మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మత్స్యశాఖ వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక (ACBP)ని ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేసిన కేంద్ర మత్స్య,పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా సేవలు అందించడం, కార్యక్రమాల అమలు, కీలక ప్రభుత్వ బాధ్యతల అమలులో కీలక పాత్ర పోషించనున్న వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక
Posted On:
20 SEP 2023 4:44PM by PIB Hyderabad
మత్స్యశాఖ వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక (ACBP)ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు. కార్యక్రమంలో సిబిసి సభ్యుడు(పరిపాలన)శ్రీ ప్రవీణ్ పరదేశి, కార్యదర్శ డాక్టర్ అభిలాక్ష్ లిఖి, సంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా మత్స్య శాఖ, సిబిసి , గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ పర్షోత్తం రూపాలా అధికారులు,సిబ్బంది , సామర్థ్య నిర్మాణ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి సామర్ద్యాన్ని పెంపొందించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిందని అన్నారు.సామర్థ్య నిర్మాణం కోసం వార్షిక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం అయ్యిందన్నారు. మత్స్య శాఖ సిద్ధం చేసిన వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక సేవలు అందించడం, కార్యక్రమాల అమలు, కీలక ప్రభుత్వ బాధ్యతల అమలులో కీలక పాత్ర వహిస్తుందన్నారు. అవసరమైన సామర్థ్యాలను పొందడానికి ప్రాథమిక శిక్షణకు అధికారులు, సిబ్బంది హాజరు కావాలన్నారు. దీనివల్ల అధికారులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుని మెరుగైన పనితీరు కనబరచడానికి.అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
మత్స్యశాఖ నూతన సాంకేతికతలను అవలంబిస్తున్న సమయంలో ఈ ప్రణాళిక అత్యంత కీలకంగా ఉంటుందని శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ అన్నారు. భారతదేశంలో అనేక మత్స్య సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపిన డాక్టర్ మురుగన్ మత్స్య రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. , భారతదేశంలో మత్స్య రంగం అభివృద్ధిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ ఎల్. మురుగన్ పేర్కొన్నారు.
మత్స్య శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ప్రాముఖ్యత వివరించారు. నియమాల-ఆధారిత వ్యవస్థ నుండి పాత్ర-ఆధారిత వ్యవస్థకు పరివర్తనను సులభతరం చేసే వార్షిక కార్యాచరణ ప్రణాళిక అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుందన్నారు.
వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కోసం అమలు చేయనున్న శిక్షణ కార్యక్రమాల వివరాలను సిబిసి సభ్యులు శ్రీ ప్రవీణ్ పరదేశి వివరించారు.
వార్షిక కార్యాచరణ ప్రణాళిక ని అమలు చేయడానికి, కొనసాగించడానికి మత్స్య శాఖలో కెపాసిటీ బిల్డింగ్ యూనిట్ (CBU) ఏర్పాటయింది. వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం అవసరమైన నిధులు విడుదల అయ్యాయి.ఉద్యోగుల శిక్షణ అవసరాలకు కెపాసిటీ బిల్డింగ్ యూనిట్ ప్రాధాన్యతనిస్తుంది. శిక్షణలు ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతాయి. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి సంస్థలు, ఇతర భాగస్వామ్య సంస్థలను శాఖ గుర్తించింది. వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక సామర్థ్యాన్ని నిర్ధారించడానికి శిక్షణ ద్వారా పెరిగిన సామర్ధ్యాన్ని శాఖ అంచనా వేస్తుంది.
***
(Release ID: 1959255)
Visitor Counter : 126