వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
'బహిరంగ విఫణి ద్వారా అమ్మకం పథకం' (దేశీయ) కింద 13 ఈ-వేలాల్లో 18.09 ఎల్‌ఎంటీ గోధుమలు విక్రయించిన కేంద్రం
Posted On:
22 SEP 2023 12:56PM by PIB Hyderabad
దేశంలో గోధుమలు, గోధుమ పిండి చిల్లర ధరలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలో భాగంగా, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), 'బహిరంగ విఫణి ద్వారా అమ్మకం పథకం' (దేశీయ) [ఓఎంఎస్‌ఎస్(డి)] కింద వారంవారీ ఈ-వేలం ద్వారా గోధుమలు అమ్ముతోంది. క్వింటాల్‌కు రూ.2125/- రిజర్వ్ ధర చొప్పున ఎఫ్‌సీఐ విక్రయిస్తోంది, ప్రస్తుత గోధుమల కనీస మద్దతు ధరకు ఇది సమానం.
దేశవ్యాప్తంగా 480 పైగా కేంద్రాల ద్వారా ప్రతి వారం వేలంలో 2.00 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ఎఫ్‌సీఐ అందుబాటులోకి తెస్తోంది. 2023-24 సంవత్సరంలో, 21.09.2023 వరకు మొత్తం 13 ఈ-వేలాలు నిర్వహించింది, 18.09 ఎల్‌ఎంటీల గోధుమలు విక్రయించింది.
ఈ ఏడాది ఆగస్టులో గోధుమల సగటు అమ్మకపు ధర క్వింటాల్‌కు రూ.2254.71గా ఉంది, 20.09.23న జరిగిన ఈ-వేలంలో ఇది రూ.2163.47కు తగ్గింది. బహిరంగ విఫణిలో గోధుమల ధరలు తగ్గుముఖం పట్టాయని ఇది సూచిస్తోంది. ప్రతి వారం నిర్వహించే ఈ-వేలంలో, నిర్దేశించిన పరిమాణంలో 90% దాటకుండా విక్రయాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తగినన్ని గోధుమల నిల్వలు ఉన్నాయని ఇది సూచిస్తోంది.
ఓఎంఎస్‌ఎస్(డి) విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా బహిరంగ విఫణిలో గోధుమ ధరలు నియంత్రణలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం నియంత్రించింది. 2023-24లో మిగిలిన కాలానికి ఓఎంఎస్‌ఎస్(డి) కొనసాగించడానికి కేంద్రం వద్ద తగినన్ని గోధుమ నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
****
(Release ID: 1959655)
Visitor Counter : 208