రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కార్వార్ నౌకాదళ స్థావరం, యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను సందర్శించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్


కీలక మౌలిక సదుపాయాలు, ఇతర వ్యూహాత్మక కార్యక్రమాల పురోగతిపై సమీక్ష

प्रविष्टि तिथि: 24 SEP 2023 6:02PM by PIB Hyderabad

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) జనరల్ అనిల్ చౌహాన్, ఈ నెల ప్టెంబర్ 23న, కార్వార్‌లోని నౌకాదళ స్థావరాన్ని, యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను సందర్శించారు. నౌకాదళ స్థావరంలో కీలక మౌలిక సదుపాయాలు, వసతి, ఇతర వ్యూహాత్మక కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

కార్వార్ నౌకాదళ ప్రాంతం, ప్రాజెక్ట్ సీబర్డ్ సీనియర్ అధికారులతోనూ సీడీఎస్‌ సంభాషించారు. దూరదృష్టితో ఆలోచించే, అమలు పరిచే ప్రాంతంగా ఆ స్థావరాన్ని మార్చాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. కొత్త ఉద్బవిస్తున్న భద్రత సమస్యలపై ప్రతిస్పందించే సామర్థ్యంతో, భవిష్యత్ సవాళ్ల కోసం స్థావరం సంసిద్ధంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 

***


(रिलीज़ आईडी: 1960573) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil