫ్ ఇండియా)గా మార్చారని, అంటే హైవే, ఇంటర్నెట్, రైల్వే ,ఏవియేషన్ - ప్రాంత సమగ్ర , సమ్మిళిత అభివృద్ధికి దోహదపడే నాలుగు ప్రధాన భాగాలు అని ఆయన అన్నారు. అనంతరం రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్ సి ఎస్) - ఉడాన్ ప్రాంతానికి ఎంతో మేలు చేసిందని వివరించారు. ఉడాన్ పథకం ద్వారా పౌర విమానయానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యీకరించారన్నారు. 2.50 లక్షలకు పైగా ఉడాన్ విమానాలు పథకం కింద 1.37 కోట్ల మందికి పైగా ప్రయాణించడానికి సహాయపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పౌర విమానయాన రంగం స్థితిగతుల గురించి ఆయన మాట్లాడారు. 2014 వరకు అరుణాచల్ ప్రదేశ్ లో విమానాశ్రయాలు లేవని, తొమ్మిదేళ్ల కాలంలో 4 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్నామని చెప్పారు. తేజు వద్ద నూతన టెర్మినల్ భవనం ప్రాంత కనెక్టివిటీని మరింత పెంచుతుందని, ప్రాంత ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

ఉడాన్ 5.0 పథకం కింద ఇటానగర్ నుంచి ఢిల్లీకి, ఇటానగర్ నుంచి జోరాహత్ కు, ఇటానగర్ నుంచి రూప్సీకి మూడు డైరెక్ట్ మార్గాలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్ సి ఎస్ ఉడాన్ పథకం కింద తేజు విమానాశ్రయం 2018లో ప్రారంభమైంది. విమానాశ్రయం ప్రస్తుతం అలయన్స్ ఎయిర్ అండ్ ఫ్లైబిగ్ ఎయిర్లైన్స్ ద్వారా రెగ్యులర్ షెడ్యూల్డ్ విమానాల తో దిబ్రూగఢ్, ఇంఫాల్ , గౌహతితో అనుసంధానించబడి ఉంది.

టెర్మినల్ బిల్డింగ్ ప్రత్యేకతలు

  • టెర్మినల్ విస్తీర్ణం:  4000.మీ.
  • రద్దీ సమయంలో సేవా సామర్ధ్యం:  300 ప్రయాణీకులు
  • చెక్-ఇన్ కౌంటర్లు: 05 + (భవిష్యత్తులో 03)
  • అరైవల్ కరోసెల్స్: 02                        
  • ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ బేలు: 02 - ఎటిఆర్-72 రకం విమానం.

 సుస్థిర (సస్టెయినబిలిటీ) అంశాలు

  • డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్.
  • ఎనర్జీ ఎఫీసియెంట్ హెచ్ వి సి అండ్ లైటింగ్ సిస్టమ్.
  • తక్కువ హీట్ గెయిన్ గ్లేజింగ్.
  • సి బి సి -కంప్లైంట్ ఎక్విప్ మెంట్
  • సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్
  • శుద్ధి చేసిన నీటిని ఫ్లషింగ్, హార్టికల్చర్ అవసరాలకు తిరిగి ఉపయోగించడం.
  • వర్షపునీటి సంరక్షణ సుస్థిర పట్టణ డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానించబడింది.
  • సమర్థవంతమైన వాటర్ ఫిక్సర్ వినియోగం .

ప్రాజెక్టు ప్రయోజనాలు

  •  మరింత రద్దీని నిర్వహించడానికి వీలుగా విమానాశ్రయ సామర్ధ్యం విస్తరణ
  •  దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ అందించడం
  •  పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు ఊతం
  •   ప్రాంతం  మౌలిక సదుపాయాల అభివృద్ధి , ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం

A group of people standing in front of a large black boardDescription automatically generated

కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సిఎం శ్రీ చౌనా మెయిన్, అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక , పౌర విమానయాన మంత్రి శ్రీ నకప్ నాలో, ఎంపి (లోక్ సభ) శ్రీ నబమ్ రెబియా, ఎంపి (లోక్ సభ) శ్రీ తాపిర్ గావో, భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వుమ్లున్ మంగ్ వుల్నామ్ పాల్గొన్నారు.

తేజు లోహిత్ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం . ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ జిల్లాకు ప్రధాన కేంద్రం. పచ్చని అడవులు, చుట్టూ కొండలతో ప్రకృతి రమణీయతకు పట్టణం ప్రసిద్ధి చెందింది.

***



(Release ID: 1960761) Visitor Counter : 70