కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2023 జులై నెలలో ఈఎస్‌ఐ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న 19.88 లక్షల మంది కొత్త ఉద్యోగులు
కొత్తగా నమోదైన వాళ్లలో 25 సంవత్సరాల వయస్సు గల యువ ఉద్యోగులు 9.40 లక్షల మంది
2023 జులై నెలలో ఈఎస్‌ఐ పథకం కింద నమోదైన దాదాపు 27,870 కొత్త సంస్థలు
2023 జులైలో ఈఎస్‌ఐ పథకం కిందకు వచ్చిన 52 మంది లింగమార్పిడి ఉద్యోగులు
Posted On:
20 SEP 2023 1:39PM by PIB Hyderabad
2023 జులై నెలలో 19.88 లక్షల మంది కొత్త ఉద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారని ఈఎస్‌ఐసీ తాత్కాలిక ఉద్యోగ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2023 జులై నెలలో దాదాపు 27,870 కొత్త సంస్థలు నమోదయ్యాయి, 'ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ' సామాజిక భద్రత గొడుగు కిందకు వచ్చాయి.
దేశంలోని యువత కోసం భారీగా ఉద్యోగ కల్పన జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జులై నెలలో నమోదైన మొత్తం 19.88 లక్షల మంది ఉద్యోగుల్లో, 25 సంవత్సరాల వయస్సు గల యువ ఉద్యోగులు 9.40 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది 47.9%.
2023 జులైలో మహిళా ఉద్యోగుల నికర నమోదులు 3.82 లక్షలు. అదే నెలలో 52 మంది లింగమార్పిడి ఉద్యోగులు కూడా ఈఎస్‌ఐ పథకం కింద పేరు నమోదు చేసుకున్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలు అందించడానికి ఈఎస్‌ఐసీ కట్టుబడి ఉంది.
ఈ సమాచారం నిరంతరం మారుతుంది కాబట్టి ఉద్యోగ గణాంకాలను తాత్కాలిక సమాచారంగా చూడాలి.
***
(Release ID: 1959010)