గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ వారాంతంలో స్వచ్ఛతకు యువత ప్రాధాన్యత !


ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2వ ఎడిషన్‌లో పాల్గొన్న 4000కి పైగా నగర బృందాలు

Posted On: 19 SEP 2023 10:49AM by PIB Hyderabad

ఇండియన్ స్వచ్ఛతా లీగ్ (ISL) 2వ ఎడిషన్‌లో 4000కి పైగా నగరాలు పాల్గొనడంతో స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ కొత్త ఉత్సాహాన్ని పొందింది.  స్వచ్ఛత సంబంధిత కార్యకలాపాలలో యువత పాల్గొనేలా  ప్రోత్సహించడానికి యువత నేతృత్వంలోని ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఇండియన్ స్వచ్ఛత లీగ్ అమలు జరుగుతోంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ లో   భాగంగా స్వచ్ఛత కోసం కృషి చేస్తున్న నగర బృందాలు ఉత్సాహంగా బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలు, కొండలను శుభ్రం చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (SBM-U) కింద 2022 లో ఇండియన్ స్వచ్ఛత లీగ్ ప్రారంభమయ్యింది.  చెత్త రహిత నగరాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా అమలు జరుగుతున్న ఇండియన్ స్వచ్ఛత లీగ్ కార్యక్రమంలో  50 లక్షల మందికి పైగా  వాలంటీర్లు కలిసి పని చేశారు. 

శ్రమదానం ద్వారా స్వచ్ఛత సాధించడానికి పక్షోత్సవాలు జరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్ 15 న ప్రారంభమైన పక్షోత్సవాలు అక్టోబర్ 2 వరకు అమలు జరుగుతాయి.  మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ దివస్ (SBD)గా జరుపుకుంటారు.  పక్షోత్సవారంలో భాగంగా  సఫాయి మిత్ర సురక్ష శివార్,  స్వచ్ఛత దివస్ కార్యక్రమాలు అమలు జరుగుతాయి. 

ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 కోసం నగరాలు ఆసక్తికరమైన  పేర్లు ఎంచుకున్నాయి. ప్రముఖ  షట్లర్ పి.వి.  సింధు, నడకలో గుర్తింపు పొందిన రిపుదామన్ బెవ్లీ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.చండీగఢ్ ఛాలెంజర్స్, హున్‌సూర్ హీరోస్, విక్తమసింగపురం, దండేలి స్వచ్ఛత వారియర్స్, కుసాగి ఛాంపియన్స్, ఆర్సీకేరే ఆర్మీ పేరుతొ బృందాలు పోటీలో పాల్గొనడానికి నమోదు అయ్యాయి. 

ఇండియన్ స్వచ్ఛత లీగ్ లో భాగంగా  నగరాలు ప్రభావవంతమైన పరిశుభ్రత కార్యకలాపాలను నిర్వహించి  అందమైన కుడ్యచిత్రాలు ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు మానవహారాలుగా ఏర్పడి స్వచ్ఛత కోసం ప్రజల్లో  చైతన్యం కలిగించాయి. కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. భోపాల్‌లో ఒకప్పుడు డంప్‌గా ఉన్న ప్రదేశంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఎన్సీసీ క్యాడెట్‌లు, స్కౌట్స్  గైడ్స్ ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

దాదాపు 4,000 మంది పిల్లలు భారతదేశం మ్యాప్‌ను రూపొందించడానికి కర్ణాటకలోని దావణగెరె లోజరిగిన  కార్యక్రమంలో పాల్గొన్నారు, డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ చండీగఢ్ ఛాలెంజర్స్ 10,000 మందికి ఆహారం అందించడానికి SUP ఉచిత మహా లంగర్‌ను నిర్వహించింది, అలెప్పీలో సరస్సులను శుభ్రపరచడానికి 'సేవ్ ది లేక్' పేరుతో  ఊరేగింపు నిర్వహించారు.

  కార్యక్రమంలో  వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఉత్సాహంగాపాల్గొని  స్వచ్ఛత కోసం అమలు జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  శ్రీ యోగి ఆదిత్యనాథ్ స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో 5 మంది పారిశుద్ధ్య సిబ్బందిని  సత్కరించారు. ఇండియన్ స్వచ్ఛత లీగ్   టీ-షర్టులు, టోపీలను పంపిణీ చేశారు. మణిపూర్ సీఎం ఎన్. బీరెన్ సింగ్ మణిపూర్‌లో స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని ప్రారంభించారు.  స్వచ్ఛ భారత్ కోసం ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి 10, 5, 2 కిలోమీటర్ల   'స్వచ్ఛత లీగ్ మారథాన్' ను  ఇండియన్ స్వచ్ఛతా లీగ్‌ లో భాగంగా  ప్రారంభించారు.

****

 

 


(Release ID: 1958760) Visitor Counter : 179