శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాలకు "రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం" పేరిట జాతీయ అవార్డులు ప్రధానం చేయనున్న కేంద్రం
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగంలో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అత్యున్నత పురస్కారంగా "రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం"
Posted On:
21 SEP 2023 10:13AM by PIB Hyderabad
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాలకు "రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం" పేరిట జాతీయ అవార్డులు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ (RVP) యొక్క లక్ష్యం శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు వ్యక్తిగతంగా లేదా బృందాలుగా ఏర్పడి వినూత్నంగా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో చూపించని ప్రతిభ, శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల అభివృద్ధికి అందించిన సహకారానికి గుర్తింపుగా "రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం" అవార్డులు ప్రదానం చేస్తారు.
రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాలకు రంగంలో అత్యున్నత పురస్కారంగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల అభివృద్ధికి, సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలు చేసిన వారు లేదా ఆవిష్కరణల పరంగా విశిష్ట సహకారాన్ని అందించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు/సాంకేతిక వేత్తలు/ఆవిష్కర్తలు లేదా వ్యక్తిగతంగా పనిచేస్తున్న చేసే వ్యక్తులు అవార్డులకు అర్హులు. విదేశాల్లో నివసిస్తూ భారతదేశ ప్రజలు, సమాజానికి ప్రయోజనం చేకూర్చే అసాధారణమైన సహకారం అందించిన వారు కూడా అవార్డులకు అర్హులు. అవార్డులు క్రింది నాలుగు విభాగాల్లో ప్రధానం చేస్తారు:-
విజ్ఞాన రత్న (విఆర్ ) అవార్డు: శాస్త్ర, సాంకేతిక రంగంలో సాధించిన జీవితకాల విజయాలు , కృషిని గుర్తింపుగా విజ్ఞాన రత్న (విఆర్ ) అవార్డు అందిస్తారు.
విజ్ఞాన్ శ్రీ (యుఎస్) అవార్డు : శాస్త్ర , సాంకేతిక రంగాలలో విశిష్ట సేవలకు గుర్తింపుగా విజ్ఞాన్ శ్రీ (యుఎస్) అవార్డు ప్రదానం చేస్తారు.
విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్ (వివై- ఎస్ఎస్ బి) అవార్డు : 45 సంవత్సరాల వయస్సు వరకు శాస్త్ర , సాంకేతిక రంగాల అభివృద్ధికి అసాధారణమైన సహకారం అందించిన యువ శాస్త్రవేత్తలను గుర్తించి ప్రోత్సహించడానికి విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్ (వివై- ఎస్ఎస్ బి) అవార్డు అందిస్తారు.
విజ్ఞాన్ బృందం (విటి ) అవార్డు : ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు/పరిశోధకులు/ఆవిష్కర్తలతో కూడిన బృందానికి విజ్ఞాన్ బృందం (విటి ) అవార్డు ప్రధానం చేస్తారు. ఏదైనా శాస్త్ర, సాంకేతిక రంగంలో ఒక బృందంగా ఏర్పడి అసాధారణమైన సహకారం అందించే వారికి విజ్ఞాన్ బృందం (విటి ) అవార్డు అందిస్తారు.
శాస్త్ర విజ్ఞాన రంగం లేదా దేశాభివృద్ధికి దోహదపడే వినూత్న సాంకేతికతలు/ఉత్పత్తుల అభివృద్ధికి కృషి చేసిన, ఆవిష్కరణలు చేసిన ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలో ఏదైనా సైన్స్ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు అవార్డుకు అర్హులు.
విదేశాల్లో నివసిస్తూ భారతదేశ ప్రజలు, సమాజానికి ప్రయోజనం చేకూర్చే అసాధారణమైన సహకారం అందించిన వారు కూడా అవార్డులకు అర్హులుగా ఉంటారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ , కంప్యూటర్ సైన్స్, ఎర్త్ సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సైన్స్ లాంటి 13 రంగాల్లో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ప్రదానం చేస్తారు. లింగ సమానత్వం తో ప్రతి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తారు.
రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అవార్డు కోసం అందిన అన్ని నామినేషన్లు కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (PSA) నేతృత్వంలో ఏర్పాటైన రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార కమిటీ (RVPC) పరిశీలిస్తుంది. కమిటీ సభ్యులుగా శాస్త్ర విభాగాల కార్యదర్శులు,శాస్త్ర, ఇంజనీరింగ్ సాంకేతిక రంగాలకు చెందిన విద్యా వేత్తలు,శాస్త్ర , సాంకేతిక రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖ శాస్త్రవేత్తలు , సాంకేతిక నిపుణులు వ్యవహరిస్తారు.
ఈ అవార్డుల కోసం ప్రతి సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 (నేషనల్ సైన్స్ డే) వరకు స్వీకరిస్తారు. . ఈ అవార్డులను ప్రతి సంవత్సరం మే 11న (జాతీయ సాంకేతిక దినోత్సవం) ప్రకటిస్తారు. అన్ని విభాగాలకు సంబంధించి అవార్డుల ప్రదానోత్సవం ఆగస్టు 23న (జాతీయ అంతరిక్ష దినోత్సవం) జరుగుతుంది. అన్ని సర్టిఫికెట్, పతకం ప్రధానం చేస్తారు.
ఈ కొత్త జాతీయ అవార్డులు భారత ప్రభుత్వంచే అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు సాధించిన, విజయాలు, దేశాభివృద్ధికి వారు చేసిన కృషిని గుర్తించి గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా నూతన జాతీయ అవార్డులు ఉంటాయి. మొత్తం ఎంపిక ప్రక్రియలో పారదర్శకత , నిష్పక్షపాత లతో జరుగుతుంది.ఇతర జాతీయ అవార్డులతో సమాన హోదాను "రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం" కలిగి ఉంటుంది.
<><><>
(Release ID: 1959292)
Visitor Counter : 246
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil