గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
'ఈశాన్య ప్రాంతం కోసం గిరిజన ఉత్పత్తుల ప్రచారం' (పిటిపి-ఎన్ఈఆర్ 2.0) పథకం 2వ దశను 21 సెప్టెంబర్, 2023 నుండి ప్రారంభించనున్న ట్రైఫెడ్
పిటిపి-ఎన్ఈఆర్ 1.0 సమయంలో, ట్రైఫెడ్ 44 తెగల నుండి 2500 మంది కళాకారులను చేరుకుంది, 1056 మందిని ఎంప్యానెల్ చేసింది, అలాగే శిక్షణ క్యాప్సూల్స్ కోసం 1465 మందిని గుర్తించింది.
ఫేజ్ 1లో ట్రైఫెడ్ ద్వారా 3100 పైగా గిరిజన ఉత్పత్తులు సేకరించడం జరుగుతోంది
Posted On:
20 SEP 2023 1:49PM by PIB Hyderabad
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) 'ఈశాన్య ప్రాంతం కోసం గిరిజన ఉత్పత్తుల ప్రచారం' (పిటిపి-ఎన్ఈఆర్ 2.0) పథకం రెండవ దశని 21 సెప్టెంబర్ నుండి 10 నవంబర్ వరకు నిర్వహించబోతుంది. ఈ దశలో, ట్రైఫెడ్, ఈశాన్య హస్తకళలు, హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఈహెచ్హెచ్డిసి), కేంద్ర డోనర్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పరిపాలన బృందాలు అనేక బృందాలతో 29 జిల్లాలు - ఈశాన్య ప్రాంతంలో పర్యటించి, గిరిజన కళాకారులను చేరతాయి. కళాకారులు, వారి సాంస్కృతిక గొప్పతనాన్ని, వారసత్వాన్ని దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, ఈశాన్య ప్రాంతంలోని షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాల కోసం ఈశాన్య ప్రాంతం (పీటపీ-ఎన్ఈఆర్) నుండి గిరిజన ఉత్పత్తుల ప్రచారం కోసం 'మార్కెటింగ్, లాజిస్టిక్స్ డెవలప్‌మెంట్' అనే సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌ను 18 ఏప్రిల్, 2023న మణిపూర్ లో ప్రారంభించారు. (లింక్: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1917747) ట్రైఫెడ్ ద్వారా అదే రోజున పథకం ప్రారంభమైంది. గిరిజన హస్తకళాకారుల కోసం సాంకేతికత ద్వారా వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ మరియు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ద్వారా వారి ఉత్పత్తులను మార్కెట్‌లకు యాక్సెస్ చేయడం ద్వారా జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేయడం, ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
పథకం మొదటి దశలో (పీటపీ-ఎన్ఈఆర్ 1.0), ఎనిమిది రాష్ట్రాలు కవర్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహిత సహకారంతో ట్రైఫెడ్, ఎన్ఈహెచ్హెచ్డిసి బృందాలు 38 జిల్లాలను సందర్శించాయి. ఈ బృందాలు ఏప్రిల్-మే, 2023లో 64 ట్రైబల్ ఆర్టిసన్స్ ఎంపానెల్‌మెంట్ మేళాలను (టిఏఈఎం) నిర్వహించాయి. ఈ చొరవతో, ట్రైఫెడ్ 44 తెగలకు చెందిన 2526 మంది కళాకారులను చేరుకుంది, వారిలో 1056 మందిని ఎంప్యానెల్ చేసి 1465 మందిని శిక్షణ క్యాప్సూల్స్ కోసం గుర్తించింది. వస్త్రాలు, అటవీ ఉత్పత్తులు, వెదురు వస్తువులు, ఆభరణాలు, కుండలు, పెయింటింగ్‌లు, మరిన్నింటి నుండి ఆకట్టుకునే 3115 ఉత్పత్తులను సేకరించారు.
Products displayed by SHGs, Aizawl, Mizoram TAeM at Basar, Arunachal Pradesh
టీఈఏఎం వెస్ట్ జైంతియా హిల్స్, మేఘాలయలో ఉత్పత్తులు ప్రదర్శన మణిపూర్ కోసం కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన
టీఈఏఎం గాంగ్టక్, సిక్కిం, కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన ఉత్తర త్రిపుర కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన
అస్సాం బక్సా లో గిరిజన ఆభరణాలు ప్రదర్శన డీసీ, టీఈఏఎం ట్రైఫెడ్ వోఖా, నాగాలాండ్‌లో కళాకారుల ఉత్పత్తుల పరిశీలన
ఎన్ఈఆర్ లో రెండో దశ టీఈఏఎం షెడ్యూల్ :పీటీపీ-ఎన్ఈఆర్ 2.0 స్కీం
- అరుణాచల్ ప్రదేశ్
East Kameng (Seppa) 21-Sep-23
East Kameng (Seppa) 22-Sep-23
Kurung Kumey (Sangram) 24-Sep-23
Kra Daadi (Palin ) 26-Sep-23
Upper Subansiri / 29-Sep-23
Kamle (Daporijo)
|
- నాగాలాండ్
Peren 21-Sep-23
Zunheboto 23-Sep-23
Noklak 25-Sep-23
Longleng 27-Sep-23
Mon 29-Sep-23
|
- త్రిపుర
Sephaijala 27-Sep-23
Unakoiti 29-Sep-23
Unakoti 30-Sep-23
Khowai 03-Oct-23
Khowai 04-Oct-23
|
- మేఘాలయ
Tura (West Garo Hills) 04-Oct-23
South West Garo Hills 06-Oct-23
East Garo Hills 09-Oct-23
North Garo Hills 11-Oct-23
South West Khashi 13-Oct-23
Hills
|
- అస్సాం
Kokrajhar 09-Oct-23
Gopalpara 11-Oct-23
Kamrup Rural (BOKO) 13-Oct-23
West Karbi Anglong 16-Oct-23
(Hamren)
Morigaon 18-Oct-23
|
- మిజోరాం
Kolasib 30-Oct-23
Kolasib 31-Oct-23
Khawzawl 02-Nov-23
Champai 04-Nov-23
Mamit 06-Nov-23
|
- సిక్కిం
Soreng 02-Nov-23
Soreng 03-Nov-23
Mangan (Dzongu) 06-Nov-23
Mangan (Chungthang) 08-Nov-23
Pakyong 10-Nov-23
|
***
(Release ID: 1959234)
Visitor Counter : 213